breaking news
Video assistant referee (VAR)
-
అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి బహిష్కరించండి..!
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై మరోసారి వివాదం చెలరేగింది. రిఫరీలు, వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాల్లో అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ జట్టును టోర్నమెంట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో ఓ పిటిషన్ వైరల్ అవుతోంది. ఈ పిటిషన్‌కు ఇప్పటికే 75 లక్షల మందికిపైగా మద్దతు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.పిటిషన్ నిర్వాహకులు ఫిఫాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అర్జెంటీనాకు అనుకూలంగా రిఫరీ నిర్ణయాలు వస్తున్నాయని, దీంతో పోటీ సమానంగా జరగడం లేదని వారు ఆరోపించారు. "విజేత ముందే నిర్ణయించబడితే మిగతా జట్లు ఎందుకు పోటీ పడాలి? అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి తప్పించి ఇతర జట్లకు న్యాయం చేయాలి" అని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ వివాదం మధ్యనే అర్జెంటీనా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక ప్రత్యర్థిత్వం కారణంగా ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజా ఆరోపణలతో ఈ పోరుకు మరింత ఉత్కంఠ ఏర్పడింది.ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, అర్జెంటీనాపై చర్యలు తీసుకునే అంశంపై ఫిఫా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పిటిషన్లో చేసిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ధారిత ఆధారాలు కూడా వెలుగులోకి రాలేదు. అందువల్ల ఇవి ప్రస్తుతం ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. కాగా, భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్య రాత్రి రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లండ్‌తో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపుతో స్పెయిన్ ఇదివరకే ఫైనల్‌కు చేరుకుంది. -
ఫిఫా వీఏఆర్పై ప్రపంచవ్యాప్త నిరసనలు.. ఆ దేశంలో మాత్రం!
2026 ఫిఫా వరల్డ్‌కప్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఏకపక్ష నిర్ణయాలు, ఫౌల్స్ విషయంలో కొత్త నిబంధనలు, గోల్స్‌ను రద్దు చేయడంపై జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ల ఫలితాలను మార్చేస్తున్న వీఏఆర్ వివాదం ఫిఫాలో పెద్ద రచ్చగా మారిపోయింది. ‘#Good Bye VAR’ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారిపోయింది.ఫిఫా ప్రవేశపెట్టిన వీఏఆర్‌ను చాలా దేశాలు వ్యతిరేకించడంతో పాటు దానిని బ్యాన్ చేయాలని కోరుతున్నాయి. కానీ స్వీడన్ ఇదే వీఏఆర్‌ను టెక్నాలజీని ఐదేళ్ల క్రితమే బ్యాన్ చేసిందన్న విషయం మీకు తెలుసా. కోవిడ్ సమయంలో స్వీడన్లో దేశీయంగా చాలా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో వీఏఆర్ టెక్నాలజీని వాడారు. కానీ దీనిపై అప్పట్లో ఆటగాళ్లు సహా అభిమానులు తిరుగుబాటు చేశారు. దీంతో వీఏఆర్‌ను బ్యాన్ చేయాలని ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్ అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది.Photo Credit: FIFA Twitterఇప్పటికీ స్వీడన్లో సంప్రదాయ అంపైరింగ్కే అక్కడి ఫుట్‌బాల్ లీగ్‌లు కట్టుబడి ఉన్నాయి. అయితే ఇవాళ ఫిఫాలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వీఏఆర్ వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ వీఏఆర్ టెక్నాలజీ అర్జెంటీనాకు వరంలా మారిపోయిందని, రిఫరీలు కూడా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోయాయి.ప్రపంచకప్‌లో ముఖ్యంగా అర్జెంటీనా–ఈజిప్ట్, స్విట్జర్లాండ్–అర్జెంటీనా వంటి మ్యాచ్‌ల్లో VAR జోక్యంతో తీసుకున్న నిర్ణయాలు పెద్ద వివాదంగా మారాయి. ఈజిప్ట్‌కు లభించిన గోల్‌ను రద్దు చేయడం, పెనాల్టీపై వచ్చిన వివాదం, స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలోకు సిమ్యులేషన్ పేరుతో ఎర్రకార్డు చూపించడం వంటి ఘటనలు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం రేపాయి. సోషల్ మీడియాలో అర్జెంటీనాను వ్యంగ్యంగా "VARgentina" అని పిలుస్తూ విమర్శలు వెల్లువెత్తాయి.వీఏఆర్ వివాదాలకు కారణాలు:👉నిబంధనల మార్పు: ఈ టోర్నీలో ఫౌల్స్, డైవింగ్ (తప్పుడు ప్రయత్నాలు) వంటి వాటిపై వీఏఆర్ కఠినంగా వ్యవహరిస్తోంది. స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో డైవింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించి, అతనికి రెడ్ కార్డ్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇది ఎంతదాకా వెళ్లిందంటే అర్జెంటీనా కోసమే ఫిఫాను నిర్వహిస్తే సరిపోతుందని.. కప్‌ను అర్జెంటీనాకే ఇచ్చేయాలని మైదానంలోని బహిరంగ నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది.👉గోల్స్ రద్దు: మైదానంలో ఆటగాళ్లు కష్టపడి చేస్తున్న గోల్స్‌ను రిఫరీలు వీఏఆర్ స్క్రీనింగ్ ద్వారా (బాల్ సెన్సార్ టచ్) పేరుతో రద్దు చేయడం అభిమానులను నిరాశపరిచింది.👉ఆటకు ఆటంకం: టెక్నాలజీ జోక్యం వల్ల ఆట సమయం వృథా అవుతోందని కొందరు, సరైన నిర్ణయాలు రావడం వల్ల వీఏఆర్ వల్ల ఉపయోగం ఎవరికి ఉంటుందనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Photo Credit: FIFA Twitterఫిఫా ఏమందంటే?వీఏఆర్ నిర్ణయాలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఫిఫా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గతంలో వీఏఆర్ నిర్ణయాలు రిమోట్ కంట్రోల్ (అంతర్జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రం) ద్వారా జరిగేవి. కానీ వీఏఆర్పై రచ్చ పెరిగిపోవడంతో, క్వార్టర్ ఫైనల్స్ నుంచి స్టేడియంలోనే ప్రత్యేకంగా వీఏఆర్ అధికారులను (VAR Team) ఫిఫా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా కూడా వీఏఆర్ వివాదాలకు మాత్రం తెరపడడం లేదు.చదవండి: ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు!


