హరికృష్ణ గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: షెన్జెన్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో యు యాంగి (చైనా)తో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 102 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.