ఫిఫా నుంచి జట్టు నిష్క్రమణ.. స్టార్ ఫుట్‌బాలర్ వీడ్కోలు
ఫిఫా ప్రపంచకప్ నుంచి అల్జీరియా నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు స్టార్ ఫుట్‌బాలర్ రియాద్ మహ్రెజ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా టోర్నీలో రౌండ్ ఆఫ్-32లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్జీరియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు రియాద్ మెహ్రెజ్ తెలిపాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అల్జీరియా తరఫున 119 మ్యాచ్‌లాడిన 35 ఏళ్ల ఫార్వార్డ్ ప్లేయర్ రియాద్ మహ్రెజ్ 40 గోల్స్ సాధించి జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 2019లో ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (ఆఫ్కన్) టైటిల్ అందించడంలో రియాద్ మహ్రెజ్ది కీలకపాత్ర. అయితే రియాద్ మహ్రెజ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు దూరమైనప్పటికీ, సౌదీ ప్రో లీగ్ క్లబ్ @అల్ అహ్లీ తరఫున ఫ్రొఫెషనల్ క్లబ్ కెరీర్‌ను కొనసాగించనున్నాడు. ఇక క్లబ్ స్థాయిలో రియాద్ మహ్రెజ్ లీసెస్టర్ సిటీతో ఒక ప్రీమియర్ లీగ్ టైటిల్, మాంచెస్టర్ సిటీతో నాలుగు టైటిళ్లు , అలాగే సిటీతో ఒక ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సాధించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో 4 మ్యాచ్‌లాడిన రియాద్ మహ్రెజ్ 2 గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ అందించాడు. 'నా రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం. సహజంగానే అందరి కెరీర్లో ఎత్తుపల్లాలు ఉన్నట్లే నా కెరీర్లోనే అన్ని కష్టాలు, సంతోషాలు అనుభవించాను. చిన్నప్పటి నుంచి అల్జీరియాకు ప్రాతినిధ్యం వహించడం, నాదేశం కోసం ఆడడమనేది నా కల. ఇది నాకు లభించిన అపారమైన గౌరవం, గర్వకారణం. ఇక ఇప్పుడు కొత్త తరం ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. గుడ్‌బై' అని పోస్టు పెట్టాడు.🇩🇿 Riyad Mahrez : "C'était un match à notre portée."👀 Il annonce son dernier match avec la sélection #beINFWC2026 #FIFAWorldCup pic.twitter.com/y0C908Rsxx— beIN SPORTS (@beinsports_FR) July 3, 2026Read: గోల్‌కీపర్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు స్పెయిన్