breaking news
Water Filter
-
‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్
స్మార్ట్‌ఫోన్‌లోని డిజిటల్ కెమెరా.. మెమరీ ఫోమ్ పరుపులు.. కారు టైర్లు.. గీతలు పడని లెన్స్.. వాటర్ ఫిల్టర్.. ఇవన్నీ ‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్ తెలుసా? ఎందుకంటే ఇవన్నీ అంతరిక్ష ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లోంచి పుట్టినవి. మనం నిత్యం వాడే వస్తువులుగా మారిపోయాయి. మరి వీటి విశేషాలు ఏమిటో చూద్దామా.. గ్రహాంతర ప్రయోగాలు.. ఫోన్ కెమెరా.. ►శాటిలైట్లలో బిగించేందుకు.. నాసాకు చెంది న జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) ఇంజనీర్ యూజీన్ లల్లీ మొదటిసారిగా 1960 దశకంలో డిజిటల్ కెమెరాలను రూపొందించారు. అవి పెద్ద పరిమాణంలో ఉండి, ఎక్కువ విద్యుత్ అవసరం పడేవి. దీంతో తక్కువ సైజులో ఉండే డిజిటల్ కెమెరాలపై పరిశోధన చేసిన జేపీఎల్ ఇంజనీర్ ఎరిక్ ఫోసమ్.. 1990 దశకం మొదట్లో ‘సీఎంఓఎస్– యాక్టివ్ పిక్సెల్ సెన్సర్ (ఏపీఎస్)’ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఫోన్ కెమెరాలు, వెబ్‌క్యామ్‌లు వంటి మినియేచర్ కెమెరాల్లో వాడుతున్న టెక్నాలజీ ఇదే. అంతరిక్షంలోకి పంపకున్నా.. ఇళ్లలోకి వాటర్ ఫిల్టర్.. ►నాసా చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. వాళ్లకు మంచి నీళ్లు ఎలాగనే పరిశోధనలూ చేసింది. వాడిన నీటిని తిరిగి శుద్ధిచేసుకుని వినియోగించుకునేలా ‘ఎలక్ట్రోలైటిక్ సిల్వర్ అయాన్ జనరేటర్’ను అభివృద్ధి చేసింది. ఈ వాటర్ ఫిల్టర్‌ను అంతరిక్ష ప్రయోగాల్లో వాడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలోకి వచ్చేసింది. అయితే దీనికన్నా మెరుగైన, ఖరీదైన టెక్నాలజీని ‘అపోలో’ ప్రయోగాల్లో వాడారు. స్పేస్ షటిల్లో సీట్లు.. మెమరీ ఫోమ్ పరుపులు ►స్పేస్ షటిల్స్ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చేప్పుడు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వాటిలో ఉండే వ్యోమగాము లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలా ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు మృదువుగా, సౌకర్యవంతంగా ఉండేందుకు నాసా 1960వ దశకంలో ‘పాలీయూరేథీన్ సిలికాన్ ప్లాస్టిక్ (మెమరీ ఫోమ్)’ మెటీరియల్‌ను అభివృద్ధి చేసింది. స్పేస్ షటిల్ సీట్లలో అమర్చింది. అవే ఇప్పుడు మనం వాడుతున్న మెమరీ ఫోమ్ పరుపులు, దిండ్లు. అనుకోకుండా కనిపెట్టిన.. స్క్రాచ్ రెసిస్టెంట్ లెన్స్.. ►వ్యోమగాములు హెల్మెట్ కోసం గాజును వాడితే ప్రమాదకరం కావడంతో నాసా ఫైబర్ గ్లాస్‌ను వినియోగించింది. కానీ దానిపై సులువుగా గీతలు పడి ఇబ్బంది వస్తుండటంతో పరిష్కారంపై ప్రయోగాలు మొదలుపెట్టింది. అయితే చిత్రంగా టెడ్ వైడెవెన్ అనే శాస్త్రవేత్త వాటర్ ఫిల్టర్ కోసం చేస్తున్న ప్రయోగాల సందర్భంగా.. స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కళ్లద్దాల నుంచి టీవీలు, మానిటర్లు, ఫోన్ స్క్రీన్ల దాకా ఈ కోటింగ్‌ను వాడుతున్నారు. మార్స్‌పై దిగే ప్యారాచూట్ తాళ్లు.. కారు టైర్లు.. ►1976లో నాసా ప్రయోగించిన ‘వైకింగ్ ల్యాండర్’ అంగారకుడిపై సురక్షితంగా దిగేందుకు ప్యారాచూట్లను వినియోగించారు. అసలే మార్స్‌పై తేలికైన వాతావర ణం, ఎక్కువ బరువున్న ప్రోబ్.. ప్యారా చూట్ తాళ్లు అత్యంత బలంగా ఉండాలి. దీనిపై నాసా విజ్ఞప్తి మేరకు.. ‘గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ’ ఉక్కుకన్నా బలమైన రబ్బర్ మెటీరియల్‌ను రూపొందించింది. తర్వాత దీనిని వాహనాల టైర్ల తయారీలో వాడటం మొదలుపెట్టారు. ఇంకా ఎన్నో.. ►స్పేస్ ఫ్లైట్లలో, విమానాల్లో వాడేందుకు నాసా తోపాటు యునైటెడ్ ఎయిర్ లైన్స్ శాస్త్రవేత్తలు కలిసి వైర్ లెస్ హెడ్‌సెట్‌ను అభివృద్ధి చేశారు. ►నాసా స్పేస్‌లో ఆల్గే (నాచు)ను ఉపయోగించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలు చేస్తుండగా.. పిల్లలకు పాలకు బదులుగా ఇచ్చే ‘బేబీ ఫార్ములా’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ►స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త డోగ్ ఎంగెల్బర్ట్.. నాసా చేసిన ఆర్థిక సాయం, సూచనలతోనే కంప్యూటర్ ‘మౌస్’ను తయారు చేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సూపర్ వాటర్ ఫిల్టర్ : ధర రూ. 30
సాక్షి, బెంగళూరు : ఔత్సాహిక యువకుడు తన వినూత్న ఆలోచనతో విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది పలికాడు. అతి తక్కువ వ్యయంతో పోర్టబుల్ వాటర్ ఫిల్టర్‌ను తయారు చేసిన పలువురి ప్రశంసలందు కుంటున్నాడు. మామూలు క్యాప్‌లా వుండే ఈ చిన్న పరికరం ద్వారా ఎంత మురికిగా ఉన్న నీటినైనా క్షణాల్లో పరిశుభ్రంగా మార్చుకోవచ్చు. మనం వినియోగించే అతి చిన్న వాటర్ బాటిల్స్‌కు దీన్ని వాడుకోవచ్చు. ‘ప్యూరిట్ ఇన్ పాకెట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ సాధనం ధర కేవలం రూ. 30 మాత్రమే. 30 రూపాయలలో స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఈ పరికరాన్ని త్వరలోనే పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవాలని ప్రయత్నంలో ఉన్నారు దీని రూపకర్త. దీంతోపాటు సముద్ర నీటిని కూడా శుద్ధమైన తాగునీటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు ఈ ప్రక్రియలో దీన్నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేది తమ భవిష్యత్తుగా ప్రణాళికగా చెప్పారు. కర్నాటకకు చెందిన 22 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ నిరంజన్ కరాగి దీని సృష్టికర్త. ఆవిష్కరణకు నాంది ఎలా అంటే బెల్గాంలోని ఒక ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న స్టేడియంలో ఆడటానికి వెళ్ళాడు, అక్కడ విద్యార్థులు ట్యాప్ నుండి అపరిశుభ్రమైన నీరు తాగడం చూసి కలత చెందాడు. మరుసటి రోజు సాయంత్రం మార్కెట్లో వాటర్ ఫిల్టర్ల రేట్లను పరిశీలించాడు. వాటి ఖరీదు అతనిని బాధ మరింత రెట్టింపైంది. దీంతో పరిష్కారం వైపు దృష్టి సారించాడు. ఆ ఆలోచన కొత్త ఆవిష్కారానికి బీజం వేసింది. కొన్ని రోజుల నిరంతర శ్రమ తరువాత 100 లీటర్ల నీటిని శుభ్రంచేసే చిన్న వడపోత యంత్రాన్ని రూపొందించాడు. దాన్ని తన ప్రొఫెసర్లకు చూపించాడు, కాని అది చాలా చిన్న ప్రాజెక్ట్ కావడంతో వారు దానిపై ఆసక్తి చూపలేదు. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా పట్టుదలగా ముందుకు కదిలాడు. సరసమైన ధరలో దీనిని పేదలకు అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. కానీ ఇందుకోసం పెట్టుబడి కావాలి కదా. చివరకు దేశ్‌పాండే ఫౌండేషన్ వారి సహకారంతో 2017లో రూ .12,000 పెట్టుబడితో ఈ ట్యాప్ లాంటి ఫిల్టర్లను తయారు చేయడం ప్రారంభించాడు. అసలు దీని ప్రారంభ ధర 20 రూపాయలు మాత్రమే. అయితే జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత అతను దానిని రూ .30 కి పెంచాల్సి వచ్చిందట. ప్రధానంగా సోషల్ మీడియా ద్వారానే తన పరికరానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని నిరంజన్ సంతోషంగా చెబుతారు. ప్రస్తుతం 2000 లీటర్ల నీటిని శుభ్రపరచగల అధునాతన ఫిల్టర్‌ను అభివృద్ధి చేస్తున్నాననీ, దీనికి రూ .100 -150 రూపాయలు ఖర్చు అవుతుందని నిరంజన్ తెలిపారు. అలాగే మార్కెట్లో లభించే ఖరీదైన ఫిల్టర్లతో పోలిస్తే తన నిర్నల్ భారతదేశంలో అత్యంత సురక్షితమైన, శుభ్రమైన తాగునీటిని అందిస్తుందని, 95 శాతం బ్యాక్టీరియాను నిర్మూలిస్తుందని హామీ ఇస్తున్నారు. అవార్డులు కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఎలివేట్ 100 కార్యక్రమంలో రూ .20 లక్షల సీడ్ ఫండింగ్, సహా వివిధ కార్యక్రమాలలో అవార్డులను గెలుచుకుంది. పాల్గొన్న 1,700 మందిలో బహుమతి నిరంజన్ గెలుచుకున్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కెసిసిఐ) నుండి ప్రశంసలు అందుకోవడం విశేషం. తాజాగా సెప్టెంబర్ 7 న బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘యంగ్ ఎంటర్ప్రెన్యూర్’ అవార్డును కూడా అందుకున్నారు. వాస్తవానికి, ఈ ప్రత్యేక వడపోత పరికరం డల్లాస్‌లోని భారతీయుల ఆధ్వర్యంలోని 'కుచ్ కుచ్ బాతేం' అనే రేడియో కార్యక్రమంలో ప్రసారం కావడంతో వెలుగులోకి వచ్చింది. యుఎస్‌లోని 40 ప్రాంతాలలో ఇది ప్రసారం కావడంతో కార్యక్రమం తరువాత, నిరంజన్ తన ఉత్పత్తికి విరివిగా ఆర్డర్లు వచ్చాయి. నిరంజన్ వ్యాపారానికి దేశంలోని కర్ణాటక , మహారాష్ట్రలతోపాటు, సింగపూర్, ఖతార్, ఆఫ్రికానుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. A 30 Rs portable water filter. pic.twitter.com/8L01UrCbJ5 — Aggressive Indian (@bharat_builder) September 9, 2019 -
మురుగు శుద్ధికి గ్రీన్ సిగ్నల్
విశాఖసిటీ: మహా విశాఖలో పారిశ్రామిక అవసరాల కోసం వృథా నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.762 కోట్లతో హైబ్రిడ్ సివరేజ్ ప్రాజెక్టు తొలి విడత పనులకు సర్కారు పచ్చజెండా ఊపింది. పెందుర్తిలో 46 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.150 కోట్ల నిధులను మున్సిపల్ బాండ్స్ ద్వారా సమీకరించుకోవాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు జీవీఎంసీ కసరత్తులు చేస్తోంది. మహా విశాఖ నగర పాలక సంస్థలో దేశంలోనే అతి పెద్ద హైబ్రిడ్ సివరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో ఉత్పత్తవుతున్న మురుగు వృథా నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. పెందుర్తి, గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ లేని ప్రాంతాల్లో అభివృద్ధి చెయ్యడంతో పాటు ఆ నీటిని శుద్ధి చేసి పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖరీదు రూ.762 కోట్లు. తొలి విడతలో రూ.412 కోట్లతో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో పాటు పరిశ్రమలకు రీసైకిల్ వాటర్‌ను పంపిణీ చేసే వ్యవస్థకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. ప్యాకేజీ–1లో కింద పెందుర్తి ఏరియాలో పనులు నిర్వహించనున్నారు. ఇందుకోసం మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉండటంతో ఈ ప్రాజెక్టులో రూ.150 కోట్లను కార్పొరేషన్ ఖర్చు చేయనుంది. ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్) మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. పెందుర్తి ప్రాంతంలో పనులు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత ప్యాకేజీ–2లో భాగంగా గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో పాటు పరిశ్రమలకు ట్రీటెడ్ వాటర్ పంపిణీ చేసే వ్యవస్థకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే జీవీఎంసీ బాధ్యతగా ఖర్చు చేయాల్సిన రూ.150 కోట్లను మున్సిపల్ బాండ్ల ద్వారా సమీకరించుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. జీవీఎంసీ స్థిరాస్థిని బట్టి వాటిని తనఖా పెట్టి రూ.150 కోట్లు సమీకరించుకునే వెసులుబాటు కల్పించింది. ఓపెన్ టెక్నాలజీ ఆపరేషన్ ద్వారా నిర్వహణ 46 ఎంఎల్డీతో సామర్ధ్యం కలిగిన ట్రీట్ మెంట్ ప్లాంట్‌కు సంబంధించి పరిశీలన, సర్వే, డిజైన్, నిర్మాణం, సివరేజ్ కలెక్షన్, కన్వెయిస్ సిస్టమ్ పర్యవేక్షణ పనులకు సంబంధించిన నివేదికను త్వరలోనే జీవీఎంసీ అధికారులు సిద్ధం చెయ్యనున్నారు. అదే విధంగా 15 సంవత్సరాల పాటు ఓపెన్ టెక్నాలజీతో నిర్వహించనున్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న నరవ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచే ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నారు. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే ఇప్పటి వరకూ పరిశ్రమలకు మళ్లిస్తున్న నీటిని విశాఖ ప్రజల తాగునీటి సరఫరాకు కొంత మేర ఉపయోగపడనుంది. -
ఆన్లైన్లో ఘరానా మోసం!
ఆన్లైన్లో మోసం కొత్తకోట రూరల్: ఇటీవల ఆన్లైన్లో బుక్ చేసిన వాటర్ ఫిల్టర్‌కు బదులు ఓ వినియోగదారుడికి ఇటుక రాయి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పాలెం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి స్నాప్‌డీల్‌లో ఇటీవల రూ.8 వేలు వెచ్చించి వాటర్ ఫిల్టర్‌ను బుక్ చేసుకున్నాడు. మంగళవారం కొరియర్ బాయ్ వచ్చి కస్టమర్ బుక్ చేసుకున్న వస్తువుకు సంబంధించి ఓ బాక్స్ అందజేశాడు. దీంతో బాల్‌రెడ్డి బాక్స్‌ను తీసుకుని ఇంటివద్దకు వెళ్లి తెరిచి చూడగా వాటర్‌ఫిల్టర్‌కు బదులు ఇటుక రాయి కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ మోసం ఆన్లైన్ వారి మూలంగా జరిగిందా.. లేదా కొరియర్ సంస్థ ద్వారా జరిగిందా అన్న తెలియాల్సి ఉంది. -
స్నాప్‌డీల్‌లో ఘరానా మోసం
-
మునగ గింజలతో ‘మంచి’ నీరు
సాక్షి, విజయవాడ బ్యూరో: క్లోరినేషన్ చేయకుండా, వాటర్ ఫిల్టర్ ఉపయోగించకుండా కేవలం మునగ గింజలతో నీటిని శుద్ధి చేసే విధానం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రకృతి సిద్ధంగా లభించే మునగ గింజలతో బురద నీటిని సైతం శుద్ధిచేసి తాగునీరుగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధానాన్ని విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీఎస్ రాజు ప్రయోగాత్మకంగా కనుగొన్నారు. ఇదీ విధానం..: ఎండిన గింజలను కాయ నుంచి వేరుచేసి అందులోని పప్పును మెత్తని పిండిగా చేయాలి. దాన్ని శుభ్రమైన నీటిలో కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. దానికి తగినంత నీరు కలిపి పలుచగా తయారుచేయాలి. పాల మాదిరి తెల్లగా ఉన్న ఈ మిశ్రమాన్ని అపరిశుభ్రంగా ఉన్న నీటిలో వేసి అర నిమిషంపాటు వేగంగా కలపాలి. తర్వాత ఐదు నిమిషాల వరకూ నెమ్మదిగా.. నిమిషానికి 15 లేక 20 సార్లు కలపాలి. అనంతరం నీటిపై మూతపెట్టి ఒక గంట వరకు వదిలేయాలి. తర్వాత ఆ నీటిని వడగట్టుకోవాలి. ఒకవేళ నీటిని కదిపితే ఫలితం ఆలస్యమవుతుంది. సాధారణంగా పెద్ద బకెట్లో పట్టే నీటిని శుభ్రపరిచేందుకు రెండు టీ స్పూన్ల (ఐదు మిల్లీమీటర్లు పట్టేవి) మునగ గింజల పౌడర్ అవసరం. ఈ పద్ధతితో నీటిలోని బ్యాక్టీరియా కూడా పోతుంది. దీని వల్ల నీటి పీహెచ్ ఏమాత్రం మారదు. ప్రకృతి సిద్ధంగా లభించే మునగ గింజలు కావడంతో దీనివల్ల ఎటువంటి హాని కలగదు. -
సోలార్ సిస్టమ్‌తో నీటి శుద్ధి
-
పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం
- ఫ్లోరైడ్ విరుగుడుకు భూగర్భజలాలు పెంచాలి - కలెక్టర్ చిరంజీవులు - మల్లాపురంలో శ్రీసత్యసాయి మంచినీటి పథకం ప్రారంభం పెద్ద అడిశర్లపల్లి, న్యూస్‌లైన్, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిరంజీవులు అన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండ లం మల్లాపురంలో భగవాన్ శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సత్యసాయి ప్రేమామృతధార’ మంచినీటి పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పారు. మురుగునీటి పారుదల కోసం నిర్మించిన డ్రెయినేజీలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు భూ గర్భజలాలను పెంచాలన్నారు. ఎక్కువలో తులోనుంచి బోర్లద్వారా నీటిని తోడడం వల్ల ఫ్లోరిన్ సమస్య తీవ్రమవుతుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి అన్ని గ్రామాల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలని, చెట్లను పెంచాలని సూచించారు. సత్యసాయి సేవాసమితి 5 లక్షల వ్యయంతో స్వచ్ఛం దంగా గ్రామంలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. త్వరలో అన్ని గ్రామాలకు కృష్ణాజలాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాట బృందం, గ్రామస్తులు కలెక్టర్‌కు ఘనస్వాగతం పలి కారు. అనంతరం మహిళలు సాయివ్రతాలు ఆచరించారు. అలాగే భక్తులకు అన్నదానం చేశారు. సత్యసాయి మండల సేవాసమితి కన్వీనర్ కల్వకొల్లు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణారావు, సేవాదళ్ కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జి.రాజయ్య, ఎంపీడీఓ బి.నర్సింగరావు, సత్యసాయి సేవాసమితి సభ్యులతో పాటు సర్పంచ్ ఆర్.శంకర్‌నాయక్, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కార్యదర్శి చలమయ్య, వెంకటయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.