breaking news
Licence Raj
-
రాష్ట్రాల్లో అధికారుల తీరు మారటంలేదు..
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని అధికారుల ఇంకా ఆనాటి నియంత్రణల జమానా (లైసెన్స్ రాజ్)లో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆక్షేపించారు. దీనివల్ల కేంద్రం ఎన్ని సంస్కరణలను ప్రవేశపెడుతున్నా తయారీ రంగ వృద్ధి పెద్దగా మెరుగుపడటం లేదని ఆయన చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు కేంద్రం గత తొమ్మిదేళ్లలో 1,000కి పైగా పాత చట్టాలను తొలగించిందని పేర్కొన్నారు. తయారీ రంగంలో దీటుగా పోటీపడేందుకు బాటలు వేస్తోందని, కానీ దురదృష్టవశాత్తూ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని చెప్పారు. ‘తయారీదారులు, ఎంట్రప్రెన్యూర్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వాల్లో బ్యూరోక్రసీ, పాలనా యంత్రాంగం మారలేదు. ప్రతి దానికీ బోలెడంత జాప్యం ఉంటోంది. రాష్ట్రాల్లో చాలా మంది సమయానికి విలువనివ్వడం లేదు. పాలనా యంత్రాంగం ధోరణి ఆనాటి లైసెన్స్ రాజ్ తరహాలో ఉంటోంది. ప్రభుత్వోద్యోగి పని అంటే నియంత్రించడమే తప్ప వెసులుబాటు కల్పించడం కాదనే విధంగా ఉంటోంది‘ అని భార్గవ చెప్పారు. ఇటు వ్యాపారవేత్తల్లో కూడా అప్పటి ఆలోచనా ధోరణులు అలాగే ఉండిపోవడం సైతం తప్పు విధానాలకు దారి తీస్తోందని తెలిపారు. -
లైసెన్స్ రాజ్ లేదు...ఇన్స్పెక్టర్ రాజ్ ఉంది
భువనేశ్వర్ : స్టార్టప్ లకు మెరుగైన వ్యాపార అవకాశాలు పెంపొందించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశంలో లైసెన్స్ రాజ్ అవతరించినప్పటికీ, ఇన్స్పెక్టర్ రాజ్ మరికొంతకాలం కొనసాగుతోందని తెలిపారు. రెగ్యులేషన్లు పరిశ్రమలకు అవకాశాలను పెంపొందించే విధంగా ఉండాలని, నిరుత్సాహపరిచే లాగా కాదని పేర్కొన్నారు. పరిశ్రమలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ లో దుర్వినియోగాలను నియంత్రించడానికి అథారిటీలు కొన్ని తనిఖీలను మాత్రమే కలిగి ఉండాలని ఆయన సూచించారు. చిన్న,మధ్యతరగతి పరిశ్రమలకు నిబంధనలను ఎలా సులభతరం చేయాలో తెలుపుతూ యూకే, ఇటలీ దేశాలను ఉదాహరణగా తీసుకుని వివరించారు. యునిటైడ్ కింగ్ డమ్ లో నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. ఇటలీలో అవే నిబంధనలు చాలా కఠినతరం. ఇటలీతో పోల్చుకుంటే యూకేలో స్టార్టప్ లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 4వ ఒడిశా నాలెడ్జ్ హబ్ లో బ్యాంకర్లు, మంత్రులు, అధికార ప్రతినిధులను, పెట్టుబడిదారులను ఉద్దేశించి రాజన్ ప్రసంగించారు. భారత ఆర్థికవ్యవస్థ రికవరీ అవుతుందని, కానీ కొన్ని పరిశ్రమలు ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ పరిశ్రమలను అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రభుత్వాలు, ఏజెన్సీలు దృష్టిసారించాలని తెలిపారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, స్టార్టప్ లపై ఎక్కువగా దృష్టిసారించి, వారికి సులభతరంగా నిధుల చేకూర్చడంలో ఫైనాన్సియల్ ఇన్ స్టిట్యూషన్లు తోడ్పడ్డాలని చెప్పారు. అలాగే ఈ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల, ఆ పరిశ్రమల్లో పోటీతత్వానికి ప్రోత్సాహం పెరిగి, వృద్ధిని నమోదుచేస్తాయన్నారు. మంచి రుతుపవనాలు ఆర్థికవ్యవస్థను వృద్ధి బాటలో నడిపించడానికి సహకరిస్తాయని పేర్కొన్నారు.