breaking news
Vamshadhara river
-
కళింగ పట్నం వద్ద కోతకు గురైన సముద్రం
సాక్షి, శ్రీకాకుళం: భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వంశధార నది సముద్రం వైపు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా సాగర సంగమం వద్ద కలుస్తుండడంతో సముద్రం 50 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఇసుక దిబ్బలు కోతకు గురవడంతో పాటు కళింగపట్నం బీచ్లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిరాఫీ, ఏనుగు, ఒంటె బొమ్మలు ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతుండడంతో చేపల వేటపై నిషేదంతో పాటు కళింగ పట్నం పోర్టు వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. -
వంశధార స్థలం ఆక్రమణ వాస్తవమే..
టెక్కలి: మండలంలో వీఆర్కే పురం గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్ (మద్యం నిల్వ కేంద్రం) గొడౌన్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. శనివారం రెవెన్యూ, వంశధార అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఈ ఆక్రమణలను గుర్తించారు. ఇక్కడ కాలువలు నిర్మించకుండా గొడౌన్ ఏర్పాటుతో పొలాలకు ముంపు ప్రమాదం ఉందని, అలాగే వంశధార గట్టుపై అక్రమ తవ్వకాలు చేశారంటూ వీఆర్కే పురం, సీతాపురం గ్రామస్తులు ఇటీవల స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐ హరి, సర్వేయర్లు సుభాష్, రమణమూర్తి, వంశధార ఏఈ యామిని తదితరులు ఫిర్యాదుదారులు, గ్రామస్తుల సమక్షంలో బెవరేజ్కు ఆనుకున్న వంశధార స్థలంలో కొలతలు వేశారు. చివరగా వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్ నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
లారీ.. సారీ
శ్రీకాకుళం, సరుబుజ్జిలి: పాతికలారీలు.. సుమారు రూ.13 కోట్ల విలువ.. వారం రోజుల నిరీక్షణ.. ఆఖరకు మిగిలింది మాత్రం నిరాశ. పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోని వంశధార వరదల్లో చిక్కుకున్న 25 లారీలు బయటపడే మార్గాలు దుర్లభమైపోతున్నాయి. లారీలు వరదలో చిక్కుకుని సుమారు వారం రోజులు గడుస్తున్నాయి. నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టిన సమయంలో ఆదరాబాదరాగా పొక్లెయిన్లను తొలగించారు. ఈ పొక్లెయిన్ల యజమానులు కొందరు టీడీపీ నాయకులకు దగ్గరి వారు కావడంతో ముందుగా ఆ వాహనాలను బయటకు తీయించారు. కానీ లారీల విషయంలో మాత్రం అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆ వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదికి మళ్లీ వరదలు వారం రోజులు గడవక ముందే వంశధార నదిలోకి మళ్లీ వరద వచ్చింది. నదిలో నీరు తగ్గితే వాహనాలు బయటకు తీయవచ్చని ఆశపడిన లారీల యజమానులకు ఈ వరద పీడకలగా మారుతోంది. ఒక్కో లారీని రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేశామని, అంతా ఫైనాన్స్ మీదే తెచ్చామని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.13 కోట్ల విలువైన వాహనాలు నదిలోనే ఉండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు. ఒడిశా ప్రాంతంలో విస్తారంగా వానలు కురవడంతో వంశధారలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో లారీలను బయటకు తీసే ప్రక్రి య మరింత ఆలస్యం కావచ్చు. ఇప్పటికే వారం రోజులుగా లారీలు నీటిలోనే ఉండిపోవడం వల్ల భాగాలు పాడవుతాయని, వరదల వల్ల లారీలు కూడా మిగిలే పరిస్థితులు కనిపించడం లేదని యజమానులు వాపోతున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కుటుంబాలతో కలసి వచ్చి సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తామని ప్రకటించారు. నీరు గారుతున్న దర్యాప్తు సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరిపైనా చర్యలు లేకపోవడంతో కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీ సు వారి చేతిలో ఫైలు ఉందని చెబుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. విచారణ కోసం ఏ ఒక్క అధికారిని కూడా జిల్లా అధికారులు నియమించలేదు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
శ్రీకాకుళంలో వరదల్లో చిక్కుకున్న కూలీలు
-
వంశధార నదిలో ఘర్షణ
నరసన్నపేట: వంశధార నదిలో ఇసుక తవ్వకాల విషయంలో నరసన్నపేట మండలం పోతయ్యవలస గ్రామస్తులకు గార మండలం బూరవల్లి గ్రామస్తులకు మధ్య శనివారం ఘర్షణ జరిగింది. దీంట్లో రెండు గ్రామాలకు చెందిన ఆరుగురి వరకూ గాయపడ్డారు. పోతయ్యవలసకు చెందిన అరవల జంగమయ్య, అరవల ఆది నారాయణ, బొబ్బాది చలపతిరావు, అలిగి గనేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోతయ్యవలస వద్ద కలెక్టర్ ధనంజయరెడ్డి విశాఖలో అవసరాలకు వీలుగా ఇసుక ర్యాంపును మంజూరు చేశారు. వీరు తవ్వకాలు చేస్తున్నప్పుడు పరిధి దాటి బూరవల్లి బౌండరీకి వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారని గతంలో అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆర్డీఓ దయానిధి, నరసన్నపేట సీఐ పైడిపునాయుడు, మైన్స్ అధికారులు వచ్చి వివా దాన్ని పరిష్కరించారు. మళ్లీ ఈ వివాదం రెండు రోజులుగా రేగింది. శనివారం రెండు గ్రామాలకు చెందిన వారు బాహీబాహీ అయ్యారు. అప్పటికే పథకం ప్రకారం కర్రలతో వచ్చిన బూరవల్లి వాసులు పోతయ్యవలసకు చెందిన వారిపై దాడి చేశారు. పోతయ్యవలస వాసులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా నరసన్నపేట సీఐ పైడిపినాయుడు, ఎస్ఐ నారాయణ స్వామిలు సంఘటనా స్థలానికి వెళ్లి వివా దం అదుపు చేయడానికి ప్రయత్నించారు. వీరి సమక్షంలోనే మరో సారి ఘర్షణ జరిగింది. కాగా ఈ వివాదాన్ని ప్రశాంతంగా పరిష్కరించాలని పోతయ్యవలస గ్రామస్తులు కోరుతున్నారు. శనివారం జరిగిన వివాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. రాత్రి వరకూ రెండు వర్గాల పెద్ద మనుషుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. -
ముంగిస కథ
క్లాసిక్ కథ వంశధార నది ఒడ్డునే మడపాం గ్రామంలో డాక్టరు అప్పారావుగారి ఇల్లు. రెండు వాసల్లో ఒకటి మిద్దెటిల్లు, రెండోది అటక మీద గడ్డినేత ఇల్లు. ప్రతి సంవత్సరం వరదల్లో ఒడ్డు కూలిపోతూందని సర్కారువారు కొండరాళ్లు వాలుగా పేరుపు పేర్చారు. అది పేర్చాక రెండు వరదలు వచ్చినా ఒడ్డు చెక్కుచెదరలేదు. ఈ ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వర్షాకాలంలో బొబ్బలు పెట్టుకుంటూ చెట్లనూ, శవాలనూ తోసుకు వచ్చిన వరద వెల్లువ పాములను కూడా జీవంతో తెచ్చేది. ఆ రాళ్ల సందుల్లో దాగున్న పాములు ఒకోసారి రాత్రివేళ ఇంట్లోనే ఉండేవి. ఒకనాడైతే ఒక పాము పైనించి మంచం మీదనే పడింది. ఆయుర్వేద వైద్య వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేస్తున్న అప్పారావు పంటల కాలంలో ముఖ్యంగా ఇంకో ఉపద్రవాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చేది. ఎంతో పదిలంగా, భద్రంగా దాచిన ధాన్యాలను పదోవంతైనా ఎలకలకూ, పందికొక్కులకూ ధారపొయ్యవలసిందే! పెంచిన పిల్లి ఒకటి ఈ పందికొక్కుల సమూహానికి జడిసిపోయినట్లుంది. ఇంట్లో పడుకోదు. యజమానురాలు పడుకున్న మిద్దె ఇంట్లో పక్కనే పడుకుంటుంది. డాక్టరుగారికి ఇద్దరు పిల్లలు. కొడుకు వెయ్యి మైళ్ల దూరంలో మిలిటరీ ఆఫీసరు. కూతురు అత్తవారింట్లో ఎనిమిది మైళ్ల దూరంలో ఉంటుంది. డాక్టరు ఎందరి బాధలనో కుదర్చగలిగారు గాని ఈ ఎలకల, పాముల బాధ నించి విముక్తి పొందలేకపోయాడు. ఒకనాడు ఉదయమే ఒక ఎరకలవాడు ఒక ముంగిస పిల్లను తెచ్చాడు. ‘‘ఇది నాకెందుకూ?’’ అన్నాడు డాక్టరు. ‘‘బాబూ, మీకు పాములు, ఎలకలు బాధ. ఇది ఇప్పుడు బుల్లిపిల్లలా ఉంది. ఆరు నెలల్లో పెరిగి పెద్దదయిపోతాది. అప్పుడు దీని మేలు మీకు తెలుస్తాది.’’ ‘‘పెంపుడు జంతువా ఉండటానికి.’’ ‘‘మన తరిఫీదు బట్టి ఉంటాది బాబూ. పదిహేను రోజులు ఒక గూడులో తాడుతో కట్టి పెట్టండి. ఏ పిల్లీ, కుక్కా నొక్కేకుండా సూడండి. పాలన్నం తింటాది. ఏదైనా తీపి వస్తువు తింటాది. అప్పుడు మెడలో మూడు మువ్వలు కట్టెయ్యండి దొరా.’’ ‘‘మువ్వలు కడ్తే ఎలకల్ని, పాముల్ని ఎలా పడుతుందిరా? పిల్లికి గంటలు కట్టిన చందం కదరా.’’ ‘‘అది కాదు దొరా! మువ్వలు మోగితే ఆ ముంగిస జాతి దీనిని దగ్గిరకు చేరనివ్వవు. వెలేస్తాయి. దానికింకో గతి లేక మనిల్లు వదల్దు.’’ ముంగిస పిల్లను పట్టుకోవడానికి డాక్టరుకు భయం వేసింది. ఆ ఎరకలవాడే తాడు కట్టాడు. పాలన్నం ఇచ్చినా ముంగిస పిల్ల తినలేదు. కర్కర్ అని అరుస్తూంది. ‘‘అది అలా అరుస్తూంది. అదిక్కడ బతుకుతుందిరా?’’ అన్నాడు డాక్టరు. ‘‘తల్లినొదిలి ఉండటం కదా? రెండు రోజులు తల్లికోసరం ఏడుస్తుంది బాబూ.’’ డాక్టరు భార్య అమ్మాయమ్మ దాని గోలను కొంత పంచదార పోసిన రొట్టెముక్కనిచ్చి తగ్గించింది. రెండు మూడు రోజులకొకసారి ఆ ఎరకల ఎండన్న వచ్చి చూసి పెంచడం విషయంలో సలహాలిచ్చిపోయేవాడు. చూస్తుండగానే ముంగిస పెరిగిపోయింది. పదిహేను రోజుల్లో దానికి డొక్కులో పెట్టే అవసరం లేకపోయింది. తాడు మెడకు కట్టి అది ఎటు తీసుకువెళ్తే అటు తిప్పేది అమ్మాయమ్మ. చుంచు మూతి, మూతి చివర లేత ఎరుపు, ఊదారంగు శరీరం, కొండ చీపురుకట్టలా తోక, చిన్న కళ్లూ, చెవులూ గెంతుతూ నడుస్తూంటే మువ్వలు గలగలలాడుతున్నాయి. దానికి పేరు కూడా అమ్మాయమ్మ పెట్టింది. ‘‘బయ్యన్న... బయ్యన్న..’’ నెలరోజులకల్లా ఏ తాడు అక్కర్లేకపోయింది. పేరు పెట్టి పిలిస్తే పరుగెత్తుకు వస్తూంది. మూడు నెలలకు చుంచెలకలా ఎదిగిపోయింది. ఇప్పుడు దాని నివాసం ఇల్లు కాదు, పెరట్లో ఉన్న కర్రడొక్కు కాదు. ఏటి ఒడ్డున రాళ్ల పేరుపులో ఒక బిలం. ఉదయం కాఫీ వేళకి బిలం నించి బయటకు వచ్చి అటకమీదకెక్కి గోడలమీద నించి పాకుతూ ఘల్లుఘల్లుమంటూ మెల్లగా దిగువకు దిగుతుంది. అమ్మాయమ్మ ఆ మువ్వల మోత వినగానే ‘‘బయ్యన్నా, రారా’’ అని పిలుస్తుంది. దానికోసం ఒక పాతచేట గోడ దగ్గిరే పరిచి ఉంటుంది. దానిమీద కూర్చొని ఒకసారి ముందు కాళ్లు రెండూ ఎత్తుతుంది. ఇడ్లీ పంచదార వెయ్యకుండా ఎదర పెడితే అలుగుతుంది. పంచదార వెయ్యగానే అంత ముక్క అయిదు నిమిషాల్లో మింగేస్తుంది. మళ్లీ తిరుగు ప్రయాణం, అటు ధాన్యపు గాదెలు, ఇటు అటక, ఇంటి చుట్టూ ఒకసారి సాయుధ భటునిలా తిరిగి మళ్లీ బిలంలోనికి వెళ్లిపోతుంది. అమ్మాయమ్మ మధ్యన ఒకసారి ఏటి ఒడ్డుకు వచ్చి ‘‘బయ్యన్నా’’ అని కేక వేస్తే, ఒకసారి చాలు - ఘల్లుఘల్లున వస్తుంది. చేతిలో చేపను చూపిస్తుంది. అది ఇవ్వకపోతే ఆమె పాదాలపై నిల్చుని పైకి పాకడానికి ప్రయత్నిస్తుంది. ఈ బయ్యన్న ఇప్పుడు ఇంట్లో ఒక ముద్దు పిల్లాడు. కడుపు నిండా పెట్టకపోతే వాడు ఎంతో మారాం చేస్తాడు. అమ్మాయమ్మ కాళ్లా వేళ్లా పడతాడు. ఏ పనీ చెయ్యనివ్వడు. అదే పనిగా అరుస్తాడు. ఆమె మీదకే చెవిలో ఏదో చెబుదామని ఎగబ్రాకిపోతాడు. ఆ చిన్ని కాళ్లతో అడ్డాలలో పిల్లడు తల్లికి మూతితో, కాళ్లు చేతులతో గిలిగింతలు పెట్టినట్టు పెడతాడు. బయ్యన్న వాళ్ల దృష్టిలో ఇంకా ఆర్నెల్ల పిల్లాడే. కాని వాడు ఇంటి యజమానైపోయాడు. ఇంటి యజమాని సాధించలేక, విసిగి వదిలేసిన పనులన్నీ ఈ ఆరు నెలల యువకుడూ సాధించేవాడు. ఇంట్లో ఎలకలు లేవు. పందికొక్కులింకెటు పారిపోయాయో? ఏ తుప్పలు పట్టేశాయో? పాము పిల్లయినా మచ్చుకు కనబడలేదు. పాము పొరలు వెతుకుదామన్నా ఏటి ఒడ్డున కనబడలేదు. ఈ సంవత్సరం వాళ్లు ఎక్కడ, ఏది, ఎలా విడిచి పెట్టినా అలాగే ఉంటూంది. కూరగాయలు బోనె పెట్టి మీద పడేస్తున్నారు. ధాన్యం ఒక్కోసారి అలా నేలమీదో, బుట్టలోనో ఉంచేస్తున్నారు. ఏటిపై వచ్చే చల్లగాలి హాయిగా పీల్చి, వెన్నెలను తెరచాప చేసుకొని, నావలా కదిలే నీటిని చూస్తూ, ఏటి ఒడ్డున నిల్చుంటున్నారిద్దరూ. ఒక్కోసారి వాళ్ల యౌవనపు రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఇదివరలా ఏ పామైనా కాళ్లకు చుట్టుకుంటుందన్న భయం లేదు. ఒకనాటి తెల్లవారుఝామునే డాక్టరు ఇంటి ముందు గంభీరంగా భైరవయ్య చేతితో కర్రతో నిల్చున్నాడు. వాడు వీళ్లకు దూరపు చుట్టం. వీళ్లకు వాడి కంటే జరుగుబాటు హెచ్చని కన్నుకుట్టుకుంటున్నాడు. ఏదో సాకుతో వీళ్లమీద విరుచుకుపడ్డానికి ఉరుకుతూంటాడు. మాంచి పొంకంతో మెలితిరిగిన నల్లని బొడ్డు మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టగలనంటాడు. పెరిగిన జుత్తుకు వంకీలు తిప్పి వెనక్కి వదిలాడు. ‘‘ఏమైం’’దన్నాడు డాక్టరు. ‘‘నే చెప్పాలా? రాత్రి బయ్యన్న ఈ కోడిపిల్లల్ని నొక్కేసింది.’’ ‘‘ఎవరు చూశారు?’’ ‘‘దీనికి సాక్ష్యం కావాలా?’’ ‘‘నీవు కళ్లెర్రజేస్తే పనికిరాదు. అనవసరంగా మా బయ్యన్న మీద నేరం మోపక. అలాంటి పని చెయ్యడు. ఎవరో పిలిచి వేస్తే తింటాడు. అంతే.’’ ‘‘నీకు సాక్ష్యమే కావలసినవే వస్తే తెస్తాను.’’ వాడు పొరుగునుంచే సాక్ష్యం తెచ్చాడు. గడపలోనున్న కోడిప్లిలల్ని హతమార్చింది మీ బయ్యన్నేనని చెప్పగానే ఇది దొంగ సాక్ష్యమని కేకలేశాడు. ‘‘వీటి ఖరీదు, పది రూపాయలు. ఇచ్చేయి.’’ ‘‘అనవసరంగా నేనెందుకివ్వాలి? మా బయ్యన్న పీకలు కొరికే నీచుడు కాడు. నేను ఒక్క దమ్మిడీ ఇవ్వమంటే ఇవ్వను.’’ ‘‘సరే! పెద్దింటివాడివి. పసిమితో ఎగురుతున్నావు. నాకు నష్టం వచ్చింది. నీకు కాదు కదా! ఈ కోళ్లు నాకు హక్కయినవి కావనుకుంటాను’’ అంటూ ఆ కోడి పిల్లలను ఏట్లోకి విసిరేశాడు. ఇట్టే ఎగురుతున్న గెద్దలు అందుకున్నాయి. కోపంతో ఇంట్లోకి వచ్చిన డాక్టరుతో భార్య అంది. ‘‘వాడు క్రూరుడండీ. పోనీ, కొంతలో కొంత ఇచ్చి సముదాయించలేకపోయారా?’’ డాక్టరు ఖస్సుమన్నాడు. ‘‘వెధవ, అనవసరంగా మన బయ్యన్న మీద నిందలేస్తే పడతామా? అదే అక్కడకు వెళ్లుంటే ఘల్లుఘల్లుమని శబ్దం వినపడేది కాదా? ఆ పెట్ట అరిచేది కాదా? వీళ్లు లేచేవాళ్లు కాదా?’’ పది రోజులు గడిచిపోయాయి. డాక్టరు దగ్గరకు మందుకి వచ్చాడు భైరవయ్య. డాక్టరు పైసా పుచ్చుకోకుండా మందిచ్చాడు. కోడిపిల్లల ఊసే మరిచిపోయారు. పట్నంలో కూతుర్ని చూడ్డానికి డాక్టరూ, భార్య ఉదయమే బయలుదేరారు. ఇల్లుకు తాళాలు వేశారు. పెరటి డొక్కులో పాలన్నం గిన్నెలో పెట్టి ‘‘బయ్యన్నా, మధ్యాన్నం తినరా, పట్నం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం. ఇల్లు జాగ్రత్త’’ అంటూ అమ్మాయమ్మ చెప్పి మరీ వెళ్లింది. బయన్న వాళ్ల వెంట వద్దన్నా పడ్డాడు. ఇద్దరూ మర్రిచెట్టు కింద బస్సుకోసం కూర్చుంటూనే ముంగిస అరుపులు విన్నారు. ఆత్రంగా తిరిగి చూసేసరికి ఒక ముంగిస కాదు - బయ్యన్న కాక మరి రెండు ముంగిసలు. ఆ రెండు ఆ చిన్న చెవులు రిక్కించి కోపంతో అరుస్తున్నాయి. బయ్యన్న దారికడ్డమయ్యాయి. బయ్యన్న వాటిని చేరాలని ఆత్రపడుతున్నాడు. ‘‘అవిగో అవే, ఆ రెండు బయ్యన్న అమ్మా, నాన్నా’’ అన్నాడు డాక్టరు. ఇద్దరూ వింతగా చూస్తున్నారు. ఆ రెండు బయ్యన్న మీద ఉరకడానికి సిద్ధమౌతున్నాయి. బయ్యన్న కులం నుంచి వెలివేసిన మనిషిలా ఉన్నాడు. ‘‘చంపగలవండి. వాటిని తోలండి’’ అంది భార్య. వాటిని అదిలించి ‘‘రారా, బయ్యన్నా’’ అంటే మెల్లగా మూతి వంచుకుని అమ్మాయమ్మ దగ్గరకు వచ్చి పాదం మీద పడుకున్నట్లు వంగిపోయాడు. ఆమె ఎత్తుకొనగానే మూతి దగ్గర మూతిపెట్టి మెల్లగా అరుస్తున్నాడు. ‘‘మీ అమ్మా, నాన్నా నిన్ను రానివ్వలేదని ఏడుస్తున్నావా? మేం ఉన్నాం కదరా. నీ అమ్మను నేను, అరుగో, మీ నాన్న. వెళ్లు ఇంటికి - ఇంట్లో నీవు లేకపోతే శత్రుమూకలు దాడిచేసేస్తాయి. వెళ్లు, నాయనా. వెళ్లరా’’ అమ్మాయమ్మ ఒక ముద్దు పెట్టుకుని అంత దూరం వెనక్కు వచ్చి విడిచిపెట్టింది. రాను రాను ఘల్లుఘల్లుమనే శబ్దం దూరమైపోయింది. ఇంతలో బస్సు వస్తూంది. డాక్టరు పిలుస్తున్నాడు. తిరిగి రోడ్డుమీదకు పరుగెత్తింది. పది గంటలయింది. ఇంకా పాలన్నం తినటానికి సమయం కాలేదు. ఆ సమయం వస్తే గంటలు విన్నట్లు మరీ వెళ్తుంది. ‘‘బయ్యన్నా, రారా...’’ అన్న పిలుపు ఒకసారి బిలం నించి వచ్చి చూశాడు. మళ్లీపిలుపు. భైరవయ్య ఒడ్డులో నిల్చున్నాడు. ‘‘రారా బయ్యన్నా... ఇదిగో చేప... రారా... రారా...’’ సన్నగా మోత వినిపించింది. చెంగుచెంగున రాళ్లన్నీ ఎగబ్రాకింది. భైరవయ్య చేతిలో చేప చూశాడు. కొద్దిగా జరిగాడు భైరవయ్య. అందుకోడానికి ఘల్లుమని శబ్దం చేస్తూ ఉరికాడు. ఎదురుగా మునకాలకర్ర పట్టుకుని మీసం తిముడుతూ నిల్చున్న భైరవయ్య, ఒక్కసారి కర్రెత్తి దభీమని బయ్యన్న శరీరం మీద వేశాడు. బయ్యన్న ఒక్కసారి అరిచి ‘‘వద్దు! వద్దు! నేనేం పాపం ఎరగ’’నన్నట్లు ఆ మూతి ఎత్తాడు. మళ్లీ దభీమని ఇంకో దెబ్బ. బయ్యన్న కిలకిలా తన్నుకుంటున్నాడు. మరి రెండు దెబ్బలతో మూగబోయాడు. భైరవయ్య తోక పట్టుకుని ఎత్తాడు. నోటి వెంబడి రక్తం కారుతూంది. ‘‘బయ్యన్నా, రారా’’ అంటే ఈ మానవాళి అరుపంతా సౌహార్థం, ప్రేమతో నిండి ఉంటుందనీ, వాళ్ల కరుణతో తనలాంటి జంతు జాలానికి కడుపు నింపుతారని ఆశతో ఆ పిలుపు వింటుండిన చెవులు శాశ్వతంగా చెముడయ్యాయి. భైరవయ్య ఏటిలోనికి బయ్యన్న శవాన్ని విసిరేశాడు. కింద రక్తం పడిన జాగాలో మన్నంతా ఎత్తి ఏటిలో పారేశాడు. ఏమీ తెలియనట్లు, ఏటికి పోయి కాళ్లు చేతులు కడుక్కున్నాడు. సాయంత్రం. పొద్దుకుంగకుండానే ఉదయం పశువులను తోలుకు వెళ్లిన పసివాడు తిరిగి వచ్చాడు. పట్నం నించి డాక్టరూ, అమ్మాయమ్మా తిరిగివచ్చారు. బయ్యన్నకు తీపి వస్తువులు ఇష్టమని, ఎండు చేపలు మరీ ఇష్టమని అమ్మాయమ్మా అవే కొనుక్కొని వచ్చింది. ఇంటికి రాగానే పెరటి డొక్కులో చూసింది. పాల అన్నం అలాగే ఉంది. ‘‘చూడండి, మన బయ్యన్నకు, ఎంత దర్జాయో! చెప్పి మరీ వెళ్లినా - తినలేదు.’’ ‘‘నీవు దగ్గర ఉండి తినిపిస్తే గాని తినడే.’’ సంచిలోని ఒక ఎండు చేపను తీసుకుని, అమ్మాయమ్మా ఏటి ఒడ్డుకు వచ్చింది. ‘‘బయ్యన్నా, రారా... నీకిష్టమైనది తెచ్చాను రా. రారా... నాయనా... రారా’’ పిల్చింది. మళ్లీ మళ్లీ పిల్చింది. ఇంట్లో ప్రతిచోటా పిల్చింది. ‘‘ఎక్కడ తప్పిపోయాడో, ఇంటికి తెచ్చి దిగబెట్టకుండా మధ్యమ వదిలి వచ్చేశాను. ఆ పాడు బస్సు అంతసేపు రానిది, అప్పుడే వచ్చేయాలా? తోవలో ఏ కుక్క నొక్కేసిందో, ఏ పిల్లి పట్టేసుకుందో, ఆ రెండు ముంగిసలు వచ్చి దానిమీదపడ్డాయేమో?’’ అంత చీకట్లో కూడా మొగుడితో కలిసి మర్రిచెట్టు వరకు కేకలు వేసుకుంటూ వెళ్లింది. పిల్చింది. తిరిగివస్తూ ఎన్నో విధాల పిలిచింది. ఇంటికి వచ్చినా వంట లేదు. నోట్లో మంచినీరైనా పొయ్యలేదు. రాత్రంతా జాగారం చేసింది. మధ్యన లేచి వచ్చి ఏటి ఒడ్డున ‘‘నాయనా, బయ్యన్నా, నీకు తీపి తీపి మిఠాయి తెచ్చానురా. నీకిష్టమైన చేపలు తెచ్చానురా. రారా. నాయనా, రారా...’’ అని పిలిచింది. తెల్లవారినా ఆ ఘల్లుఘల్లు శబ్దం వినబడలేదు. ఉదయమే తలకు స్నానం చేసి దేవుడి గదిలో గంటసేపు కూర్చొని నా బయ్యన్నను నాకియ్యమని మొక్కింది. నలుగురిచేత వెతికించింది. వాడు దొరికితే పూజలు పునస్కారాలు చేస్తానంది. రెండు రాత్రుళ్లు గడిచిపోయాయి. బయ్యన్న జాడ తెలియలేదు. మూడో రాత్రి అటకపైన చప్పుడయింది. ఆత్రంగా లేచింది. అది ఘల్లుఘల్లుమన్న శబ్దం కాదు. పటుక్కు పటుక్కుమని శబ్దం వినిపిస్తూంది. లెటైత్తి చూస్తే ఇదివరలా బాహాటంగా ఒదిలేసిన ధాన్యాన్ని ఎలకలు వంచన చేస్తున్నాయి. వాటిని తోలాలన్న మనసైనా పుట్టలేదు. బయ్యన్న ఎక్కడో బతికి ఉన్నాడని, ఎవరో ఇనప గొలుసుతో కట్టేశారని, ఆ గొలుసు పటుకు పటుకుమని నమిలి, తెంపుకుని తనను చూడటానికి ఎప్పటికైనా వస్తుందని అమ్మాయమ్మ విశ్వాసం. ఒకనాడు ఉదయం. పొద్దు కాస్త మీదికి లేచింది. భైరవయ్య ఇంట్లో నించి కోడిపిల్లలను వదిలాడు. డాక్టరు ఇంటి ఎదర వీధి అది. చింతచెట్టు కింద ఏటి ఒడ్డులో రాలిన గింజలను కోళ్లపిల్లల సమూహం ఏరుకుంటున్నాయి. బయ్యన్న బాధ తప్పించుకున్నందుకు భైరవయ్య మురిసిపోతూ ఇంక కోళ్లను ఆ రాత్రి నించి అరుగుల మీద విడిచిపెట్టినా భయం లేదనుకున్నాడు. ఆ కోడి పిల్లల రంగుల వేపు చూసి మురిసిపోతున్నాడు. అలా అతను చూస్తుండగానే, ఒక ముంగిస - బయ్యన్న కంటె మరీ పెద్దది, భీకరమైంది, లేత నలుపు రంగుది - కోడిప్లిలపై ఉరుకుతూ ఒకదాన్ని పట్టుకుంది. భైరవయ్య పరుగెత్తి వెంట తరిమాడు. రాళ్లలో ఏ బిలంలోనికి పోయిందో ఎంత వెతికినా దొరకలేదు. తిరిగి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ కోళ్లను ఇంటివైపు తోలుకుని పెళ్లాంతో కోళ్లను ముయ్యమని చెప్పాడు. భైరవయ్య మంచం ఎక్కాడు. తన కర్రతో కొడుతుండగా, నేరం ఎరగని అమాయకమైన బయ్యన్న ఎత్తిన మూతి, జోడించిన చేతులు, అదో మానవుడుగా ‘నాదేం తప్పులేదు. నన్ను చంపకు. చంపకు’ అని నిండా ప్రాణంపై ఆశతో గగ్గోలు పెట్టుకున్నట్లు తోచి, ఆ దృశ్యాన్ని మనసు నించి చెరుపుకోలేక నడుం జార్చేసుకున్నాడు. - బలివాడ కాంతారావు