-
ఫస్ గయే యారో రిలీజ్ ఎప్పుడంటే?
మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఏలీన టుతేజా, రేష్మా బరి, నజియా ఖాన్, నిర్మల్ దిలీప్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘ఫస్ గయే యారో’. యూసఫ్ సర్తి దర్శకత్వంలో రూపేష్ డి. గోహిల్, ఎమ్. విజయలక్ష్మి, ఓం ప్రకాష్ భట్, ధనుంజయ్ మాసూమ్ నిర్మించిన ఈ సినిమా రాజశ్రీ ఫిల్మ్స్ ద్వారా ఈ నెల 21న రిలీజవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హిలేరియస్ హారర్ ఎంటర్టైనర్ ఇది. ప్రేక్షకులకు హైదరాబాద్ బిర్యానీలాంటి పసందైన అనుభూతి పంచేందుకు దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. డెక్కన్ (హైదరాబాద్ హిందీ) సినిమాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది కాబట్టి ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలి’’ అన్నారు. మస్త్ అలీ, యూసఫ్ సర్తి, తెలంగాణ స్టేట్ మైనారిటీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, చిత్ర సహనిర్మాత సోను గుప్తా, ఫస్ట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్తేకర్ షరీఫ్ పాల్గొన్నారు. -
పాత బస్తీకి మాత్రమే కాదు!
హైదరాబాదీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘డెక్కన్ వుడ్’ నుంచి రానున్న తాజా వినోదాత్మక చిత్రం ‘సలామ్ జిందగీ’. గతంలో డెక్కన్ వుడ్ నుంచి వచ్చిన ‘దావత్ ఎ షాదీ’ హిట్ అవడంతో, ఆ సినిమా విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఆ చిత్రబృందం ద్వితీయ ప్రయత్నంగా ‘సలామ్ జిందగీ’ నిర్మిస్తున్నారు. మస్త్ అలీ, అజీజ్ నాజర్, ధీర్ చరణ్ శ్రీవాత్సవ్, ఫిరోజ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో సయ్యద్ హుస్సేన్ దర్శకత్వంలో ఊరూసా రహీమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను వ్యాపార వేత్త ఇఫ్తెకార్ షరీఫ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ– ‘‘డెక్కన్ వుడ్’ సినిమాలంటే కేవలం ఉర్దూ చిత్రాలనీ, ఓల్డ్ సిటీ వారికే పరిమితమని అనుకుంటున్నారు. ఆ బోర్డర్‌ను బ్రేక్ చేసి డెక్కన్ వుడ్ చిత్రాలంటే అందరూ చూడదగ్గ చిత్రాలని ప్రూవ్ చేయడానికే ‘సలామ్ జిందగీ’ తెరకెక్కిస్తున్నాం. ఆరోగ్యకరమైన హాస్యంతో ఈ చిత్రం ఉంటుంది. 60% చిత్రీకరణ అమెరికాలో జరిపాం. త్వరలో పాటలు, ఈద్‌కు సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement