breaking news
siksha.com
-
స్టార్టప్స్‌లో పెట్టుబడులు: ఈ షేరు రాకెట్ స్పీడ్
ముంబై, సాక్షి: ఇంటర్నెట్ ఆధారిత సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ షేరు తాజాగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈలో తొలుత దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 3,988కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం యథాతథంగా రూ. 3,925 వద్ద ట్రేడవుతోంది. గత రెండేళ్లలో ఈ కౌంటర్ 187 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా కంపెనీ అనుబంధ సంస్థలైన జాబ్ పోర్టల్, మాట్రిమోనీ, రియల్టీ పోర్టల్ ప్రభావం చూపుతున్నాయి. దీనికితోడు కంపెనీ జొమాటో, పాలసీ బజార్‌సహా కనీసం 23 స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో జొమాటో ఇటీవల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. కంపెనీ నౌకరీ, 99ఏకర్స్, జీవన్సాథీ, శిక్ష తదితర పోర్టళ్లను నిర్వహించే సంగతి తెలిసిందే. తొలి లిస్టెడ్ కంపెనీ డాట్‌కామ్ బూమ్ సమయంలో అంటే 1995లో ఆవిర్భవించిన ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ 2006 నవంబర్‌లో దేశీయంగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. తద్వారా దేశీయంగా లిస్టయిన తొలి ఇంటర్నెట్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇటీవల ఇన్ఫీబీమ్, ఇండియామార్ట్ ఇంటర్మెష్, రూట్ మొబైల్స్ తదితర పలు కంపెనీలు లిస్టయ్యాయి. టెమాసెక్, టైగర్ గ్లోబల్, చైనీస్ యాంట్ గ్రూప్‌నకు సైతం వాటాలు కలిగిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్‌కు సుమారు 20 శాతం వరకూ వాటా ఉన్నట్లు అంచనా. జొమాటోకు విదేశీ రీసెర్చ్ సంస్థ హెచ్ఎస్బీసీ ఏకంగా 5 బిలియన్ డాలర్ల విలువను అంచనా వేయడం గమనార్హం. దీంతో ఇటీవల ఇన్ఫో ఎడ్జ్ కౌంటర్ మరింత జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
పల్లె అల్లం... పట్నం బెల్లం!
* ప్రాంతాల్లోని కళాశాలల్లో చదివేందుకు విముఖత * నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కళాశాల్లో చేరేందుకు ఆసక్తి * ఎంబీయే చదువు కోసం ఢిల్లీ, ఎన్సీఆర్కే మొదటి ఓటు * తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పుణే, ముంబై నగరాలు న్యూఢిల్లీ: ఉపాధి కోసమే కాదు.. చదువుకునేందుకు కూడా జనం ఇప్పుడు పట్నంబాట పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నా పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో చేరేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను రూపుమాపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఇష్టపడడం లేదు. పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో సరైన సదుపాయాలు, బోధించే ఉపాధ్యాయులు లేకపోయినా అందులోనే చేరుతున్నారు. ప్రతి వంద మంది విద్యార్థుల్లో 66 మంది పట్టణాల్లో చదివేందుకే ప్రాధాన్యతనిస్తున్నారని శిక్షా డాట్ కామ్ సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వే ద్వారా వెల్లడైన వివరాల్లోకెళ్తే... రాజధాని రమ్మంటోంది... సాంకేతిక విద్య బాటపట్టే విద్యార్థులు... ప్రత్యేకించి ఎంబీఏ చదవాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎక్కువమంది ఢిల్లీ, రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లోని కళాశాల్లో చేరేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 21.1 శాతం మంది విద్యార్థులు ఎంబీఏ చదివేందుకు ఢిల్లీ, ఎన్సీఆర్కే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత 17.58 శాతం మంది బెంగళూరు కళాశాలలకు, 10.63 మంది పుణే కళాశాలలకు, 8.4 శాతం మంది ముంబైలోని కాలేజీలకు తమ ఓటు వేశారు. అనేక కారణాలు... రాజధాని ఢిల్లీలోని కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక కారణాలున్నాయని శిక్షా డాట్ కామ్ బిజినెస్ హెడ్ మనీశ్ ఉపాధ్యాయ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాల్లో సరైన వసతులు లేకపోవడం, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అంతగా అందుబాటులోకి లేకపోవడం వంటివి విద్యార్థులను హస్తినవైపు చూసేలా చేస్తున్నాయన్నారు. రాజధానిలో అయితే ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకునే అవకాశముందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేశారన్నారు. అంతేకాక తామ చదువుతున్న కోర్సుకు సంబంధించి కోచింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయని, అదే ఇతర ప్రాంతాల్లో కష్టమేనని చెబుతున్నారు. ఇంజ నీరింగ్ విద్యార్థులేకాదు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, డిజైన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే అభిప్రాయంతో ఢిల్లీ, ఎన్సీఆర్లోని కళాశాలల్లో చేరామన్నారు.