breaking news
new trend in employment
-
నచ్చినప్పుడు నచ్చినంతసేపే పని
ఇష్టమున్నప్పుడే పని చేసే అవకాశం ఉంటే! తోచిన పనిని మాత్రమే చేసే ఆస్కారం ఉంటే! ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పనిచేయాలో నిర్ణయించుకొనే అధికారం మన చేతుల్లోనే ఉంటే! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతలో ఈ ఆలోచనా ధోరణి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇలా నచ్చిన సమయాల్లో నచ్చిన పనిచేసే వారి సంఖ్య రాకెట్ వేగంతో పెరుగుతోంది. తమ సమయానుకూలతను బట్టి పనిచేసే వారిని ముద్దుగా ’గిగ్ వర్కర్స్’ పిలుస్తున్నారు. అవసరం, అవకాశం మేరకు యజమాని, ఉద్యోగి స్వల్పకాలిక ఒప్పందం మేరకు చేసే పనుల ద్వారా సమకూరే ఆదాయాన్ని గిగ్ ఎకానమీగా పిలుస్తున్నారు. దీని పరిమాణమెంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది గిగ్ ఉద్యోగులున్నట్లు అంచనా. ఇక గిగ్ ఆర్థికవ్యవస్థ విలువ ఈ ఏడాది అక్కరాలా లక్షన్నర కోట్ల డాలర్లని మాస్టర్‌కార్డ్ అంచనా. ఇది 2025 కల్లా 2.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. మారిన కాలం.. అందివచ్చిన అవకాశం టెక్నాలజీలో మార్పులు, స్మార్ట్ఫోన్లు ఈ గిగ్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కడానికి తోడ్పడుతున్నాయి. గిగ్ ఆర్థిక వ్యవస్థ ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లపైనే నడుస్తోంది. పయనీర్స్ నివేదిక ప్రకారం 70 శాతం గిగ్ వర్కర్లు గిగ్ వెబ్సైట్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అమెరికాలో అతి పెద్ద గిగ్ వెబ్సైట్ ’ఆఫ్వర్క్’కు 1.5 కోట్ల సబ్స్క్రైబర్లున్నారు. 53 శాతం యువత స్మార్ట్ఫోన్ల ద్వారా ఉపాధి అవకాశాలు వెతుక్కుంది. వృత్తి నిపుణులు ఫేస్బుక్ ప్రచారం ద్వారా ఉపాధి పొందుతున్నారు. అమెరికాలో... అమెరికాలో 5.7 కోట్ల గిగ్ వర్కర్లున్నారు. 2027 కల్లా 8.6 కోట్లకు చేరతారని అసోసియేషన్ ఫర్ ఎంటర్ప్రైజ్ అపర్చునిటీస్ నివేదిక పేర్కొంది. ► రెగ్యులర్ ఉద్యోగుల కంటే గిగ్ వర్కర్లు మూడు రెట్లు వేగంగా పెరుగుతున్నట్టు అంచనా. ► గిగ్‌వర్కర్ల ద్వారా 2020లో దేశ ఆర్థిక వ్యవస్థకు 1.21 లక్షల కోట్ల డాలర్లు సమకూరాయి. ► స్వతంత్ర ఉద్యోగులు అమెరికాలో వారానికి 107 కోట్ల పని గంటలు పనిచేస్తున్నారు. ► ఫ్రీలాన్స్ వర్కర్లలో 51 శాతం ఎంత వేతనమిచ్చినా రెగ్యులర్ జాబ్‌కు నో అంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల కంటే వీరు 78 శాతం ఎక్కువ సంతోషంగా ఉన్నారని ‘ఆఫ్వర్క్’ పేర్కొంది. ► 80 శాతం అమెరికా కంపెనీలు గిగ్ వర్కర్ల ద్వారా వ్యాపార విస్తరణ కోసం వ్యూహాలు మార్చుకుంటున్నాయి. మన దేశంలో ఎలా? బలమైన గిగ్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. కరోనాతో దెబ్బతిన్న గిగ్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ► భారత్‌లో 1.5 కోట్ల మంది గిగ్ వర్కర్లున్నారు. ► మన గిగ్ ఆర్థిక వ్యవస్థకు 9 లక్షల రెగ్యులర్ ఉద్యోగులకు సమానమైన ఉపాధి కల్పించే సామర్థ్యముందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా. ► 2025 నాటికి దేశంలో గిగ్ వ్యాపారం 3,000 కోట్ల డాలర్లకు, అంటే రూ.2.3 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఏమిటీ గిగ్ వర్కింగ్..? ఓ కంపెనీలో నిర్ధిష్ట పనివేళల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు కాకుండా అవసరం మేరకు తాత్కాలిక పనులు చేస్తూ ఆదాయం పొందుతున్న ఫ్రీలాన్సర్లుగా గిగ్ వర్కర్లను చెప్పవచ్చు. ఆ లెక్కన స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ తెచ్చిచ్చే డెలివరీ బాయ్, ఓలా, ఉబర్ డ్రైవర్ గిగ్ వర్కర్లే. వెబ్ డిజైనర్లు మొదలు ప్రోగ్రామర్ల దాకా వందల వృత్తులవారు ఇలా పని చేస్తూ సరిపడా ఆదాయం పొందుతున్నారు. అమెరికాలోనైతే గిగ్ వర్కర్లు అత్యధిక ఆదాయం పొందుతున్నారు. కొందరు ఏటా లక్ష డాలర్లకుపైగా సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సగటు సంపాదన గంటకు 21 డాలర్లు! వీరిలో 53 శాతం 18–29 ఏళ్ల వారేనని ఓ సర్వేలో తేలింది. – సాక్షి,నేషనల్ డెస్క్ -
ఉద్యోగాన్వేషణలో సరికొత్త ట్రెండ్.. సోషల్ మీడియా
ఒకప్పుడు ఉద్యోగాన్వేషణలో జాబ్ పోర్టల్స్ పాత్ర ప్రముఖంగా ఉండేది.. కానీ నేటి నెట్వర్కింగ్ యుగంలో నయా ట్రెండ్.. జాబ్ సెర్చ్ వయా సోషల్ నెట్వర్కింగ్. సోషల్ మీడియా ప్రవేశంతో ఉద్యోగాన్వేషణ కొత్త పుంతలు తొక్కుతోంది.. జాబ్ మార్కెట్లోని విస్తృత అవకాశాలను అభ్యర్థుల ముంగిట నిలుపుతోంది. ప్రతి కంపెనీ సోషల్ నెట్వర్కింగ్లో ఖాతాను నిర్వహిస్తుండడం, యువతలో 85 శాతం మందికిపైగా సోషల్ వర్కింగ్ సైట్స్‌ను అనుసరిస్తుండడం (ఫాలో) కూడా కారణంగా పేర్కొనవచ్చు. పర్సనల్ టు ప్రొఫెషనల్: సోషల్ మీడియా పరిధి విస్తృతం. గత కొంత కాలంగా వ్యక్తిగత ఆసక్తి (పర్సనల్ ఇంట్రెస్ట్) నుంచి వృత్తి మాధ్యమానికి (ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్) వేదికగా మారింది. అన్ని కంపెనీలు/ సంస్థలు తమ మార్కెటింగ్/ కమ్యూనికేషన్ వ్యూహంలో సోషల్ నెట్‌వర్కింగ్‌ను తప్పనిసరి అంశంగా భావిస్తున్నాయి. తమ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియూలో పోస్ట్ చేస్తున్నాయి. నియామక ప్రక్రియలను కూడా ఈ మాధ్యమం ద్వారానే నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నాయి. అంతేకాకుండా స్వల్ప సమయంలో తక్కువ ఖర్చుతో ప్రతిభావంతులను ఆకర్షించే సులువైన మాధ్యమం సోషల్ మీడియా అని కంపెనీలు భావిస్తున్నాయి. దాంతో అన్ని రంగాలకు చెందిన కంపెనీల హెచ్ఆర్ విభాగంలో ‘సోషల్ రిక్రూట్మెంట్’ కొత్తగా చోటు సంపాదించుకుంది. కంపెనీలో ప్రస్తుత ఖాళీల వివరాలను తెలియజేస్తూ, అర్హతలు, కావల్సిన నైపుణ్యాలు, తదితర వివరాలను పోస్ట్ చేస్తున్నారుు. పెరిగిన ప్రాధాన్యం: సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌ను ఫాలో కావడంలో యువత వెచ్చిస్తున్న సమయం కూడా కంపెనీలు సోషల్ నెట్వర్కింగ్ మాధ్యమం ద్వారా నియామకాలు చేపట్టడానికి కారణమవుతుంది. దీనికి ఉన్న విస్తృత పరిధి, వేగంగా కమ్యూనికేట్ చేయడం, ప్రభావం దృష్ట్యా ప్రతి కంపెనీ సోషల్ రిక్రూటింగ్‌కు ప్రాధాన్యతనిస్తుంది. కావల్సిన ఉద్యోగుల కోసం ముందుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోని అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తాయి. ఈ క్రవుంలో తమ అవసరాలకు సరిపడా నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను వెంటనే సంప్రదిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం దేశంలో.. 34 శాతం మంది ఎంప్లాయర్స్ సోషల్ మీడియాలోని ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తున్నారు. అధిక శాతం మంది యువత కెరీర్ విషయంలో నిర్ణయం తీసుకోవడం, ఉద్యోగాన్వేషణ వంటి విషయాల్లో సోషల్ మీడియాను ఒక ప్రాథమిక అవసరంగా భావిస్తున్నారు. సోషల్ మీడియా కారణంగా యుువత తమ ఆసక్తికి అనుగుణమైన ఉద్యోగాన్ని ఎంచుకోవడం సులువైంది. తద్వారా కెరీర్‌ను విజయవంతం చేసుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాన్వేషణలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇందులో ఉండే దశలను జాగ్రత్తగా పూర్తి చేయాలి. అవి.. ప్రొఫైల్: ముందుగా ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లను గుర్తించాలి. తర్వాత వాటిల్లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఫొటో, అర్హతలు, నైపుణ్యాలు, కెరీర్, లక్ష్యాలు, గత అనుభవం (ఉంటే) తదితర వివరాలతో ప్రొఫైల్ రూపొందించాలి. మరో కీలకాంశం.. ప్రొఫైల్ హెడ్లైన్. ఒక రకంగా చెప్పాలంటే మీ నేపథ్యాన్ని ఒక వాక్యంలో స్పష్టం చేసేది హెడ్లైన్. ఉదాహరణకు-Fresh B.Tech (CSE) Graduate Looking for a Job లేదా Software Engineer with 2 Years Experience willing to relocate. ఎందుకంటే ఎంప్లాయర్స్ ఇటువంటి కీవర్డ్స్ ఆధారంగా కూడా సెర్చ్ చేయొచ్చు. చాలా మంది అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించడం లేదు. అదేవిధంగా ప్రొఫైల్ టెంప్లెట్ కార్టూన్లు లేదా ఇతర డిజైన్లతో గందరగోళంగా కాకుండా వైట్ బ్యాగ్రౌండ్ వంటి సాదాసీదాగా ఉండే టెంప్లెట్‌ను ఎంచుకోవాలి. భిన్నంగా: మరో కీలకాంశం ప్రొఫైల్‌పైనే ఆధారపడకుండా కంపెనీలను ఆకర్షించే విధంగా వెబ్బేస్డ్ రెజ్యుమెను రూపకల్పన చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ప్రొఫైల్ లేదా సీవీని రూపొందించి దానికి సంబంధించిన లింక్‌ను ప్రొఫైల్‌లో పొందుపరచాలి. తద్వారా ఎంప్లాయర్స్ మీ ప్రొఫైల్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించేఅవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే.. సొంత బ్లాగ్/వెబ్‌సైట్‌ను ప్రారంభించండి. సోషల్ మీడియాలో వాటి లింక్స్‌ను పోస్ట్ చేయాలి. సంప్రదాయ రెజ్యుమె స్థానంలో..సోషల్ మీడియాలో ప్రొఫైల్, ఆన్లైన్ రెజ్యుమె, వీడియో రెజ్యుమె, బ్లాగ్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి సృజనాత్మకతతో కూడిన వెబ్ బేస్డ్ రెజ్యుమెలను పరిగణనలోకి తీసుకునే కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థిలో వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ, సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎంత ప్రభావవంతంగా సృజనాత్మకంగా వినియోగించుకుంటున్నారనే అంశాలను తెలుసుకునేందుకు కూడా ఈ వెబ్ బేస్డ్ రెజ్యుమె ఉయోగపడుతుందని సంబంధిత నిపుణులు అభిప్రాయం. వీలైతే మీ ప్రతిభను నిరూపించే అంశాలతో కూడిన ఒక ఆల్బమ్‌ను రూపొందించాలి. మీరు డిజైన్ చేసిన వెబ్ పేజీలు, స్క్రీన్ షాట్స్, నిర్వహించిన ఈవెంట్లు, సెమినార్లు, సాధించిన విజయాలకు సంబంధించి ఏవైనా ఉంటే వాటి ఫొటోలు ఇలా.. నైపుణ్యాన్ని నిరూపించే అన్ని అంశాలతో ఆల్బమ్ ఉండాలి.దీని లింక్స్‌ను తప్పకుండా పోస్ట్ చేయాలి. గ్రూప్స్: ప్రొఫైల్ రూపకల్పన ప్రక్రియ తర్వాత మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలపై పక్కాగా ప్రిపేరవ్వాలి. తదనుగుణంగా కెరీర్, అర్హతలతో సంబంధం ఉన్న గ్రూపులు, కమ్యూనిటీలలో సభ్యులుగా చేరాలి. ఆయా నెట్వర్కింగ్ సైట్లలోని సెర్చ్ ఆప్షన్ ఉపయోగించి మీ కెరీర్ నేపథ్యానికి సరిపోయే కంపెనీల జాబితాను రూపొందించుకోవాలి. ‘లైక్’, ‘ఫాలో’ ఆప్షన్స్‌ను ఉయోగించడం ద్వారా సదరు కంపెనీ గ్రూపులో సభ్యులుగా చేరాలి. అందులోని సభ్యులతో పరిచయం పెంచుకోవాలి. నైపుణ్యాలాధారంగా వారిని ప్రభావితం చేయూలి. తద్వారా మీరు అవకాశం కోసం చూస్తున్న ప్రతిభావంతులు అనే భావనను కలిగించాలి. సదరు కంపెనీ పట్ల మీ నిబద్ధతను చూపాలి. ఉదాహరణకు ఒక ప్రొడక్ట్ సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఆ కంపెనీ అందించే సేవల పట్ల మీకు ఉన్న అవగాహన తెలియజేసే విధంగా పోస్ట్‌లు/ట్వీట్స్ ఉండాలి. సదా సిద్ధం:మరో కీలకాంశం.. నేర్చుకునేందుకు సదా సిద్ధంగా ఉన్నామనే భావనను కలిగించాలి. సంబంధిత నిపుణుల ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. తమ గ్రూపుల ద్వారా బృంద చర్చలు నిర్వహించాలి లేదా పాల్గొనాలి. కేవలం ఆన్లైన్ సమాచారానికే పరిమితం కాకుండా ఆయా గ్రూపులు/ కంపెనీలు నిర్వహించే వివిధ ఈవెంట్లలో పాల్గొనాలి. ఆయా గ్రూపుల్లో ఉండే నిపుణులు సంబంధిత రంగంలో రాణించడానికి అవసరమైన సూచనలను పోస్ట్ చేస్తుంటారు. వాటిని గమనిస్తూండాలి. ప్రస్తుతం పరిశ్రమల పనితీరును విశ్లేషించాలి. నిర్మాణాత్మక సూచనలు చేయడానికి ప్రయత్నించాలి. తద్వారా మీలోని ప్రతిభను సదరు సభ్యులు గుర్తించే అవకాశం కల్పించాలి. ప్రభావవంతంగా:మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియా టూల్స్‌ను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే పనిచేయాలనుకుంటున్న రంగానికి సంబంధించిన కంపెనీ/సంస్థ.. తెలుసుకునే విధంగా మిమ్మల్ని మీరు ప్రచారం (Turn Yourself Into an Advertisement) చేసుకోవాలి. ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడం, జాయినింగ్ ద గ్రూప్స్, ఫాలోయింగ్ కంపెనీ వంటి పనులను ఒకేరోజులో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారం వీటిని చేస్తూండాలి. ఒక రోజు ప్రొఫైల్‌ను క్రియేట్ చేస్తే మరో రోజు జాయినింగ్ గ్రూప్.. తర్వాత ఫాలోయింగ్ కంపెనీ వంటి అంశాలను చేపట్టాలి. వెంటనే కాదు: గ్రూప్స్, కంపెనీ ఫాలో అవుతున్న సమయంలో వెంటనే జాబ్ కావాలి అని పోస్ట్ చేయొద్దు. ఇది ఒక రకంగా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ‘హెల్ప్ మై కెరీర్’ అనే అర్థం ధ్వనించే విధంగా మన పోస్టింగ్ ఉండాలి. ప్రొఫైల్ చూసిన వెంటనే నిజాయితీ, ప్రొఫెషనలిజం ప్రస్ఫుటమవ్వాలి. అంతేకాకుండా ఉద్యోగం వచ్చే వరకు సమయాన్ని వృథా చేయకుండా నిత్యం ఏదో ఒక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో నిమగ్నమై ఉన్నాం అనే భావాన్ని కలిగించాలి. తదనుగుణంగా ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూండాలి. తద్వారా మీలోని ప్రతిభను గుర్తించే అవకాశం కల్పించాలి. అంతేకాకుండా సంబంధిత రంగంపై మీరు చదివిన లేదా మరే విధంగానైనా అవగాహనలోకి వచ్చిన సమాచారాన్ని షేర్ చేసుకోవాలి. Inputs by: Nitya Sai Soumya, TMI e2E Academy Pvt. Ltd. ప్రస్తుత ‘నెట్’ ప్రపంచంలో.. ఉద్యోగార్థులకు సోషల్ మీడియా నెట్వర్క్ ఎంతో కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక అభ్యర్థులు ట్విటర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ద్వారా తమ సన్నిహితులు, స్నేహితులను, పూర్వ విద్యార్థులను సంప్రదించి తమ అర్హతకు సరితూగే విధంగా అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలుసుకునే వెసులుబాటు ఎంతో. కేవలం ప్రొఫెషనల్స్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని సోషల్ మీడియా వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి. (ఉదా: జీజ్ఛుఛీజీ). ఇలాంటి వెబ్‌సైట్స్‌ను నిరంతరం అనుసరిస్తే అభ్యర్థి తనకు సంబంధించిన రంగంలో అప్పటికే అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌తో సంప్రదించే వీలుంటుంది. తద్వారా ఉద్యోగాన్వేషణలో ఇతరులతో పోల్చితే కొంత ముందంజలో ఉంటారు. - ఎం. రామకృష్ణ, మేనేజింగ్ డెరైక్టర్, జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్ సోషల్ మీడియా నెట్వర్క్ లేదా ఆన్లైన్ జాబ్ సెర్చ్ వంటివి సమకాలీన ప్రపంచంలో ఉద్యోగార్థుల విషయంలో చక్కటి సాధనాలు. సోషల్ నెట్వర్క్ ద్వారా ఒక వ్యక్తి తానేంటో ఇతరులకు తెలియజేసే వీలుంటుంది. ఈ క్రమంలో ఉద్యోగార్థులు కేవలం రెజ్యుమే పోస్టింగ్‌తో సరిపుచ్చకుండా చక్కటి ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే విధంగా అడుగులు వేయాలి. అప్పుడే రిక్రూటర్స్ దృష్టిని ఆకర్షించగలరు. సోషల్ నెట్వర్క్ అంటే గాసిప్స్, కామెంట్స్‌కు మాత్రమే అనే అపోహ వీడి.. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే ఉద్యోగ సాధనలో ఇవి ఎంతో తోడ్పడతాయి. అంతేకాకుండా నిరంతర అధ్యయనం, నలుగురిలో ఇమిడిపోగల తత్వం వంటి సహజ లక్షణాలు ఉన్నాయనే విధంగా సోషల్ నెట్‌వర్క్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే లాభిస్తుంది. - జి.ఆర్. రెడ్డి, ఫౌండర్ అండ్ చీఫ్ ఫెసిలిటేటర్ హ్యూసిస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని సోషల్ నెట్వర్క్స్ www.facebook.com https://in.linkedin.com https://plus.google.com www.skillpages.com https://myspace.com https://twitter.com గమనించాల్సినవి వేర్వేరు నెట్వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు.. అన్నిట్లోనూ ఒకే రకమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి. ప్రొఫైల్ చూసిన వెంటనే నిజాయితీ, ప్రొఫెషనలిజం ప్రస్ఫుటమవ్వాలి. పోస్టింగ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అన్నిటినీయాక్సెప్ట్ చేయకుండా.. మనకు బాగా తెలిసిన వారివే స్వీకరించడం ఉత్తమం. ఆన్లైన్ ప్రొఫైల్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌ను నిర్వహించడం మంచిది. కంపెనీలు ప్రాధాన్యతకు కారణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల (ఏఠజ్ఛ ఖ్చ్ఛ్టీ ౌౌ్క)ను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉండడం. ఆన్లైన్ టెక్నాలజీలపై అవగాహన ఉన్న యువతను సులువుగా గుర్తించడానికి తోడ్పడుతుంది. నియామక ప్రక్రియ(హైరింగ్ ప్రాసెస్), కమ్యూనికేషన్లో సమయాన్ని ఆదా చేయవచ్చు. సంప్రదాయ నియామక విధానంతో పోల్చితే ఈ మాధ్యమం ద్వారా ఖర్చు తగ్గుతుంది. కంపెనీలు తమ ఎంప్లాయిమెంట్ బ్రాండ్‌ను పెంచుకోవచ్చు.