ఈ సినిమా హైదరాబాద్‌ బిర్యానీలాంటి అనుభూతినిస్తుంది

Phas Gaye Yaaro Movie Release Date Out Now - Sakshi

మస్త్‌ అలీ, అజీజ్‌ నజీర్, ఏలీన టుతేజా, రేష్మా బరి, నజియా ఖాన్, నిర్మల్‌ దిలీప్‌ రాయ్‌ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘ఫస్‌ గయే యారో’. యూసఫ్‌ సర్తి దర్శకత్వంలో  రూపేష్‌ డి. గోహిల్, ఎమ్‌. విజయలక్ష్మి, ఓం ప్రకాష్‌ భట్, ధనుంజయ్‌ మాసూమ్‌ నిర్మించిన ఈ సినిమా రాజశ్రీ ఫిల్మ్స్‌ ద్వారా ఈ నెల 21న రిలీజవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు సయ్యద్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హిలేరియస్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రేక్షకులకు హైదరాబాద్‌ బిర్యానీలాంటి పసందైన అనుభూతి పంచేందుకు దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. డెక్కన్‌ (హైదరాబాద్‌ హిందీ) సినిమాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది కాబట్టి  ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలి’’ అన్నారు. మస్త్‌ అలీ, యూసఫ్‌ సర్తి, తెలంగాణ స్టేట్‌ మైనారిటీ చైర్మన్‌ సయ్యద్‌ అక్బర్‌ హుస్సేన్, చిత్ర సహనిర్మాత సోను గుప్తా, ఫస్ట్‌ ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా ఇఫ్తేకర్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top