మాడుగుల ఇన్‌చార్జి ఎంపీపీగా రాజారామ్‌ | - | Sakshi
Sakshi News home page

మాడుగుల ఇన్‌చార్జి ఎంపీపీగా రాజారామ్‌

Jan 30 2024 1:14 AM | Updated on Feb 7 2024 11:51 AM

- - Sakshi

రాజారామ్‌కు ఉత్తర్వుల కాపీ అందజేస్తున్న జెడ్పీ సీఈవో పోలినాయుడు

మాడుగుల: వైస్‌ ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్‌కు ఇన్‌చార్జి ఎంపీపీ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జెడ్పీ సీఈవో ఎం. పోలినాయుడు సోమవారం మాడుగుల మండల పరిషత్‌ కార్యాలయంలో రాజారామ్‌కు ఆర్డర్‌ కాపీ అందజేశారు. మాడుగుల ఎంపీపీ రామధర్మజ వ్యక్తిగత కారణాలతో తన పదవికి ఇటీవల రాజీనామా చేసిన విదితమే. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆ బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కిముడు రమణమ్మ, వైస్‌ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్‌, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ గోపాల్‌రావు, ససర్పంచ్‌ ఎడ్ల కళావతి, వీరవిల్లి కోఆపరేటివ్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కొరుకొండ చెల్లంనాయుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు కాత వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement