breaking news
Tata institute of social sciences
-
బ్రజేశ్ ఠాకూర్ దోషే
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక షెల్టర్ హోంలో బాలికలపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ ఠాకూర్‌ను ఢిల్లీలోని పోక్సో కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఠాకూర్, మరో 18 మంది దోషులేనని స్పష్టం చేసింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, బాలికలకు డ్రగ్స్ ఇవ్వడం, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం.. తదితర నేరారోపణలపై బ్రజేశ్ ఠాకూర్, ఆ వసతి గృహం సిబ్బంది, బిహార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని పలువురు ఉద్యోగులపై ఈ కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌లో ఠాకూర్ నిర్వహిస్తున్న వసతి గృహంలో జరిగిన ఈ దారుణాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ 2018లో వెలుగులోకి తెచ్చింది. బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం తదితర నేరాలకు సంబంధించి పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఆయనను న్యాయమూర్తి సౌరభ్ కులశ్రేష్ట దోషిగా నిర్ధారించారు. ఏ శిక్ష విధించాలనే విషయమై ఈ నెల 28న వాదనలు వింటామని న్యాయమూర్తి ప్రకటించారు. పైన పేర్కొన్న నేరాలకు యావజ్జీవం పడే అవకాశముంటుంది. ముజఫర్‌పూర్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రోజీ రాణిని కూడా కోర్టు దోషిగా పేర్కొంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ దిలీప్ కుమార్ వర్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవి రోషన్ సహా మిగతా 17 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఠాకూర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో సీబీఐ హాజరుపర్చిన 69 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. వేధింపులకు గురైన 44 మంది బాలికల వాంగ్మూలాలను తీసుకుంది. ఆ బాలికల్లో 13 మంది మానసికంగా సరైన ఎదుగుదల లేనివారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణ చేపట్టి ఆర్నెల్లలో విచారణను కోర్టు ముగించింది. బ్రజేశ్‌తో తన భర్తకు సంబంధాలున్నాయన్న ఆరోపణ రావడంతో బిహార్ మంత్రి మంజు వర్మ పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో ఈ కేసును ముజఫర్‌పూర్ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. -
మౌలిక సదుపాయాలా.. అవెక్కడ?
- నగరంలోని ఎం- ఈస్ట్ వార్డ్‌లో దుర్భర పరిస్థితులు సాక్షి, ముంబై: నగరంలోని ఎం-ఈస్ట్ వార్డ్‌లో నివసిస్తున్న సుమారు 1.12 లక్షల మంది ప్రజలు కనీస మౌలిక సదుపాయలు పొందలేని స్థితిలో ఉన్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టీఐఎస్ఎస్) నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. నగరంలోని ఎం-ఈస్ట్ వార్డులో 72.5 శాతం జనాభా మురికి వాడల్లో నివసిస్తున్నారని, 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో సగం మంది నిరుద్యోగులున్నారని సర్వేలో వెల్లడైంది. బీఎంసీ ఆధ్వర్యంలో ఇక్కడ 72 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, కేవలం రెండు మాత్రమే సెకండరీ గ్రేడ్ పాఠశాలలు ఉన్నాయని తెలిసింది. వార్డులో పేదరికం వల్ల ఆదాయం తక్కువగా ఉందని, పట్టభద్రులు కూడా చిన్నాచితక పనుల చేసుకుంటూ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని టీఐఎస్ఎస్ ప్రొఫెసర్ అమితా భిడే తెలిపారు. -
న్యూఢిల్లీలో 'మరో మణిపురి' దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మణిపురికీ చెందిన జింగ్రామ్ కెన్గో (33)ను ఆగంతకులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆగంతకులు పరారైయ్యారు. జింగ్రామ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హస్తినలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో గత రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య దొంగతనం కోసం చేసినదిగా లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. జింగ్రామ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. పీహెచ్డీ చేసేందుకు మృతుడు జింగ్రామ్ నెల క్రితమే మణిపూర్ నుంచి హస్తినకు తరలి వచ్చాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో జింగ్రామ్ పీహెచ్డీ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
టిస్.. సోషల్ సెన్సైస్ కోర్సులకు అత్యుత్తమం
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్)కు ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గువహటిలలో క్యాంపస్‌లు ఉన్నాయి. తాజాగా 2014-16 విద్యా సంవత్సరానికి మాస్టర్ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ నాలుగు క్యాంపస్‌లలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంహెచ్ఏ, ఎంపీహెచ్ వంటి ఐదు విభాగాల్లో మొత్తం 45 రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తుంది. కోర్సులను బట్టి ఫీజు రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (10+2+3 లేదా 10+2+4 లేదా 10+2+2+1 విధానంలో, 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి). కోర్సుల వారీగా అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి సంబంధిత వివరాలను వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. ప్రవేశం: ఈ ప్రక్రియలో మూడంచెల విధానం ఉంటుంది. ఇందులో రాత పరీక్ష, ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్ (జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. ఈ మూడు దశలకు మొత్తం 225 మార్కులు కేటాయించారు. మొదట.. టిస్‌నెట్: మొదటి దశ రాత పరీక్ష. దీన్ని టిస్ నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిస్‌నెట్)గా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా 35 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం 100 మార్కులు కేటాయించారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఇంగ్లిష్ భాషలో ఉండే ఈ పరీక్షకు ఒక గంట 40 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. అభ్యర్థుల ఆసక్తిని బట్టి ఆఫ్‌లైన్ విధానంలో కూడా పరీక్షకు హాజరు కావచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాలి. రాత పరీక్షలో అభ్యర్థుల ప్రజ్ఞా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సామాజిక అంశాలు, ప్రస్తుతం వివిధ రంగాల్లో జరుగుతున్న పరిణామాలతోపాటు ఎనలిటికల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. లాంగ్వేజ్ ఎబిలిటీ విభాగం సులభంగానే ఉంటుంది. ఇందులో రీడింగ్ కాంప్రెహెన్షన్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్‌నెస్‌లో.. యూఎన్ఓ, భారతదేశం- నదులు-ఆర్థిక వ్యవస్థ, ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. నెగిటివ్ మార్కింగ్ లేదు. వెబ్‌సైట్‌లోని మాదిరి ప్రశ్నపత్రం ద్వారా ప్రశ్నల సరళిని తెలుసుకోవచ్చు. రెండో దశ.. పీఐటీ: రాత పరీక్షలో ఇన్స్టిట్యూట్ నిర్దేశించిన కటాఫ్ మార్కులను సాధించిన అభ్యర్థులకు రెండో దశ.. ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇందుకోసం 50 మార్కులు కేటాయించారు. ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్.. గ్రూప్ డిస్కషన్ లేదా రాత పరీక్షలలో ఏదో ఒక రూపంలో ఉంటుంది. టిస్ ముంబై క్యాంపస్‌లో సోషల్ వర్క్ ప్రోగ్రామ్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు పీఐటీని గ్రూప్ డిస్కషన్ రూపంలో నిర్వహిస్తారు. ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న వివిధ అంశాలపై అభ్యర్థుల అవగాహనను ఇందులో పరీక్షిస్తారు. హిందీ/ఇంగ్లిష్ భాషలను మాత్రమే గ్రూప్ డిస్కషన్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు కేటాయించిన సమయం 20 నిమిషాలు. మిగిలిన కోర్సులకు పీటీఐ రాత పరీక్ష రూపంలో ఉంటుంది. చివరగా ఇంటర్వ్యూ: పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ మాదిరిగానే ముంబై క్యాంపస్‌లోనే నిర్వహిస్తారు. ఇందుకోసం 75 మార్కులు కేటాయించారు. ఇందులో ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలడుగుతారు. మెరిట్ ఇలా: ప్రవేశ ప్రక్రియలో అనుసరించే మూడు విభాగాలకు ప్రత్యేకంగా వెయిటేజీ ఉంటుంది. ఈ క్రమంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు 50 శాతం, పీఐటీ/జీబీకి 20 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ కేటాయిస్తారు. ఈ మూడు అంశాలాధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ప్లేస్‌మెంట్స్: టిస్‌లో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశాల పరంగా ఎటువంటి ఢోకా లేదని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా పలు కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. డెవలప్మెంట్ స్టడీస్ అభ్యర్థులను ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. హెచ్ఆర్ఎం అండ్ ఎల్ఆర్ (హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ రిలేషన్) అభ్యర్థులను హిందూస్థాన్ లీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, యాక్సిస్ బ్యాంక్, పలు ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యతేదీలు: దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 25, 2013 పరీక్ష తేదీ: డిసెంబర్ 15, 2013. పీఐటీ అర్హుల జాబితా వెల్లడి: ఫిబ్రవరి 1, 2014. పీఐటీ/ఇంటర్వ్యూ షెడ్యూల్: మార్చి 11-ఏప్రిల్ 3, 2014. ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 26, 2014. వివరాలకు:https://admissions.tiss.edu www.tiss.edu క్యాంపస్‌లు, కోర్సులు ముంబై క్యాంపస్: స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్- స్పెషలైజేషన్స్: ఎంఏ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ; క్రిమినాలజీ అండ్ జస్టిస్; కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్; డిజేబిలిటీ స్టడీస్ అండ్ యాక్షన్; దళిత్ ట్రైబల్ స్టడీస్ అండ్ యాక్షన్; మెంటల్ హెల్త్; పబ్లిక్ హెల్త్; లైవ్లీహుడ్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; ఉమెన్-సెంటర్డ్ ప్రాక్టీస్; మేనేజ్మెంట్ ఆఫ్ వాలంటరీ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్;స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ స్టడీస్:హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్; సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; గ్లోబలైజేషన్ అండ్ లేబర్. స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ స్టడీస్: మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్; మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్; మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇన్ సోషల్ ఎపిడిమాలజీ; మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇన్ హెల్త్ పాలసీ, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్. స్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్: డెవలప్మెంట్ స్టడీస్; ఉమెన్ స్టడీస్; స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్: ఎడ్యుకేషన్- ఎలిమెంటరీ; స్కూల్ ఆఫ్ హేబిటెట్ స్టడీస్: క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టెయిన్‌బిలిటీ; డిజాస్టర్ మేనేజ్మెంట్; అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స; రెగ్యులేటరీ గవర్నెన్స్; వాటర్ పాలసీ అండ్ గవర్నెన్స్. సెంట ర్ ఫర్ హ్యూమన్ సైకాలజీ: అప్లైడ్ సైకాలజీ- స్పెషలైజేషన్ ఇన్ కౌన్సెలింగ్ సైకాలజీ; అప్లైడ్ సైకాలజీ-స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ సైకాలజీ. స్కూల్ ఫర్ మీడియా అండ్ కల్చరల్ స్టడీస్: ఎంఏ- మీడియా అండ్ కల్చరల్ స్టడీస్. సెంటర్ ఫర్ డిజిటల్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్-లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్; ఎల్ఎల్ఎం ఇన్ యాక్సిస్ టు జస్టిస్. తుల్జాపూర్ క్యాంపస్: ఎంఏ (సోషల్ వర్క్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ పాలసీ, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సస్టెయినబుల్ లైవ్లీహుడ్స్, నేచురల్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స) గువహటి క్యాంపస్: ఎంఏ (ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ సస్టెయిన బిలిటీ డెవలప్మెంట్; లేబర్ స్టడీస్ అండ్ సోషల్ సెక్యూరిటీ, పీస్ అండ్ కన్ఫ్లిక్ట్ స్టడీస్, ఎంఏ సోషల్ వర్క్ ఇన్ (కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్; లైవ్లీహుడ్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; కౌన్సెలింగ్; పబ్లిక్ హెల్త్). హైదరాబాద్ క్యాంపస్: ఎంఎ (రూరల్ డెవలప్మెంట్-గవర్నెన్స్;ఎడ్యుకేషన్,పబ్లిక్‌పాలసీ అండ్ గవర్నెన్స ఉమెన్ స్టడీస్, డెవలప్మెంట్ స్టడీస్)