breaking news
PPF investment
-
పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?
చిన్నపిల్లల చదువు, వివాహాలు ఇతర భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ అధీనంలో ఉండి స్థిరంగా వడ్డీ సమకూర్చే పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహించే వారికిసైతం నష్టం కలిగేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరిచిన వారికి ఈ నిబంధనల వల్ల నష్టం కలుగుతుంది. మైనర్ల కోసం తెరిచే పీపీఎఫ్ ఖాతాదారులపై ఈ ప్రభావం పడుతుంది. కొంతమంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు) దేశం విడిచి వెళ్లిపోయి, రెన్యూవల్ చేయకపోయినా తమ ఖాతా యాక్టివ్‌లోనే ఉంటుంది. అలాంటి వారి ఖాతాలను ఉపసంహరించుకునేలా విధానాల్లో మార్పులు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.మైనర్ పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరిస్తే గతంలో దాదాపు 7.1 శాతం వడ్డీ చెల్లించేవారు. అయితే ఇకపై పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు అనుగుణంగా వడ్డీ చెల్లిస్తారు. అంటే మైనర్‌కు 18 ఏళ్లు వచ్చేవరకు 4 శాతం వడ్డీ ఇస్తారు. తర్వాత పీపీఎఫ్ నిబంధనల ప్రకారం వడ్డీ పెంచుతారు.పిల్లల చదువులు, వివాహాల కోసం చాలా మంది తల్లిదండ్రులు వారి పేరుమీద పీపీఎఫ్ ఖాతా తెరుస్తున్నారు. అందులో స్థిరంగా వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. అయితే ఇకపై ఈ అవకాశం లేకుండా పోయింది.ఇప్పటికే ఒక పీపీఎఫ్ ఖాతా నిర్వహిస్తున్నవారు సైతం రెండు కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. పీపీఎఫ్ డిపాజిట్ల వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు ఉండడం దీనికి ప్రధాన కారణం. దాంతో ఎక్కువ ఖాతాలు తెరిచి అధిక వడ్డీ సమకూరేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే ఇకపై ఈ వ్యవహారం కొనసాగదు.ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహిస్తున్న ఖాతాదారులు ప్రాథమిక ఖాతా వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఖాతాల్లోని నగదును రూ.1.5 లక్షల పరిమితికి సర్దుబాటు చేస్తారు. అనంతరం ఇతర ఖాతాల్లో మిగిలిన నగదుపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ప్రస్తుత పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం(పన్ను ఉండదు)గా ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల వల్ల ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలున్నవారు ఈక్విటీ మార్కెట్లను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కనీసం పదేళ్లు స్థిరంగా పెట్టుబడి పెట్టేవారు మ్యూచువల్ ఫండ్లు ఎంచుకుంటే పీపీఎఫ్ కంటే అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే రాబడులపై ట్యాక్స్ మిగుల్చుకోవాలంటే ‘ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్’లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. పదిహేనేళ్ల కాలపరిమితితో గరిష్ఠంగా ఏటా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఏదైనా అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైతే ఖాతా తెరిచిన ఐదేళ్ల తర్వాత ఒకసారి నగదు ఉపసంహరణకు అవకాశం ఉంది. -
ఈ స్కీంలో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు
సాక్షి,ముంబై: ప్రభుత్వ పథకాల ద్వారా లభించే వడ్డీతో ఇన్వెస్టర్లు గణనీయమైన లాభాలను దక్కించుకోవచ్చు. ముఖ్యంగా పన్ను రహిత ప్రభుత్వ పథకంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. రిస్క్ లేని ప్రభుత్వ పథకాల్లో చిన్న పెట్టుబడులే మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం. ఈ పథంలో పెట్టుబడి ద్వారా రూ. 1 కోటి రూపాయల వరకు లబ్ధి పొందవచ్చు. అయితే 25 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు రూ. 65 లక్షల కంటే ఎక్కువ వడ్డీ మనకు దక్కుతుంది. సంవత్సరానికి ఒకసారి లేదా, నెలకు ఒకసారి చొప్పున పెట్టుబడి పెడితే దానికి కాంపౌండ్ వడ్డీ లబిస్తుంది. వార్షిక రాబడి రేటు 7.1 శాతం. ఈ పథకం కింద అనుమతించబడిన అత్యధిక పెట్టుబడి కనిష్టం రూ.500 గా ఉంటే, రూ. 1.5 లక్షలు. ఇది కూడా పన్ను రహితమే కావడం గమనార్హం. అంతేకాదు ప్రతి మూడు నెలలకోసారి మూల్యాంకనం చేయడం ద్వారా ప్రభుత్వం ఈ పథకం కింద వడ్డీ రేటును పెంచుతుంది. ఏ పోస్టాఫీసులోనైనా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి, అయితే వాటిని అదనంగా ఐదు సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బును ఎలా డిపాజిట్ చేయాలి పీపీఎఫ్ కాలిక్యులేటర్ ప్రకారం, పెట్టుబడిదారుడు పీపీఎఫ్ పథకంలో నెలకు రూ. 12,500 లేదా సంవత్సరానికి రూ. 1.50 లక్షలు పెడితే 15 సంవత్సరాలలో మొత్తం రాబడి రూ. 40.68 లక్షలు అవుతుంది. అంటే 22.50 లక్షల రూపాయలు పెట్టుబడిపై ర. 18.18 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు. ఆ తర్వాత దీన్ని ఐదేళ్ల పాటు పొడిగించి, మరో ఐదేళ్లకు ఒకసారి మళ్లీ పెట్టుబడి పెడితే, మొత్తం మెచ్యూరిటీ 25 ఏళ్లు అవుతుంది. తద్వారా రూ. 1 కోటి 03 లక్షల 08 వేలు డిపాజిట్ అవుతుంది. మొత్తంగా25 సంవత్సరాల తర్వాత పెట్టుబడి రూ. 37.50 లక్షలు. అయితే రూ. 65 లక్షల 58 వేలు వడ్డీగా లభిస్తుందన్నమాట. -
రుణాలకు దారులెన్నో..
కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు తారుమారవుతున్నాయి. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతోపాటు కొందరి వేతనాలు తగ్గిపోగా.. ఉపాధి కోల్పోయిన వారూ ఉన్నారు. సందర్భం ఏదైనా.. నిధుల అవసరం ఏర్పడితే గట్టెక్కేందుకు రుణం తీసుకోవడం ఒక మార్గం. డబ్బులతో అవసరం ఏర్పడినప్పుడు అప్పటికే చేసిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవడం కూడా ఒక మార్గమే. అయితే, ఇలా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి బదులు వాటిపై రుణాలు తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. వీలు చిక్కిన వెంటనే రుణం తీర్చివేయడం వల్ల తమ పెట్టుబడులను య«థావిధిగా కొనసాగించుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ), పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, జీవిత బీమా పాలసీలు (ఎండోమెంట్) వీటిల్లో ఏ రూపంలో పెట్టుబడులు కలిగినా.. వాటిని రద్దు చేసుకోకుండా తనఖాపై రుణం పొందడానికి మార్గం ఉంది. పైగా వ్యక్తిగత రుణాలు, బంగారంపై రుణాలతో పోలిస్తే వడ్డీ రేటు తక్కువగా ఉండడం సానుకూలత. అంతేకాదు వీటిపై రుణాల జారీ సులభంగాను ఉంటుంది. తక్కువ రేటుకు లభించే ఈ సులభమైన రుణ మార్గాలపై సమాచారం అందించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. ఫిక్స్డ్ డిపాజిట్లు దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ రూపంలో రుణాన్ని పొందొచ్చు. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు ఎఫ్డీపై రుణాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. డిపాజిట్ విలువలో గరిష్టంగా 90 శాతాన్ని రుణంగా తీసుకోవచ్చు. రుణానికి అర్హతలనేవి బ్యాంకుల మధ్య కొంచెం వేర్వేరుగా ఉండొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే కనీసం రూ.25,000 డిపాజిట్‌పైనే రుణాన్ని అందిస్తోంది. కనీస రుణ కాల వ్యవధి ఆరు నెలలు. రుణం జారీకి పట్టే సమయం ఒక రోజు. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ కూడా కనీస రుణ అర్హతగా రూ.25,000ను అమలు చేస్తున్నాయి. ఎఫ్డీలపై రుణాన్ని ఓడీగా అందిస్తున్నాయి. మీ ఎఫ్డీపై వడ్డీ రేటుకు 1 నుంచి 3 శాతం అదనపు రేటును బ్యాంకులు సాధారణంగా వసూలు చేస్తుంటాయి. అదే సమయంలో మీ డిపాజిట్‌పై వడ్డీ రాబడి యథావిధిగా కొనసాగుతుంది. ఎస్బీఐ అయితే ఎఫ్డీ రేటుపై ఒక శాతాన్ని అదనంగా రుణ రేటు కింద తీసుకుంటోంది. యోనో యాప్ నుంచి రుణాన్ని తీసుకుంటే మరో పావు శాతాన్ని తగ్గింపు ఇస్తోంది. యాక్సిస్ బ్యాంకు టర్మ్ డిపాజిట్ రేటుపై 2 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఎఫ్డీపై రుణాలకు చాలా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును తీసుకోవడం లేదు. రుణాన్ని ముందస్తుగా తీర్చేసిన సందర్భాల్లోనూ ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. గడువులోపు రుణం చెల్లించకపోయినట్టయితే డిపాజిట్ మొత్తాన్ని బ్యాంకులు సర్దుబాటు చేసుకుంటాయి. సెక్యూరిటీలు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు సెక్యూరిటీల కిందకే వస్తాయి. వీటిపై చాలా బ్యాంకులు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఎటువంటి సెక్యూరిటీలపై రుణాలను అందించేదీ ఆయా బ్యాంకుల పోర్టళ్ల నుంచి తెలుసుకోవచ్చు. వీటిపై రుణాలు కూడా ఓడీ రూపంలోనే లభిస్తాయి. స్టాక్స్ అయితే మార్కెట్ విలువలో 50 శాతం నుంచి 60 శాతం వరకు గరిష్టంగా రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. గరిష్ట రుణ పరిమితి రూ.20 లక్షలు. ఉదాహరణకు రూ.కోటి విలువ చేసే షేర్లు ఉన్నా గరిష్టంగా అందుకునే రుణం రూ.20 లక్షలుగానే ఉంటుంది. కనీస రుణ పరిమితి అనేది బ్యాంకుల మధ్య మారిపోతుంది. ఎస్బీఐ అయితే కనీస రుణ పరిమితిగా రూ.50వేలను అమలు చేస్తోంది. అంటే ఎస్బీఐలో సెక్యూరిటీలపై రుణం తీసుకోవాలనుకునే వారు కనీసం రూ.లక్ష విలువ చేసే పెట్టుబడులను కలిగి ఉండాలి. అదే హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు అయితే రూ.లక్షను కనీస రుణంగా సెక్యూరిటీలపై ఆఫర్ చేస్తున్నాయి. కనుక వీటిల్లో రుణానికి రూ.2లక్షల విలువ చేసే సెక్యూరిటీలను కలిగి ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్, హైబ్రిడ్ ఫండ్స్‌తోపాటు ఈక్విటీ యూనిట్లపైనా రుణాన్ని పొందే అవకాశం ఉంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై చాలా బ్యాంకులు నికర విలువలో 50 శాతాన్నే రుణంగా ఆఫర్ చేస్తున్నాయని గమనించాలి. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే పెట్టుబడుల విలువపై గరిష్టంగా 80 శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు. షేర్లు అయినా, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు అయినా వాటి విలువ ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులు ఆధారంగా మార్పులకు లోనవుతుంటుంది. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల విలువను రోజువారీ లేదా వారానికోసారి బ్యాంకులు మదింపు చేస్తుంటాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు అయితే ప్రతీ శుక్రవారం ఇలా విలువను మదింపు చేస్తుంటుంది. ఒకవేళ షేర్లు లేదా ఫండ్స్ యూనిట్ల విలువ గణనీయంగా పడిపోతే ఆ వ్యత్యాసాన్ని తిరిగి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అదనపు చెల్లింపులు చేయాలని బ్యాంకులు రుణ గ్రహీతలను కోరతాయి. లేదా ఆ మేరకు అదనపు షేర్లు లేదా పెట్టుబడులను హామీగా ఉంచినా సరిపోతుంది. అలాగే, పెట్టుబడుల విలువ పెరిగిన సందర్భాల్లో అదనపు రుణానికి అర్హత లభిస్తుంది. రేట్లు, చార్జీలు..: సెక్యూరిటీలపై ఇచ్చే రుణాలకు బ్యాంకులు 7–18 శాతం మధ్య వడ్డీ రేటును అమలు చేస్తున్నాయి. ఎస్బీఐ 9.75 శాతం వార్షిక రేటును అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు 8.4–10.6 శాతం మధ్య రేటును వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.3,500ను చార్జ్ చేస్తోంది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధి 12–36 నెలలుగా ఉంటుంది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, కేవీపీ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రం (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లపై బ్యాంకులు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. పీపీఎఫ్‌పై రుణం కోరుకుంటే ఖాతాలోని బ్యాలెన్స్‌పై గరిష్టంగా 25 శాతానికే పరిమితం అవుతుంది. అదే ఎన్ఎస్సీ, కేవీపీలపై గరిష్టంగా 80–90 శాతం వరకు రుణాన్ని పొందొచ్చు. బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ) ఎన్ఎస్సీ, కేవీపీ ముఖ విలువపై 80–85 శాతం వరకు రుణంగా ఇస్తోంది. ఎన్ఎస్సీ విలువలో గరిష్టంగా 75 శాతాన్ని రుణంగా ఇండియన్ బ్యాంకు ఆఫర్ చేస్తోంది. పీపీఎఫ్‌పై రుణానికి వసూలు చేసే వడ్డీ రేటు వార్షికంగా ఒక శాతంగా ఉంటుంది. అయితే తీసుకున్న రుణం మేరకు పీపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్‌పై వడ్డీని బ్యాంకులు ఆఫర్ చేయవన్న విషయాన్ని నిపుణులు గుర్తు చేన్నారు. రుణం తీర్చివేసిన అనంతరమే ఆ మొత్తంపై తిరిగి వడ్డీని బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. ఒకవేళ పీపీఎఫ్‌పై తీసుకున్న రుణాన్ని 36 నెలల్లోపే తీర్చివేయలేకపోతే 6 శాతం వార్షిక వడ్డీ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఎన్ఎస్సీ, కేవీపీలపై రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటు బ్యాంకుల మధ్య మారిపోతుంది. ఉదాహరణకు ఎస్బీఐ అయితే వీటిపై రుణాలకు 11.9 శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేస్తోంది. జీవిత బీమా పాలసీలు సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీబ్యాక్, హోల్‌లైఫ్)లపైనా రుణాలను తీసుకునే అవకాశం ఉంది. మీ వద్దనున్న బీమా పాలసీలపై రుణాలకు అర్హత ఉన్నదా, లేదా అన్న విషయం పాలసీ డాక్యుమెంట్‌ను చూసి తెలుసుకోవచ్చు. నిధుల అవసరం ఏర్పడితే అప్పుడు బీమా పాలసీలపై రుణాన్ని పరిశీలించొచ్చు. పాలసీ సరెండర్ వ్యాల్యూ (స్వాధీనత విలువ) ఆధారంగా మంజూరయ్యే రుణం ఆధారపడి ఉంటుంది. సరెండర్ వ్యాల్యూలో 80 శాతం వరకు రుణంగా పొందొచ్చు. సరెండర్ వ్యాల్యూ ఉంటే ల్యాప్స్ అయిన పాలసీపైనా రుణాన్ని తీసుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు రుణాలపై 9 శాతం రేటును వసూలు చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే 9.25–13 శాతం మధ్య వడ్డీ రేటును అమలు చేస్తున్నాయి. బ్యాంకులతో పోలిస్తే బీమా కంపెనీలే తక్కువ రేటును ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా పాలసీ గడువు లోపు ఈ రుణాలను తీర్చే వెసులుబాటు ఉంటుంది. ఎంపిక ఎలా..? ఒకటికి మించిన సాధనాల్లో పెట్టుబడులు చేసిన వారికి.. నిధుల అవసరం ఏర్పడినప్పుడు వేటిపై రుణం తీసుకోవాలన్న సందేహం తలెత్తవచ్చు. కావాల్సిన రుణం, వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగా పరిశీలించొచ్చు. ఎందుకంటే ఎఫ్డీ విలువలో 80–90 శాతం వరకు రుణంగా పొందే వీలుంది. పైగా ఎఫ్డీ రేటుపై 1–3 శాతం మేరే అధికంగా రుణ రేటును బ్యాంకులు వసూలు చేస్తాయి. కనుక రుణ రేటు 10 శాతం లోపే ఉంటుంది. పైగా ఎఫ్డీపై రుణానికి బ్యాంకులు ఇతరత్రా చార్జీలు తీసుకోవడం లేదు. ఆ తర్వాత ఎన్ఎస్సీ లేదా సంప్రదాయ జీవిత బీమా పాలసీలపై రుణాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వాటి విలువలో 80–85 శాతం వరకు రుణంగా లభిస్తుంది. వడ్డీ రేటు ఎఫ్డీలతో పోలిస్తే కాస్త అధికంగా.. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే తక్కువగాను ఉంటుంది. సెక్యూరిటీలపై రుణం అన్నది చివరి ఎంపికగా ఉండాలి. ఎందుకంటే రుణం కోసం హామీగా ఉంచే సెక్యూరిటీల విలువ ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఆటుపోట్లకు గురవుతుంటుంది. -
పీపీఎఫ్ డబ్బు వెనక్కి తీసుకోవాలంటే.. ఎనిమిదేళ్లు ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలో పెట్టుబడి పెట్టేవారు ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తే కనీసం ఎనిమిదేళ్లు వేచి చూడాల్సిందే. పీపీఎఫ్ 0ఇన్వెస్ట్మెంట్ ఉపసంహరణకు కనీస కాలపరిమితి (లాకిన్ పిరియడ్) పెంచాలన్న ప్రతిపాదనను ఆర్థికమంత్రిత్వశాఖ పరిశీలిస్తున్న విషయాన్ని సంబంధిత వర్గాలు బుధవారం తెలియజేశాయి. ప్రస్తుతం ఈ కాలపరిమితి ఆరేళ్లు.పీపీఎఫ్ పెట్టుబడి మెచ్యూరిటీ కాల పరిమితిని ప్రస్తుత 15 ఏళ్ల నుంచి మరింత పెంచే ప్రతిపాదన కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మౌలిక రంగం అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక నిధుల లభ్యత కోసం ఈ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్లో కేంద్రం మౌలిక రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని అధికార వర్గాలు ఈ సందర్భంగా ప్రస్తావించాయి. పీపీఎఫ్ వివరాలు ఇవీ: ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద మినహాయింపు ప్రయోజనం లభిస్తోంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై వడ్డీరేటు 8.7 శాతంగా ఉంది. వార్షికంగా కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడులు పెట్టే వీలుంది. వ్యక్తిగతంగా ఆరేళ్ల తరువాత ఇన్వెస్టర్ తన పీపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు వెనక్కు తీసుకోడానికి వీలుంది. నాలుగో ఏడాది తన అకౌంట్ కలిగిఉన్న మొత్తం ఫండ్‌లో గరిష్టంగా 50 శాతాన్ని అత్యవసర వ్యయం లేదా ఉన్నత విద్యకోసం ఉపసంహరించుకునే వీలూ ఉంది. 15 ఏళ్ల తరువాత మొత్తం మెచ్యూరిటీ అవుతుంది.