దిశ యాప్‌పై అవగాహన | Sakshi
Sakshi News home page

దిశ యాప్‌పై అవగాహన

Published Thu, Nov 9 2023 12:24 AM

దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి చూపిస్తున్న విద్యార్థినులు  - Sakshi

అరకులోయ టౌన్‌: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం దిశ యాప్‌పై మహిళా పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ అధ్యక్షురాలు పి. సుందరిరాణి మాట్లాడారు. ప్రతీ విద్యార్థిని మొబైల్‌లో దిశ యాప్‌ ఉండాలన్నారు. మహిళా పోలీసు జె.పద్మ మాట్లాడుతూ దిశ యాప్‌ వినియోగం, ప్రయోజనాలను వివరించారు. విద్యార్థినులతో దిశ యాప్‌ లోడ్‌ చేయించారు. ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ కె. భరత్‌ కుమార్‌ నాయక్‌, డాక్టర్‌ సీహెచ్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ సభ్యులు వై. విజయలక్ష్మి, ఎం. అనితా కుమారి, జి. సంధ్య, ఎస్‌. అన్నపూర్ణ, మహిళా పోలీసులు కె.ప్రియాంక, జెఎం. జ్యోతి, టి. కాంతమ్మ, ఎస్‌. రాజేశ్వరి, భవాని పాల్గొన్నారు.

Advertisement
Advertisement