New Zealand vs Canada
-
T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ
భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్-2026 జరిగింది. టైటిల్ పోరులో టీమిండియా- న్యూజిలాండ్ తలపడగా ఆతిథ్య జట్టు చాంపియన్‌గా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ట్రోఫీని ముద్దాడింది.ఫిక్సింగ్ ఆరోపణలుఈ మెగా టోర్నీ ముగిసిన దాదాపు నెలన్నర తర్వాత సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఈవెంట్లో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగింది. గ్రూప్-డి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్- కెనడా మధ్య జరిగిన పోరుపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణకు ఆదేశించింది.టీ20 ప్రపంచకప్-2026లో న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో కలిపి కెనడాను గ్రూప్-డిలో వేశారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా కెనడా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. చెన్నై వేదికగా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది.యువరాజ్ సమ్రా సంచలన సెంచరీఓపెనర్ యువరాజ్ సమ్రా సంచలన సెంచరీ (65 బంతుల్లో 110)తో మెరిశాడు. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (6), ఫిన్ అలెన్ (21) వెనువెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి తరుణంలో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా పవర్ ప్లేలో భాగంగా ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు.దిల్‌ప్రీత్ వ్యవహారశైలిపై అనుమానాలునిజానికి దిల్‌ప్రీత్ రెగ్యులర్ బౌలర్ కాదు. అలాంటిది అతడు బౌలింగ్‌కు రావడమే కాకుండా రెండు ఓవర్లు బౌల్ చేశాడు. మొత్తంగా 26 పరుగులు ఇచ్చుకుని వికెట్ తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ అతడు తేలిపోయాడు. 39 బంతుల్లో 36 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో దిల్‌ప్రీత్ వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తాయి. పటిష్ట న్యూజిలాండ్‌పై గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించే క్రమంలో మెరుగైన స్థానంలో ఉన్నా.. కెనడా ఆఖరికి ఓటమిపాలైంది. ఇందుకు దిల్‌ప్రీత్ కారణమనే ఆరోపణలు రాగా.. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణకు ఆదేశించింది.వెలుగులోకి ఎలా వచ్చింది?ది ఫిఫ్త్ స్టేట్ అనే కెనడా ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇటీవల.. ‘అవినీతి.. నేరం.. క్రికెట్’ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఇందులో కెనడా క్రికెటర్లు దేశీ, అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఐసీసీ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టింది. కాగా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి కొన్ని వారాల ముందే దిల్‌ప్రీత్ బజ్వా కెనడా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. అంతకు ముందు కోచ్ ఖుర్రం చోహన్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. బుకీలతో అతడు సంబంధాలు కలిగి ఉన్నాడనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడా క్రికెట్ గనుక దోషిగా తేలితే ఐసీసీ నుంచి కఠిన చర్యలు తప్పవు.చదవండి: ‘ఏ క్షణమైనా బ్రెయిన్‌స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’ -
T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
కెనడా క్రికెటర్, భారత మూలాలు ఉన్న యువరాజ్ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. తాజా ఎడిషన్‌లో భాగంగా పటిష్ట న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ ఈ ఘనత సాధించడం విశేషం.58 బంతుల్లోనేటీ20 వరల్డ్‌కప్-2026లో భాగంగా గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్- కెనడా (NZ vs CAN) మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కెనడా ఓపెనర్ యువరాజ్ సమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.పందొమ్మిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కేవలం 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ సమ్రా 11 ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 110 పరుగులు సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదిన అతి పిన్నవయస్కుడిగా యువరాజ్ నిలిచాడు.A HISTORIC MILESTONE! 🙌Canada’s Yuvraj Samra creates history with a breathtaking century, becoming the youngest centurion in T20Is! 🫡ICC Men’s #T20WorldCup | #NZvCAN | LIVE NOW ➡️ https://t.co/uuKxoyS6gX pic.twitter.com/bCbK9u8AIq— Star Sports (@StarSportsIndia) February 17, 2026 173 పరుగులు ఇక కివీస్‌తో మ్యాచ్‌లో యువరాజ్ శతకం (110)తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్, కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో నవనీత్ ధలీవాల్ (10) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. నికోలస్ కిర్టాన్ (2) విఫలమయ్యాడు. హర్ష్ థాకర్ 3, దిలాన్ హెలిగర్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా కెనడా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 173 పరుగులు స్కోరు చేసింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ తీయగా.. యువరాజ్ రూపంలో జేకబ్ డఫీ కీలక వికెట్ దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లు🏏యువరాజ్ సమ్రా (కెనడా)- చెన్నై వేదికగా న్యూజిలాండ్ మీద 2026లో 19 ఏళ్ల 141 రోజుల వయసులో🏏అహ్మద్ షెహజాద్ (పాకిస్తాన్)- మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ మీద 2014లో 22 ఏళ్ల 127 రోజుల వయసులో🏏సురేశ్ రైనా (ఇండియా)- గ్రాస్ ఐస్లెట్ వేదికగా సౌతాఫ్రికా మీద 2010లో 23 ఏళ్ల 156 రోజుల వయసులో🏏అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)- ఛట్టోగ్రామ్ వేదికగా శ్రీలంక మీద 2014లో 25 ఏళ్ల 83 రోజుల వయసులో🏏గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)- సిడ్నీ వేదికగా శ్రీలంక మీద 2022లో 25 ఏళ్ల 327 రోజుల వయసులో సెంచరీ.కివీస్ గెలుపుఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 15.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 76), రచిన్ రవీంద్ర 39 (బంతుల్లో 59) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేశారు.చదవండి: గంభీర్‌కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్‌కోచ్ పదవికి గుడ్‌బై?


