breaking news
Tax evasion inhibition
-
జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపు
పన్ను పరిధిని విస్తరించడానికి, జీఎస్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త విధానాలను అన్వేషిస్తోంది. పన్ను ఎగవేతను గుర్తించి, అధికారికంగా నమోదుకాని డీలర్లను దాని పరిధిలోకి తీసుకురావడానికి గుజరాత్ రాష్ట్ర జీఎస్టీ యంత్రాంగం 30 బిజినెస్-టు-కన్స్యూమర్ (బీ2సీ) విభాగాలను గుర్తించింది. చాలా మంది రిజిస్టర్డ్ ట్రేడర్లు తమ ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తున్నారని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరికొందరు తమ వివరాలు నమోదు చేయకుండా పరిమితికి మించి సంపాదిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని కట్టడి చేసేలా 30 బీ2సీ విభాగాలను గుర్తించినట్లు చెప్పారు.ప్రభుత్వం గుర్తించిన బీ2సీ సెక్టార్లకు సంబంధించి అద్దె పెళ్లి దుస్తుల వ్యాపారులు, పాదరక్షలు, సెలూన్లు, నాన్ క్లినికల్ బ్యూటీ ట్రీట్మెంట్స్, ఐస్ క్రీం పార్లర్లు, టెక్స్టైల్ విక్రేతలు, పొగాకు వ్యాపారులు, బ్యాటరీ వ్యాపారులు, మొబైల్ ఫోన్, యాక్సెసరీస్ డీలర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, కృత్రిమ పూలు అమ్మకం దారులు, అలంకరణ ఉత్పత్తుల విక్రేతలు, కోచింగ్ క్లాసుల నిర్వాహకులు ఉన్నట్లు తెలిపారు.పరిమితి దాటినా నమోదవ్వని వివరాలు..రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 12 లక్షల మంది రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వీరి వాస్తవ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం పన్నుదారులను దీని పరిధిలోకి తీసుకురావడంపై దృష్టి సారించామన్నారు. బీ2సీ విభాగంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు వారి పూర్తి ఆదాయాన్ని నివేదించడం లేదన్నారు. కొందరు సరైన బిల్లులను జారీ చేయకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. చాలా మంది వ్యాపారుల టర్నోవర్ జీఎస్టీ పరిమితిని మించినప్పటికీ వివరాలు నమోదు చేయడం లేదన్నారు. పన్ను ఎగవేతను తగ్గించడమే లక్ష్యంగా కొన్ని విధానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..రెండు నెలల్లో రూ.20 కోట్లు..గత రెండు నెలలుగా గుజరాత్ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి రాష్ట్ర జీఎస్టీ విభాగం రూ.20 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. పన్ను పరిధిని విస్తరించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. సరైన బిల్లింగ్ లేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. రిజిస్టర్ కాని డీలర్లకు సరుకులు సరఫరా చేసే రిజిస్టర్డ్ ట్రేడర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలోకి వస్తారని తెలియజేస్తున్నారు. -
వ్యాపార వెలుగుకు జీ-20 ప్రతిన
- పన్ను ఎగవేతలపైనా దృష్టి - తీవ్రవాదంపై ఉక్కుపాదానికి చర్యలు ఇస్తాంబుల్: అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల మెరుగుదల, పన్ను ఎగవేతల నిరోధం వంటి అంశాలపై జీ-20 దేశాలు దృష్టి సారించాయి. దీనితోపాటు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ఆలోచనా ధోరణిని పక్కనబెట్టి, కేవలం తమ దేశం వృద్ధి కోణంలో కొన్ని దేశాలు తీసుకునే రక్షణాత్మక విధానాల పట్లా తీవ్ర వ్యతిరేకతను పాటించాలని తీర్మానించాయి. పారదర్శకతే లక్ష్యంగా ఆయా దిశల్లో ముందడుగులు వేయాలని నిర్ణయించాయి. తీవ్రవాదుల కార్యకలాపాల పట్లా ఆందోళన వ్యక్తం చేసిన జీ20 దేశాలు, ఆయా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని దేశాలూ ఇచ్చిపుచ్చుకోవాలని, తీవ్రవాదుల ఆస్తులను స్తంభింపజేయడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలని తీర్మానించాయి. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగిన సదస్సు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో భారత్ తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రాజన్, ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హాలు పాల్గొన్నారు. సంయుక్త ప్రకటన ముఖ్య అంశాలు... ⇒ అంతర్జాతీయ ఆర్థిక రికవరీ ఇంకా నిరాశగానే ఉంది. ఈ సవాళ్లను అధిగమించడానికి అన్ని దేశాలూ తగిన ప్రయత్నం చేస్తాయి. పటిష్ట, సుస్థిర, సమతౌల్య వృద్ధితో ఉపాధి అవకాశాల పెంపే ధ్యేయంగా కృషి కొనసాగుతుంది. ⇒చమురు ధరల తగ్గుదల ప్రపంచ వృద్ధికి దోహదపడే అంశం. వివిధ ఆర్థిక వ్యవస్థలపై ఇది ఆర్థికంగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక భవిష్యత్తులో ఈ ధరల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. కమోడిటీ మార్కెట్లలో ఈ పరిణామాలు, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై ఆయా పరిస్థితుల ప్రభావాలపై జీ- 20 ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంటుంది. ⇒ఐఎంఎఫ్ కోటా సంస్కరణలు సత్వరం జరగాలి.