breaking news
Malvika Raj Joshi
-
హీరోయిన్ మాళవిక రాజ్ బేబీషవర్.. పార్టీలో మెరిసిన నమ్రతా శిరోద్కర్..!
బాలీవుడ్ భామ మాళవిక రాజ్ బేబీషవర్..గోరింటాకుతో యాంకర్ లాస్య పోజులు..ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో మెరిసిన నమ్రతా శిరోద్కర్..బ్లాక్‌డ్రెస్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అతియా శెట్టి.. బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ స్టన్నింగ్ లుక్.. View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
ఐఐటీ నిరాకరిస్తే..ఏకంగా ఎంఐటీ ఆహ్వానించింది..!
కష్టపడి చదివి, నేర్చుకుని ప్రతిభాపాటవాలను సొంతం చేసుకుంటాం. ఇది సర్వసాధారణం. కానీ కొందరూ పుట్టుకతోనే మేధావులుగా ఉంటారు. చిన్న వయసులోనే తమలో ఉన్న అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంటారు. మనలా సంప్రదాయ విద్య సరిపడదు వారికి. ఎందుకంటే వయసుకి అనుగుణమైన విద్యకు మించిన జ్ఞానం వీరి సొంతం. అలాంటి కోవకు చెందిందే మాళవిక రాజ్ జోషి. ఆ ప్రతిభే ఆమె ఉన్నతికి ప్రతిబంధకమై.. ఐఐటీలో ప్రవేశానికి అనర్హురాలిగా చేసింది. విద్యాపరంగా పలు సవాళ్లు ఎదుర్కొనక తప్పలేదు. చివరికి ప్రతిష్టాత్మకమైన ఎంఐటీలో చోటు దక్కించుకుని శెభాష్ మాళవిక అని అనిపించుకుంది.ముంబైకి చెందిన మాళవిక రాజ్ జోషికి చిన్నప్పటి నుంచి అపారమైన ప్రతిభ ఉంది. చిన్న వయసులోనే గణితం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో అపారమైన నైపుణ్యం ఉంది. ఆమె ఇంటెలిజెన్సీ పవర్‌ని గుర్తించి.. ఏడో తరగతి నుంచి సంప్రదాయ విద్యా విధానానికి స్వస్తి చెప్పించింది తల్లి సుప్రియ. అప్పటి వరకు ముంబైలోని దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్లో చదువుకునేది మాళవిక. ఆమె చదువుని సీరియస్ తీసుకుని ఇంటివద్దే ప్రిపేర్ అయ్యేలా శిక్షణ ఇచ్చారు తల్లి సుప్రియ. కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేశారామె. పాఠశాల విద్యను అభ్యసించకపోయినప్పటికీ మాళవిక గణితం, ప్రోగ్రామింగ్‌లో బాగా రాణించింది. దీంతో మాళవిక తల్లిదండ్రులు ఆమెను ఐఐటీకీ పంపాలనుకున్నారు. కానీ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరు కానందున ప్రతిష్టాత్మకమైన ఐఐటీ క్యాంపస్‌లు ఆమెను తిరస్కరించాయి. అయితే ఆమె ప్రతిభాపాటవాలు బీఎస్సీ డిగ్రీకి సరితూగేవి. దీంతో ఆమె చిన్న వయసులోనే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (CMI)లోని ఎమ్మెస్సీ స్థాయి కోర్సులో అడ్మిషన్ పొందగలిగింది. అలా ఆమె గ్లోబల్ ప్రోగ్రామింగ్ పోటీలలో కూడా పాల్గొనడం ప్రారంభించింది. ఈ పోటీల్లో రాణించి.. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చోటు దక్కించుకుంది. దీంతో మాళవిక కేవలం 17 ఏళ్లకే ఎంఐటీ సీటు పొందిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఒక చోట మన ప్రతిభను గుర్తింకపోయినా..వాటిని తలదన్నే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు గుర్తిస్తాయని చాటి చెప్పింది. టాలెంట్ ఉన్న వాడిని ఆపడం ఎవరితరం కాదంటే ఇదే కదూ..!(చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది) -
ఈ బంగారూ గొప్పేంటో తెలుసా?
చాలామంది మార్కులు, ర్యాంకులే గొప్ప అనుకుంటారు. అందుకోసం పిల్లల్ని నానారకాలుగా ఒత్తిడికి గురిచేస్తూ.. తమ అభిప్రాయాలను వారిపై రుద్దుతుంటారు. కానీ, ముంబైకి చెందిన సుప్రియా అందరిలాగా ఆలోచించలేదు. సంప్రదాయ చదువులే సర్వసమని భావించలేదు. నిజానికి నాలుగేళ్ల కిందట ఆమె ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్లో ఏడో తరగతిలో అద్భుతంగా చదువుతున్న తన కూతురు మాల్విక రాజ్ జోషీతో బడి మాన్పించింది. సంప్రదాయ చదువులకు స్వస్తిచెప్తి.. తనకు నచ్చిన సబ్జెక్ట్‌ను చదువుకొనేలా మాల్వికను ప్రోత్సహించింది. అదే 17 ఏళ్ల మాల్వికకు అద్భుతమైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. పదో తరగతి చదవకపోయినా.. ఇంటర్ సర్టిఫికెట్ లేకపోయినా ఆమెకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో సీటు లభించింది. మాల్వికలోని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రతిభను గుర్తించిన మిట్ పిలిచి మరీ సీటు ఇచ్చింది. మిట్ అందించే ఉపకార వేతనం (స్కాలర్షిప్)తో ఆమె ప్రస్తుతం బ్యాచ్‌లర్ సైన్స్ డిగ్రీని అభ్యసిస్తున్నది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు రతజ, ఒక కాంస్య పతకం సాధించడంతో ఆమెను ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చి వరించింది. ప్రొగ్రామింగ్ ఒలింపియాడ్‌గా పేరొందిన ఈ (మాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సబ్జెక్ట్) పోటీల్లో పతకాలు సాధించిన వారికి తమ ఇన్స్టిట్యూట్లోనే తీసుకొనే సంప్రదాయాన్ని మిట్ కొనసాగిస్తున్నది. నిజానికి మాల్విక ఇంటర్ పాస్ కాకపోవడంతో దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీటు లభించలేదు. కేవలం చెన్నై మాథ్మేటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ)లో ఆమెకు సీటు దొరికింది. డిగ్రీ విద్యార్థులకు సమానంగా ఆమెకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉండటంతో ఆమె ఎమ్మెస్సీలో చేరింది. మాల్వికకు ప్రతిష్టాత్మక మిట్లో సీటు రావడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 'మాది మధ్య తరగతి ఫ్యామిలీ. నిజానికి స్కూల్లో మాల్విక బాగా చదువుతున్నప్పుడే.. పిల్లలు సంతోషంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయ చదువుల కన్నా ఆనందమే అత్యంత ముఖ్యమని భావించాను' అని సుప్రియా చెబుతారు. ఆమెకు మాల్వికతోపాటు రాధ అనే కూతురు ఉంది. 'క్యాన్సర్ రోగుల సంక్షరణ చూసే ఓ స్వచ్ఛంద సంస్థలో నేను పనిచేస్తాను. ఎనిమిది, తొమ్మిది తరగతి చదివే పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడి అవస్థలు పడటం నన్ను కలిచివేసింది. అందుకే చదువుల కన్నా నా బిడ్డలు ఆనందంగా ఉండటం ముఖ్యమనుకున్నా' అని ఆమె తెలిపారు. ఇంజినీరు అయిన భర్తను కూడా ఇందుకు ఒప్పించారు. ప్రస్తుతం బోస్టన్‌లో ఉండి చదువుకుంటున్న మాల్విక మాట్లాడుతూ 'నాలుగేళ్ల కిందట చదువు మానేసినప్పుడు నేను చాలా సబ్జెక్టులను అన్వేషించారు. అందులో ఒకటైన ప్రోగామింగ్ నాకు ఆసక్తి కలిగించింది. దాంతో మిగతా సబ్జెక్టుల కన్నా ప్రోగ్రామింగ్‌పై ఎక్కువ దృష్టి సారించా. దానిపై ఇష్టం ఏర్పడింది' అని తెలిపింది. ఆ ఇష్టం వల్లే సబ్జెక్టుపై పట్టు సాధించి.. ఇప్పుడు మిట్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్టు తాను సంతోషం వ్యక్తం చేసింది.