breaking news
Queens Club
-
నాలుగేళ్ల విరామం.. 90 నిమిషాల్లో విజయం
నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. తన రీఎంట్రీ మ్యాచ్‌లో అదరగొట్టింది. క్వీన్స్ క్లబ్ ఛాంపియన్షిప్-2026 టోర్నీలో విక్టోరియా మ్బోకోతో(కెనడా) కలిసి ఆడిన సెరెనా, మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో అద్భుతమైన విజయం సాధించింది. ఈ జోడీ మూడవ సీడ్ జంట అయిన ఎరిన్ రౌట్లిఫ్ (న్యూజిలాండ్), నికోల్ మెలిచార్-మార్టినెజ్ (అమెరికా)లపై వరుస సెట్లలో 7-6 (7-2), 6-2 తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్ కేవలం 90 నిమషాల్లో ముగిసిపోయింది.ఏజ్ గ్యాప్ 25 ఏళ్లు.. అయినా అద్భుత విజయంకాగా 44 ఏళ్ల సెరెనా విలియమ్స్, 19 ఏళ్ల విక్టోరియా మ్బోకోల మధ్య వయసు వ్యత్యాసం ఏకంగా 25 సంవత్సరాలు. అయినప్పటకి ఈ ద్వయం అద్భుతమైన సమన్వయంతో ప్రత్యర్ధి జంటను చిత్తు చేసింది. కాగా 2022 యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు సెరెనా ప్రకటించింది.అయితే ఇటీవల తన మనసు మార్చుకున్న ఆమె తిరిగి కోర్ట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటి ప్రొఫెషనల్ మ్యాచ్. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె ఈ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది. సెరెనా కెరీర్లో మొత్తం 39 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. ఇందులో 23 మహిళల సింగిల్స్, 14 మహిళల డబుల్స్, రెండు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ ఉన్నాయి. -
ఆండ్రీ ముర్రే 'రికార్డు' షో
లండన్:ప్రపంచ రెండో నంబర్ ఆటగాడు, బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ ముర్రే క్వీన్స్ క్లబ్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముర్రే 6-7(5/7), 6-4, 6-3 తేడాతో మిలాస్ రాయనిక్(కెనడా)పై గెలిచి ఐదోసారి టైటిల్‌ను సాధించాడు. టై బ్రేక్ కు దారి తీసిన తొలి సెట్ ను కోల్పోయిన ముర్రే.. ఆ తరువాత రెండు సెట్లలో విజృంభించాడు. రెండు గంటల 13 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో రాయనిక్ను ముర్రే మట్టికరిపించాడు. తద్వారా ఐదోసారి క్వీన్స్ క్లబ్ టైటిల్‌ను సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఈ టైటిల్‌ను జాన్ మెక్ ఎన్రో, బోరిస్ బేకర్, ఆండీ రాడిక్, హెవిట్లను నాలుగు సార్లు మాత్రమే దక్కించుకున్నారు. మరోవైపు దాదాపు 10 సంవత్సరాల తరువాత డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ ను సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2005లో రాడిక్ ఒక్కడే ఆ ఘనతను అందుకున్నాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌కు వార్మప్ గా జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ముర్రే 37వ ఏటీపీ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.


