breaking news
wage Tasks
-
ద్వీపాల దేశం డెన్మార్క్
నైసర్గిక స్వరూపం రాజధాని: కోపెన్‌హగన్, ప్రభుత్వపాలన: యునిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ మొనార్చి కరెన్సీ: డానిష్ క్రోన్ భాషలు: డానిష్ మతం: క్రైస్తవం ఉష్ణోగ్రతలు: ఫిబ్రవరిలో 3 డిగ్రీల సెల్సియస్, జూలైలో 14 నుండి 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ప్రపంచ వీక్షణం సంస్కృతి-సంప్రదాయాలు డెన్మార్క్ దేశంలో మహిళలు ఎక్కువగా కూలిపనులు చేస్తారు. యూరోప్ ఖండంలో లేబర్ మార్కెట్లో మహిళల శాతం డెన్మార్క్‌లోనే అధికం.మహిళలు తమ భర్తలను ఎంపిక చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. అలాగే పురుషులు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం పూర్తి నిషేధం. మహిళలు తమ పిల్లలకు ఆరునెలలు వయసురాగానే వారిని పిల్లల సంరక్షణ కేంద్రాలకు పంపించేస్తారు. ఎందుకంటే వారు పనులు చేయడానికి వెళ్ళాలి కాబట్టి.డెన్మార్క్ దేశీయులు సాధారణంగా సిల్కు, ఊలు, దుస్తులు ధరిస్తుంటారు. ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉన్ని దుస్తులు ఎక్కువగా వాడుతారు.మహిళలు సాధారణంగా మెడకు స్కార్ఫ్‌కట్టుకుంటారు. నలుపు రంగు స్కార్ఫ్ ధరించడం వీరు హుందాగా భావిస్తారు. లేసులతో, ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి లంగా ధరిస్తారు. దీనిపైన జాకెట్ ధరిస్తారు.పురుషులు మాత్రం ఊలు, తోలు దుస్తులు ఎక్కువగా ధరిస్తారు. చాలా పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు సామూహిక నృత్యాలు చేస్తారు. దేశం-మూడు భాగాలు డెన్మార్క్ దేశం దాదాపు 406 ద్వీపాలు, ద్వీపకల్పాలతో కూడుకొని ఉంది. ఒక్కో ద్వీపానికి వెళ్ళడానికి వివిధ ఆకారాలలో బ్రిడ్జిలు నిర్మించారు. బ్రిడ్జిలు నిర్మించ వీలు లేని ద్వీపాలకు ఫెర్రీ బోట్లమీద ప్రయాణం చేస్తారు. దేశాన్ని ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించారు. 1. డెన్మార్క్ - దీని వైశాల్యం - 42915.7 చ.కి.మీ., జనాభా-56,27,235 2. గ్రీన్లాండ్ - దీనివైశాల్యం-21,66,086 చ.కి.మీ., జనాభా-56,370 3. ఫారో ఐల్యాండ్స్ - దీని వైశాల్యం-1399 చ.కి.మీ., జనాభా-49,709 పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని ఐదు ప్రాంతీయ భాగాలుగా విభజించారు. 1. డెన్మార్క్ రాజధాని ప్రాంతం 2. కేంద్రీయ డెన్మార్క్ ప్రాంతం 3. ఉత్తర డెన్మార్క్ ప్రాంతం 4. జీలాండ్ ప్రాంతం 5. దక్షిణ డెన్మార్క్ ప్రాంతం. పంటలు-పరిశ్రమలు * డెన్మార్క్ దేశంలో ఇనుము, స్టీలు, రసాయన, ఫుడ్‌ప్రాసెసింగ్, యంత్రసామాగ్రి, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, నౌకల తయారీ, మందుల పరిశ్రమలు అనేకంగా ఉన్నాయి. * ఇక ప్రపంచానికి క్రిస్మస్ ట్రీలను ఎగుమతి చేసే దేశం డెన్మార్క్. ఈ చెట్లను పెంచి, ఎగుమతి చేసే వ్యాపారంలో దాదాపు అరలక్షమంది ఉద్యోగులు ఉన్నారు. * దేశంలో బార్లీ, బంగాళదుంపలు, గోధుమలు, చెరకు పంటలతోపాటు చేపల పెంపకం, పందుల పెంపకం, పాల ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. ముఖ్యమైన నగరాలు దేశంలో అయిదు రీజియన్లు, 98 మున్సిపాలిటీలు ఉన్నాయి. రాజధాని కోపెన్‌హగన్, ఆర్హస్, ఓరెన్స్, ఆల్బోర్గ్, ఫ్రెడరిక్స్ బెర్గ్, ఎస్బ్‌జెర్గ్, జెంటోఫ్టె, గ్లాడీసాక్స్, రాండర్స్, కోల్డింగ్, హర్సెన్స్, ఇంకా 45 ముఖ్యమైన నగరాలు, పట్టణాలు ఉన్నాయి. ఆహారం: వీరి భోజనంలో ముఖ్యంగా మాంసం, బంగాళదుంపలు, బ్రెడ్ ఉంటాయి. ప్రపంచం మొత్తంలో పందిమాంసం ఎక్కువగా తినేది డెన్మార్క్‌లోనే. వీళ్ళు ఎక్కువగా సాండ్విచ్, మాంసం ముక్కలు, ఉడికించిన గుడ్లు, వీటితోపాటు బీరు తప్పకుండా తీసుకుంటారు. సాధారణంగా మధ్యాహ్న భోజనాన్ని హోటళ్ళలో కానిచ్చి రాత్రి భోజనాన్ని మాత్రం ఇంటి దగ్గరే తింటారు. వీరు తినే బ్రెడ్, మాంసం కలయికను స్మోర్బ్రాడ్ అని అంటారు. భోజనంతోపాటు ఐస్‌క్రీమ్, పళ్ళు, పళ్ళరసాలు తీసుకోవడం వీరికి చాలా ఇష్టం. సుదీర్ఘమైన చరిత్ర గల దేశం * డెన్మార్క్ దేశం ఓవైపు ఉత్తర సముద్రం మరోవైపు బాల్టిక్ సముద్రం ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం 406 ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 89 ద్వీపాలలో మాత్రం ప్రజలు నివసిస్తున్నారు. సముద్ర మట్టానికి కేవలం 171 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక సముద్రతీరం * 7300 కిలోమీటర్లు ఉంది. దీనికి 10 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. * ఇక ఈ దేశంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రూపశిల్పులు, భవననిర్మాణ శిల్పులు ఎందరో ఉన్నారు. చూడదగ్గ ప్రదేశాలు కోపెన్‌హగన్: రాజధాని నగరం కోపెన్‌హగన్‌లో టివోలిగార్డెన్, ప్రీటేన్ క్రిస్టియానా, అటిల్ మర్మయిడ్, కోపెన్‌హగన్ పోర్ట్, నగరం సమీపంలో క్రాన్బోర్గ్ కాజిల్ (kronborg castle) ముఖ్యమైనవి. ఈ కాజివ్ అనేది ఒకప్పుడు షేక్స్పియర్ రాసిన హమ్లెట్ నాటకానికి నేపధ్యప్రదేశం. 2. బుడోల్ఫిచర్చి: జుట్లాండ్ ప్రాంతంలో 17వ శతాబ్దానికి ఆల్‌బోర్ఘ్‌స్ కాజిల్ (Aalborghus castle) 14వ శతాబ్ధానికి చెందిన బుడోల్ఫిచర్చి (Budolfi church), అలాగే గ్రామీణ మ్యూజియం చూడదగినవి. వీటితోపాటు బిల్లుండ్ విమానాశ్రయం, చెక్కతో చేసిన ఇళ్ళు ఉన్న ఎబెల్ టోఫ్ట్ (Ebeltoft) గ్రామం, మోర్స్‌ద్వీపంలో జెస్ఫెరస్ పూల ఉద్యానవనం చూడదగ్గవి. 3. దక్షిణ భాగపు సీ లాండ్: (South Sealand) డెన్మార్క్ దేశానికి వచ్చే యాత్రీకులు తప్పనిసరిగా చూసేది దేశపు దక్షిణ భాగంలో ఉన్న సీలాండ్. అలాగే దీని చుట్టూ ఉన్న అనేక ద్వీపాలు. ఇసుక బీచ్‌లు. లిసెలుడ్పార్కు, మొనదేలిన పర్వతాగ్రాలు ఇక్కడే దర్శనమిస్తాయి. -
తెనాలిలో ఏడు పూరిళ్లు దగ్ధం
తెనాలి అర్బన్ : పట్టణంలో మొన్నటి ఘోర అగ్నిప్రమాద సంఘటన మాసిపోకముందే సోమవారం మరో అగ్నిప్రమాదం సంభవించింది. పేదల గుడిసెలపై ఉగ్రరూపం దాల్చిన అగ్నికీలలకు క్షణాల్లో ఏడు పూరిళ్లు బూడిదయ్యాయి. స్థానిక మారీసుపేట మఠంబజారులో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు అనుకుని ఉన్న పూరిళ్లలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ పాక నుంచి ఎగసిపడిన మంటలు క్షణాల్లో అలముకున్నాయి. చూస్తుండగానే ఏడు పూరిళ్లు బూడిదయ్యాయి. ఆకస్మిక పరిణామంతో ప్రజలు భీతిల్లిపోయారు. ప్రాణాలు దక్కితే చాలన్నట్లు పరుగులు పెట్టారు. అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. సమీపంలోని అపార్ట్మెంట్, భవనాల్లో ఉన్న వారు భయాందోళనలకు గురయ్యారు. స్పందించిన అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది.. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి కె.కృష్ణారెడ్డి నేతృత్వంలో బృందం రెండు వాహనాలతో అక్కడికి చేరుకుంది. చుట్టుపక్కల భవనాలకు ప్రమాదం లేకుండా మంటలను అదుపు చేసింది. ఆస్తినష్టం రూ.1.50 లక్షలు ఉంటుందని అధికారిక అంచనా. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. కూలిపనులు చేసుకునే బాధితులు స్థానికంగా ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తలదాచుకున్నారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ కేవీ రమణనాయక్, మున్సిపల్ కమిషనర్ బి.గోపినాథ్, ఎంఈ ఎం.ప్రభాకరరావు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అనూరాధ, ఆర్ఐ సూర్యనారాయణమూర్తి, వీఆర్వోలు రోశయ్య, జగన్మోహన్రావు, ముఖర్జీ, సాయి తదితరులు పరిశీలించి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.