breaking news
Ministry meeting
-
మోదీ విమానానికి పాక్ ఓకే
న్యూఢిల్లీ: అన్ని మంత్రిత్వ శాఖలు వచ్చే అయిదేళ్లలో ప్రజాభీష్టం మేరకు వారి జీవితాలను మెరుగుపరిచే ప్రభావవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ప్రధాని మోదీ ఉన్నతాధికారులను కోరారు. సోమవారం ఆయన అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రభావశీల ప్రణాళికతో ముందుకు వస్తే వందరోజుల్లోనే అమలయ్యేలా అనుమతులు మంజూరు చేస్తాం’ అని ప్రధాని అధికారులను కోరారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘దేశంలో పని చేయగలిగే వారి సంఖ్య ఎక్కువగా మంది ఉన్నందున వారిని సమర్థంగా వాడుకోవాలి. కేంద్రంలోని ప్రతి శాఖ, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మార్చేందుకు కీలకమైనవి. ఎంతో కీలకమైన ‘భారత్‌లో తయారీ’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. చిన్న వ్యాపారాలు, సంస్థల విషయంలో సులభతర వాణిజ్య విధానం ప్రతిఫలించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల కార్యదర్శులు పరిపాలనపరమైన నిర్ణయాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ, విద్యారంగ సంస్కరణలు, ఆరోగ్యం, పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాల్లో కొన్ని సూచనలు, సలహాలు చేశారు. 2014లోనూ ఇఏదేవిధంగా కార్యదర్శుల స్థాయి అధికారులతో మోదీ సమావేశమ య్యారు. మోదీ విమానానికి పాక్ ఓకే కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో జూన్ 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్ విజ్ఞప్తికి పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. తమ దేశం మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ వెళ్లేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టడంతో పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని మొత్తం 11 రూట్లకుగానూ రెండు మార్గాల్లోనే రాకపోకల్ని అనుమతిస్తోంది. కాగా, జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన విజ్ఞప్తికి మోదీ అంగీకరించారు. ఫ్రాన్స్‌లోని బియర్రిట్జ్‌లో ఆగస్టు 24 నుంచి 26 వరకూ జరిగే 45వ జీ7 సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించారు. -
బాబూ... ఓ సారి వచ్చిపోవలె...
♦ ఇసుక అక్రమార్కులపై చర్యలు నిల్ ♦ గాయత్రీ ర్యాంపులో రెట్టింపు ధరలపై ఫిర్యాదులు ♦ తూతూమంత్రం తనిఖీలతో సరిపెడుతున్న రెవెన్యూ యంత్రాంగం ♦ పక్కా ఆధారాలున్నా మౌనం వెనుక మర్మమేమిటో..? ♦ రెవెన్యూ అధికారులను నిలువరిస్తున్న ‘పవర్’ సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలోని ర్యాంపుల్లో అక్రమాలను ఆపేందుకు అవసరమైతే రంగ ప్రవేశం చేస్తానన్న సీఎం చంద్రబాబుకి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇసుక దందా కనిపించడం లేదా అని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక విక్రయాల్లో అక్రమాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యంత్రాంగం నియంత్రించలేకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. అయినా జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నా కూడా చేష్టలుడిగిచూస్తోంది. కొనుగోలుదారులు ఫిర్యాదులు చేసి, పక్కా ఆధారాలున్నా కూడా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతోంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం కేతావానిలంకలోని గాయత్రి–1,2 ఇసుక ర్యాంపుల్లో రెండున్నర యూనిట్ల ఇసుక రూ.4,200 నుంచి రూ.4,500ల మధ్య వసూలు చేశారని కాకినాడకు చెందిన ది క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, సంస్థ కోశాధికారి గాది బాబ్జి తదితరులు మంగళవారం రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం గాయత్రీ, కోటిలింగాలఘాట్ వద్ద ఉన్న ర్యాంపులను అర్బన్ తహసీల్దార్ రాజేశ్వరరావు సందర్శించారు కూడా. ఆదిలో ఆపకుండా అంతంలో హల్చల్... గత నెల రోజుల నుంచీ గాయత్రీ ర్యాంపుల్లో రెండు యూనిట్ల ఇసుక ధర రూ.2,250కి బదులుగా రూ.4,500 లెక్కన రెట్టింపు ధర వసూలు చేస్తున్నారని లారీ ఓనర్లు చేసిన ఫిర్యాదు మేరకు స్పష్టమైంది. గత నెల 15వ తేదీ నుంచీ నూతనంగా ఏర్పాటు చేసిన కోటిలింగాలఘాట్ ర్యాంపు పని చేస్తోంది. అంతకు ముందు కేవలం గాయత్రీ–1,2 ర్యాంపుల్లో మాత్రమే ఇసుక లభిస్తోంది. ఇన్ని రోజుల పాటు యథేచ్ఛగా ఇసుకను రేవులోనే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా విక్రయిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తోందన్న ప్రశ్నకు సమాధానం లేదు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో గనులు, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు బృందం గాయత్రీ ర్యాంపు నుంచి ఇసుకతో వస్తున్న 15 లారీలను నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా మూడు యూనిట్ల లోడు, అధికధరలకు కొనుగోలు చేశారన్న కారణంగా లారీ డ్రైవర్లను విచారణ చేశారు. 15 లారీల్లో 10 లారీలను కొద్దిసేపటి తర్వాత వదిలేసిన యంత్రాంగం మిగతా ఐదు లారీలను మాత్రం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించింది. ఒక లారీని కార్యాలయ ఆవరణలో పెట్టగా మరో నాలుగు లారీలను ఎదురుగా ఉన్న బాలికోన్నత పాఠశాల్లో ఉంచింది. ఉదయం 9 గంటలకు అదుపులోకి తీసుకున్న లారీ డ్రైవర్లు, ఆ తర్వాత వచ్చిన ఓనర్లను రాత్రి 8 గంటలకు వరకు అక్కడే కూర్చో పెట్టారు. చివరకు వారు తమ వద్ద గాయత్రీ–1,2 నిర్వాహకులు రూ.4,200 నుంచి రూ.4,500 వరకూ (రెండున్నర యూనిట్లు) నెల రోజులపాటు వసూలు చేశారని ఫిర్యాదు చేయగా వదిలిపెట్టారు. గాయత్రీ ర్యాంపుల్లో మూడు యూనిట్ల లారీలకు అనుమతి లేదు. అయినా నెల రోజుల నుంచీ ర్యాంపుల్లో ఇసుకను లోడింగ్ చేస్తూ రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం మిన్నకుండిపోవడం వెనుక మర్మమేమిటో తెలియాల్సి ఉంది. ప్రారంభంలో అక్రమాలు ఆపకుండా లారీలను ఆపడం వల్ల ఏం సాధించారో యంత్రంగానికే ఎరుక. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే కార్యాలయాల్లో కూర్చుని తాము ఇది చేస్తాం. అది చేస్తాం, అక్రమాలను ఆపుతామంటూ ఐఏఎస్ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఘటనలు ఉన్నతాధికారుల మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో విశ్వసనీయత తగ్గిపోతోంది. జై భీమ్ సొసైటీని నిలిపివేశాం గాయత్రీ ర్యాంపులో రెండున్నర యూనిట్లకు రూ.4,500 తీసుకున్నట్లు మా విచారణలోనూ తేలింది. ఇసుక విక్రయించిన జై భీమ్ సొసైటీని నిలిపివేసి విచారణ చేస్తున్నాం. నదీ పరిరక్షణ, ట్రాఫిక్ ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కుమారి టాకీస్, వాటర్ వర్క్స్ ర్యాంపులను డీఎస్ఎల్ సిఫార్సు మేరకు మూసివేశాం. అక్కడ పని చేస్తున్న వారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు కాబట్టి వారు ఎక్కడ నావలు ఉంటే ఉపాధి కోసం అక్కడకు వెళతారు. కోటి లింగాలఘాట్ ర్యాంపు నుంచి నగరంలోని అవసరాలకు మాత్రమే ఇసుక తరలిస్తున్నారు. ఇతరులకు ఇస్తే ఇతర జిల్లాల్లో విక్రయించే అవకాశం ఉంది. గోదావరిలో వరద తగ్గితే ర్యాంపులను తిరిగి ప్రారంభిస్తాం. గత ఏడాది ఇదే సమయంలో రెండు యూనిట్ల ధర రూ. 5 వేల నుంచి రూ.6 వేలు ఉంది. గత ఏడాది కన్నా ఇప్పుడే తక్కువ. – వి.విజయరామరాజు, ఇన్చార్జి సబ్‌కలెక్టర్, రాజమహేంద్రవరం. -
ఉద్యోగాల కోతే బాబు విజన్
‘ఇంటికో ఉద్యోగం’... ‘నిరుద్యోగులకు నెలకు 2వేల భృతి’... ‘జాబు కావాలంటే బాబు రావాలి’... మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువసామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం బాబుకే చెల్లింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో గతంలో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నినాదాలు ఇవి. యువతను ప్రలోభపెట్టడానికి చంద్రబాబు చేయని ప్రచారం లేదు. ఇవ్వని వాగ్దానం లేదు. అయితే ఫలితాలు వచ్చి నెల గడవక ముందే బాబుగారి అసలు స్వరూపం బట్టబయల య్యింది. కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకే ఆయన ఎసరు పెట్టారు. వివిధ సంస్థలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసే స్తున్నారు. ఉద్యోగాలు తీసేయడం, పనిచేసే సంస్థలను మూసేయడంలో బాబుగారు బహునేర్పరి. ఆయనగారి గత చరిత్రంతా ఈ తీసివేతలు... మూసివేతలే... గతంలో అధికారంలో ఉండగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చంద్రబాబు వాటిలోని వేలాదిమంది ఉద్యోగుల ఉపాధికి దెబ్బకొట్టారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో ఓ ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం ప్రారంభించారు. దశలవారీగా ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడం, ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం ఆ పథకం ఉద్దేశం. అందుకోసం జీవో నంబర్ 58ని కూడా ఆయన జారీ చేశారు. ఆయన విజన్ ఉద్యోగుల తొలగింపే. 2020 నాటికి లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మన బాబుగారు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది ‘ఇంటికో ఉద్యోగం’. రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లున్నాయి. ఇంటికో ఉద్యోగమంటే మాటలా.. అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా...? బాధ్యతగలిగిన నాయకులు ఏదైనా మాట్లాడుతున్నారంటే చిత్తశుద్ధి ఉండనక్కరలేదా? సాధ్యాసాధ్యాలను చూడనక్కరలేదా? బాబుగారు అన్నీ చూసుకునే ప్రజల కోసం ఆ హామీలిచ్చారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అయితే మరి ఇప్పుడు నెల గడచిపోయినా బాబుగారు తన హామీలపై నోరు ఎందుకు మెదపడం లేదు? ఏ హామీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు చెప్పడం లేదు? వ్యవసాయ రుణాల మాఫీపై ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్న చందానే మిగిలిన హామీలనూ అటకెక్కించేస్తారా? నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సందేహాలివి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ చంద్రబాబు మాటలు సమస్యను పక్కదోవ పట్టించేలానే ఉన్నాయి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కానక్కరలేదని, ప్రైవేటు ఉద్యోగాలు కూడానని ఆయన అంటున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపినా కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలు. భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఐటీ, సేవారంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు వద్ద సిద్ధంగా ఉందా? అందుకోసం ఆయన ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఉద్యోగాలపై స్పష్టత ఏది? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ‘ఇంటికో ఉద్యోగం’ హామీపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దానిపై స్పష్టత ఏదని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబురావాలంటూ ఎన్నికలకుముందు టీవీల్లో పదేపదే ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. అసలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా లేదా.. అందుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు... అని ప్రశ్నించారు. వీటికి అధికారపక్షం నుంచి అసలు సమాధానమే లేదు. అత్యంత కీలకమైన ఈ అంశంపై శాసన సభలో జరిగిన చర్చ ఎందుకనో మీడియాలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కొత్త ప్రభుత్వం తీరు చూసి నిట్టూరుస్తున్నారు. అసలు ఉద్యోగం వస్తుందా...? వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తారా..? ఇవి జవాబు దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్నలే. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను చూసి యువత ఎంతో కొంత ఆశపడబట్టే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. పదవినధిష్టించిన తర్వాత మరి ఆ యువతకు ఆయనిచ్చే భరోసా ఏమిటి? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిపై ఇప్పటికీ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? 3.5 కోట్ల మందికి ఉద్యోగాలెప్పుడు ఇస్తారు... ఈ లోగా ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు..? వంటి విషయాలపై చంద్రబాబుకు ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలను వెల్లడించే గవర్నర్ ప్రసంగంలోనూ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రణాళికా లేదు. నిరుద్యోగ సమస్యకు బాబు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదని దీన్ని బట్టి అర్థమౌతుంది. ఇవ్వడం అటుంచి.. ఉన్నవి హుష్‌కాకి.. వర్తమానానికి వస్తే... ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు... ఉన్న ఉద్యోగాలు పీకేసే పని బాబుగారు మొదలుపెట్టారు. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. పదేళ్ల నుంచి వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువ సామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం చంద్రబాబుకే చెల్లింది. వీరే కాదు గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బాబు ఉద్వాసన పలికారు. 15 వేల రూపాయలలోపు గౌరవవేతనంతో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాలన్నీ ఇప్పుడు వీధిన పడ్డాయి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 4 వేల మంది, జలయజ్ఞం భూసేకరణలో 7 వేల మంది ఉద్యోగులను త్వరలోనే ఇంటికి పంపించనున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని భావించామని, ఇలా తమ పొట్టకొడతారని ఊహించలేదని ఆ ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్క గృహనిర్మాణ సంస్థే కాదు.... అన్ని సంస్థలలోని తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొత్త ప్రభుత్వం తొలగిస్తోంది. బాబు రాకతో జాబు పోక అన్నట్లయిందని ఉద్యోగులు బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ పదవుల్లోని వారు రాజీనామాలు చేయడం మామూలే. కానీ పొట్టచేతబట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న చిరు వేతన జీవులను రాజకీయ కోణంలో చూడడం, వారి ఉపాధిని దెబ్బకొట్టడం సబబేనా? గత ప్రభుత్వంలో ఉద్యోగాలలో చేరిన వారిని ఇపుడు తొలగించేయడం ఏ తరహా రాజకీయం? తొలగింపులు, మూసివేతలే బాబుగారి ట్రాక్ రికార్డు ఉద్యోగులను తొలగించడం, ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడంలో బాబుగారిది అందెవేసిన చేయి. గతంలో ఆయన పాలనలో అమలైన ప్రపంచబ్యాంకు ఆర్థిక సంస్కరణలకు బలైంది ఉద్యోగులే. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురుపోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకునే చంద్రబాబు కొత్త ఉద్యోగాలిస్తానంటే నమ్మొ చ్చా...? ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచబ్యాంకుతో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఉద్యోగుల కుదింపునకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా చంద్రబాబు జారీ చేశారు. దాని ప్రకారం 1998లో 747, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారని గణాంకాలు చెబుతున్నాయి. అలా లక్షమంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకు ముందు చంద్రబాబు తన విజన్ 2020 ని ఆవిష్కరించారు. బాబు అనేక ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. పలు సంస్థలను మూసేశారు. రాష్ట్రంలో 127 ప్రభుత్వ, సహకార రంగ సంస్థలు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు 14 మూసేశారు. 11 సంస్థలను అమ్మేశారు. మరో పదిసంస్థలను అమ్మడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సంస్థలలోని 21 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఏపీఈఆర్పీ కింద తొలిదశలో నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులతో పాటు నిజాం షుగర్స్, ఆల్విన్ వాచ్ కంపెనీలను మూసేశారు. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ, మధునగర్ షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మెంబోజిపల్లి డిస్టిలరీ, చాగల్లు డిస్టిలరీ ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. రెండో దశలో ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌తో పాటు బెవరేజ్, టెక్స్టైల్స్, కోళ్లు -మాంసం అభివృద్ధి కార్పొరేషన్లు, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, వికలాంగుల సంస్థల్లోని ఉద్యోగులనూ తొలగించాలనుకున్నారు. 2004 ఎన్నికల్లో బాబు ఓటమితో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎకనమిక్ సర్వే చెబుతున్న నిజాలు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనమిక్స్ సర్వే 2012-2013 ప్రకారం... - 2000 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రంగాల్లో.. అంటే పబ్లిక్ , ప్రైవేట్ రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 20,71,642. 2004 మార్చి నాటికి మొత్తంగా ఉద్యోగులు లేదా ఉద్యోగాల సంఖ్య 20,11,645. అంటే కేవలం నాలుగేళ్లలోనే చంద్రబాబు హయాంలో తగ్గిన ఉద్యోగాలు దాదాపు 60,000. - వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చివరి సంవత్సరం 2009 మార్చి నాటికి ఈ సంఖ్య 20,82,800. అంటే వైఎస్ పాలనలో 71,155 ఉద్యోగాలు పెరిగాయి. - ప్రైవేటు రంగాన్ని తీసుకున్నా 2000 మార్చి నాటికి 5,68,362 ఉద్యోగాలు ఉం టే అది 2004 మార్చి నాటికి 5,67,666. అంటే బాబు పాలన చివరి నాలుగేళ్లు తీసుకున్నా ప్రైవేటు ఉద్యోగాలు పెరగకపోగా 696 తగ్గాయి. 2009 మార్చి నాటికి ప్రైవేటు ఉద్యోగాలు 7,24,916. అంటే 1,59,250 ఉద్యోగాలు పెరిగాయి. బాబు జమానాలో తగ్గిన ఉద్యోగాలు చంద్రబాబు అమ్మేసిన ప్రభుత్వరంగ, సహకార సంస్థలివే.. * ఆల్విన్ సనత్‌నగర్ భూములు * రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ * నిజాం షుగర్స్ (నాలుగు యూనిట్లు) * మధునగర్ షుగర్ మిల్లు * లచ్చయ్యపేట షుగర్ మిల్లు * మొంబోజిపల్లి డిస్టిలరీ * చాగల్లు డిస్టిలరీ * హనుమాన్ జంక్షన్ షుగర్స్ * నంద్యాల షుగర్స్ * పాలకొల్లు షుగర్స్ * గురజాల షుగర్స్ * ఇంకొల్లు నూలు మిల్లు * ఆదిలాబాద్ నూలు మిల్లు * నెల్లూరు నూలు మిల్లు * యడ్లపాడు నూలు మిల్లు మభ్యపెట్టడం వెన్నతోపెట్టిన విద్య ఏరుదాటేందుకు ఎన్నో చెబుతాం అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎట్టా అని వెనకటికెవడో అన్నాట్ట. బాబుగారిది అచ్చు ఇలాంటి పాలసీనే. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ ఆయన అంతగా గుర్తుపెట్టుకోరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సి వచ్చినా వాటికి ఎలాగోలా తూట్లు పొడిచేస్తారు. అదీ ఆయన ట్రాక్ రికార్డు. మద్యనిషేధం ఎత్తివేత, కిలో 2 రూపాయల బియ్యం ధర రూ.5.25కు పెంపు వంటివి ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కూడా రైతు రుణాల మాఫీ గురించి అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో ఓ కమిటీ వేసేశారు. నిజానికి రుణమాఫీ ఆచరణ సాధ్యమేనా అని ఎన్నికల సంఘం చంద్రబాబును వివరణ అడిగితేనే నిక్కినీలిగీ చివరికి ఏదో సమాధానమిచ్చారు. అందులో చెప్పిన విధంగానే రుణమాఫీని అమలుచేసేయొచ్చు కదా? మరలా అధ్య యనానికి ఓ కమిటీ ఎందుకు? అంటే అసలు ఏమీ అధ్యయనం చేయకుండానే వెనకా ముందూ చూసుకోకుండానే హామీ ఇచ్చేశారు? మేనిఫెస్టోలో పెడుతున్నామంటే దాని సాధ్యాసాధ్యాలను ముందుగా బేరీజు వేసుకోనక్కరలేదా? ఇప్పుడు కొత్తగా కమిటీ ఏమిటి? ఇది కాలయాపన కోసం కాదా? ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పాత రుణాలు కడితే గానీ కొత్తగా రుణాలిచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పైగా పాతరుణాలు కట్టాలని నోటీ సులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను గందరగోళంలో ముంచి కమిటీలతో కాలయాపన చేయడం సబబేనా? ఇంటికో ఉద్యోగం విషయంలోనూ బాబు ఇలాంటి గందరగోళాన్నే సృష్టించాలని చూస్తున్నారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యో గమే కానక్కరలేదు ప్రైవేటు ఉద్యోగమైనా ఉద్యోగమేనని ఆయన అంటున్నారు. అలాగే ఉద్యోగమంటే ఉద్యోగమే మేమే ఇవ్వనక్కరలేదు.. ఎవరిచ్చినామేమిచ్చినట్టేనంటూ రాష్ట్రంలో ఎక్కడ ఏ కొట్టులో ఎవరికి ఏ గుమస్తా ఉద్యోగమొచ్చినా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! - పోతుకూరు శ్రీనివాసరావు