కౌన్సిలర్ కాల్చివేత
ఘజియాబాద్: ఘజియాబాద్ మున్సిపాల్టీకి చెందిన బీఎస్పీ కౌన్సిలర్‌ను అతని ఇంటి పరిసరాల్లోనే సాయుధ దుండగులు తుపాకీతో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.అశోక్ విహార్‌లో నివాసం ఉంటున్న 41 వార్డు కౌన్సిలర్ షకీన్ మాలిక్(47) తన ఇంటి పరిసరాల్లో కూర్చొని ఉండగా శుక్రవారం రాత్రి దుండగులు కాల్పులకు పాల్పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.