breaking news
To Let
-
ఎక్కడ చూసినా ‘టు లెట్’ బోర్డులే !
చౌటుప్పల్ : జాతీయ రహదారిపై దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో చౌటుప్పల్ ఒకటి. పలు మండలాలకు కూడలిగా ఉండడంతో పాటు ఎన్నో పరిశ్రమలకు కేంద్రంగా గుర్తింపు పొందింది. అటు నల్లగొండ, ఇటు హైదరాబాద్‌కు మధ్య ఉండడంతో శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో గతంలో కుదించి ఉన్న పట్టణ కేంద్రం ఇప్పుడు నలుమూలలుగా విస్తరించింది. ఎటు చూసినా సుమారుగా రెండు కిలోమీటర్ల మేరకు ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అయితే, పిల్లల చదువులు, ఉపాధి నిమిత్తం చాలా మంది హైదరా బాద్ బాట పట్టడంతో ఉరంతా ఖాళీ ఇళ్లే దర్శనమిస్తున్నాయి, ఎటు చూసినా టులెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యాపార, పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు చౌటుప్పల్ మండలం వివిధ రకాల వ్యాపార, పారిశ్రామిక కేంద్రంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. 1990 సంవత్సరం నుంచే ఇక్కడ పరిశ్రమల శకం ప్రారంభమైంది. మండలంలోని చౌటుప్పల్, లింగోజిగూడెం, మల్కాపురం, పంతంగి, మందోళ్లగూడెం, ఎస్.లింగోటం, జైకేసా రం, అంకిరెడ్డిగూడెం, తూప్రాన్‌పేట, ఆరెగూడెం, కొయ్యలగూడెం, ధర్మోజిగూడెం, దేవలమ్మనాగారం, తంగడపల్లి, ఖైతాపురం, ఎల్లగిరి గ్రామాల్లో 100వరకు పరిశ్రమలు ఉన్నాయి. (హైదరాబాద్‌లో పెరిగిన ప్రాపర్టీల ధరలు) నెలల తరబడి ఖాళీగా.. చౌటుప్పల్ గతంలో సింగిల్‌గానే ఉండేది. మరో నాలుగు గ్రా మాలైన లింగోజిగూడెం, తాళ్లసింగారం, తంగడపల్లి, లక్కారంతో కలిసి 2018లో మున్సిపాలిటీగా అవతరించింది. ఇందులో తంగడపల్లి, లక్కారం గ్రామాల్లో సగభాగం గత పదేళ్లుగా కలిసిపోయే ఉన్నాయి. మిగిలిన లింగోజిగూడెం, తాళ్లసింగారం దూరంగా ఉంటాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 8,030 నిర్మాణాలు(ఇండ్లు, దుకాణ సముదాయాలు) ఉన్నాయి. వీటిలో పట్టణ కేంద్రంతోపాటు కలిసిన గ్రా మాల్లోని ఇండ్లు కలిపి సుమారుగా 7వేల వరకు ఉంటాయి. అందులో దాదాపుగా 5వేల ఇండ్లు అద్దెలకు ఇస్తున్నవే ఉంటాయని అంచనా. ఇప్పడు ఈ ఇండ్లు చాలా మేరకు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా టులెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. నెలల తరబడి వేచి చూసినా కొత్త వారు రావడంలేదు. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) నివాసానికి అనుగుణంగా.. మండలంతో పోలిస్తే పట్టణ కేంద్రం అన్ని రకా లుగా అందరికీ అనువుగా ఉంది. ఇక్కడికి మండలంతో పాటు నారాయణపురం, చండూరు, మునుగోడు, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, పోచంపల్లి మండలాలకు చెందిన వివిధ వర్గాల ప్రజలు జీవనోపాధి పొందుతూ స్థానికంగానే నివాసం ఉంటున్నారు. వీరితోపాటు పరిశ్రమల్లో పనిచేసే వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఇక్కడే నివసిస్తున్నారు. అద్దెకు వస్తున్న కుటుంబాల అభిరుచుల మేరకు చాలా మంది ఇంటి యజమానులు తమ ఇళ్లను ఒక అంతస్తు నుంచి ఐదు అంతస్తుల్లో అన్ని హంగులతో నిర్మించారు. ఏరియా డిమాండ్ మేరకు ఒక్కో గదికి 1000–2000వరకు, సింగిల్ బెడ్రూంకు 5వేల నుంచి 8వేల వరకు అద్దెలు ఉన్నాయి. రూ.లక్షలు వెచ్చించి చేపట్టిన నిర్మాణాల ద్వారా వచ్చే అద్దెలపైనే అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. హైదరాబాద్‌కు మకాం మారుస్తున్న అత్యధిక కుటుంబాలు గతంతో పోలిస్తే పట్టణంలో ఖాళీ ఇండ్ల సమస్య అత్యధికంగా ఉంది. రెండు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ చూడని విధంగా నెలల తరబడి ఖాళీ ఇండ్లు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. ఆర్థికంగా ఓ స్థాయి కలిగిన కుటుంబాలు ఇక్కడి నుంచి మకాంను హైదరాబాద్‌కు మారుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం పిల్లల విద్యాభ్యాసమేనని చెప్పవచ్చు. పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా చాలా వరకు ఈ ఏడాది ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. (మహీంద్రా థార్ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్? వైరల్ వీడియో) పిల్లల చదువుల కోసమే .. మాది ఇదే ఊరు. ఇక్కడే ఇళ్లు, వ్యవసాయ పొలాలు ఉన్నాయి. స్థానికంగా ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నా. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా. రోజు ఇక్కడికి వచ్చి వెళ్తుంటా. స్థానికంగా అన్ని రకాలుగా ఆనందంగానే ఉన్నప్పటికీ సరైన విద్యాసంస్థలు అందుబాటులో లేవు. పిల్లల చదువుల కోసం ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది - సందగళ్ల నాగరాజు, చౌటుప్పల్ నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది మాకు స్థానికంగా రెండు అంతస్తుల్లో ఇల్లు ఉంది. కొన్నేళ్లుగా కొంతభాగం అద్దెకు ఇస్తుంటాము. అద్దెకు ఉన్న వ్యక్తులు ఇల్లు ఖాళీ చేసి వెళ్తే తిరిగి అద్దెకు రావాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో తమకు వివిధ రకాల చెల్లింపులకు ఇబ్బందిగా మారుతోంది. –అవిరేను రమేష్, ఇంటి యజమాని, చౌటుప్పల్ -
అజ్ఞాతి
ఆ టులెట్ బోర్డు చూడగానే సడన్‌గా తన స్కూటర్ ఆపాడు భాస్కరం. ‘మేడ మీది గది’ అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు. ఆ ఆవరణలోకి ప్రవేశించగానే ఆనందపడ్డాడు. కారణం, అది నగరానికి దూరంగా ఉన్న కాలనీ, శబ్ద, వాతావరణ కాలుష్యాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. సమీపంగా సముద్రం. ఆ ఇంటి గేటు దగ్గర నిలబడి ‘‘ఏమండీ!?’’ అని పిలిచాడు. అయిదు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఒక పెద్దావిడ. అరవయ్యేళ్లు దాటి ఉంటాయి అనుకున్నాడు. కళ్ళజోడు సర్దుకొని, ‘‘ఏం కావాలి బాబూ?’’ అంది. ‘‘పై పోర్షన్, అద్దెకు’’ అన్నాడు. ‘‘సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, బ్యాచులర్లకు మాత్రమే సరిపోతుంది’’ అంది. అతడిని పరిశీలనగా చూసి, ‘జుట్టు పల్చబడింది. బహుశా యాభై ఏళ్లు ఉంటాయేమో’’ అనుకుంది ఆవిడ. ‘‘నేను ఒక్కడినే, నాకు సరిపోతుంది’’ అన్నాడు.‘‘సరే, రండి’’ అంటూ మెట్లెక్కి పైకి నడిచింది. ఆవిడ ముందు నడుస్తుంటే ఆమెను అనుసరించాడు. ఆ పోర్షన్పైన టెర్రస్ విశాలంగా ఉంది. పైకి వెళ్లిన భాస్కరానికి ఒక్కసారిగా ఒక శీతలపవనం తాకినట్టయింది. ‘‘అద్దె ఎక్కువయినా ఫరవాలేదు, ఈ ఇల్లు వదులుకోకూడదు’’ అనుకున్నాడు. ఆవిడ తాళం తీసి, లోపలికి రమ్మంది. ఒక విశాలమైన బెడ్రూమ్, దానికి ఆనుకునే కిచెన్. టెర్రస్ మీద వాష్‌రూమ్. అంతే! ఇల్లంతా పరిశీలనగా చూసి ‘‘నేను రేపు వచ్చి చేరుతాను. ప్రసుత్తం మా బ్యాంక్‌వారి అతిథిగృహంలో ఉంటున్నాను. ఈ ఊరొచ్చి పదిరోజులయింది. బదిలీ మీద వచ్చాను. అద్దె, అడ్వాన్స్ ఎంతో చెప్పండి’’ అన్నాడు. ఆమె చెప్పింది. వెంటనే జేబులోంచి డబ్బులు తీసి లెక్కపెట్టి ఆమెకు అందించాడు. తరువాతి రోజు ఉదయం ఒక మినీవేన్లో సామాను తెచ్చాడు భాస్కరం. ఒక పరుçపు, రెండు కుర్చీలు, ఒక గ్యాస్‌స్టవ్, కొన్ని వంటపాత్రలు, ఒక ట్రంకుపెట్టె, నాలుగు అట్టపెట్టెల నిండా పుస్తకాలు. వాటిని సర్ది, వంట చేసుకుని తినేసరికి అలిసిపోయాడు. నిద్ర పట్టేసింది. లేచేటప్పటికీ సాయంత్రం అయింది. అప్పుడే, డోర్‌బెల్ మోగింది. తలుపు తీసేసరికి ఎదురుగా ఇంటి ఓనరు కాఫీ కప్పుతో–‘‘అమ్మా... ఎందుకీ శ్రమ నేను కాచుకుంటాను, నాకు అలవాటే’’ అన్నాడు.‘‘అయ్యో... భోజనం పంపుదామనుకున్నాను. వంటమనిషి సెలవు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉదయమే ఉద్యోగాలకు వెళ్లిపోతారు. నేను, మనవరాలు ఇద్దరమే. తనూ పదిగంటలకు కాలేజీకి వెళ్లిపోతుంది’’ అలా అంటూ, అల్మారాలో అతను చక్కగా సర్దిన నవలలు, వీక్లీల వంక చూసి,‘‘ఓహో.. మీ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, మా ఇంట్లో తెలుగు కథలు, నవలలు చదివేది నేనొక్కదాన్నే. కనీసం పేపర్ కూడా తెప్పించరు, మా మనవరాలికి అలవాటు చేశాను. తెలుగు మరిచిపోతే ఎలాబాబూ?’’ అంటూ, టీపాయ్ మీద ఉంచి ఫొటో చూసి మాట్లాడటం ఆపింది.‘ఒక ఫ్యామిలీ ఫొటో, ఇతగాడు, భార్య, ఇద్దరబ్బాయిలు’వెంటనే అంది. ‘‘మీ వాళ్లంతా ఎక్కడ?’’ అని.‘‘మా ఆవిడకు హైదరాబాద్‌లో ఉద్యోగం. పిల్లలిద్దరూ ఒకడు బెంగళూరు, ఒకడు ఢిల్లీ, నలుగురం నాలుగు చోట్ల’’ అన్నాడు.‘‘ఓహో తప్పదు కదా...’’ అంటూ ఆల్మరాలోని పుస్తకాలను తిరగేస్తోంది. పావుగంటసేపు పరిశీలించి–‘‘భలే ఉదయ్‌గారి నవలలు ఉన్నాయి. అలాగే ఆయన కథలున్న వీక్లీలు, మీరు ఉదయ్‌గారి అభిమానా?!’’ అంది.‘ఔను’ అన్నట్లు తల ఊపాడు.‘‘మావారు ఉన్నప్పుడు తెచ్చేవారు. ఇప్పుడు తెచ్చేవాళ్ళెవరు? మనవరాలు అన్నీ నెట్లో చదువుతుంది. నాకు చాతకాదు, అయినా చక్కగా పుస్తకం చదవడమే ఇష్టం నాకు, ప్రయాణాలప్పుడు కొనుక్కొని చదువుతాను. మా ఇంట్లో ఒక్క కాగితం ముక్క కనిపించదు’’ అంది నిట్టూర్పు విడుస్తూ.‘‘ఫరవాలేదమ్మా ఈ పుస్తకాలు తీసుకువెళ్ళి చదవండి.’’ ఆ మాటలకు ఆనందపడి కొన్ని నవలలు, వీక్లీలు తీసుకుని ‘‘చాలా సంతోషం, ఉదయ్‌గారి నవలలు, కథలు అంటే మా ‘రోజా’ సంతోషంతో గంతులేస్తుంది. అదే మనవరాలు, నా పేరే పెట్టారు. నాపేరు సరోజ, మనవరాలు ఊళ్లో లేదు, ఎడ్యుకేషనల్ టూర్, రెండు రోజుల్లో వస్తుంది’’ అంటూ అక్కడి నుంచి బయటకు కదలింది. రెండురోజుల తర్వాత సరోజమ్మగారి మనవరాలు రోజా వచ్చింది, ఆ అమ్మాయి నాన్నమ్మకు ఫొటోకాపీ అనుకున్నాడు భాస్కరం. అతన్ని చూసి రెండు చేతులు జోడించి, కాళ్లకు నమస్కారం పెట్టింది.‘‘గాడ్‌బ్లెస్ యూ తల్లీ’’ అని దీవించాడు.‘‘అంకుల్ నానమ్మ చెప్పింది. మీరు ఉదయ్‌గారి కథలు, నవలలు బాగా చదువుతారట, మాకూ అంతే, నానమ్మే ఆయనను నాకు పరిచయం చేసింది. మీ దగ్గర నుంచి తెచ్చినవి చదువుతున్నాను. ఆయన రాసిన కథలలో ‘పాపం, మంచివాడు’ చాలా ఇష్టం’’ అంది.‘‘ఎందుకు ఇష్టం?’’ అనడిగాడు భాస్కరం.‘‘అందరితో మంచివాడనిపించుకుందామని టెన్షన్ పడుతూ, ఆఖరికి అదో వ్యసనమై రోగాల బారిన పడతాడు, ఆఖరికి ఐసీయూలో చేరతాడు. ‘పాపం మంచివాడు’ అని ఎవరో అనగానే హాయిగా ప్రాణం విడుస్తాడు. ఎందుకో ఆ కథ చదివి నాకు ఏడుపొచ్చింది’’ అంది.‘‘ఔను, ఆ కథ నాకూ ఇష్టమే!’’ అన్నాడు.‘‘అలాగే ‘అమ్మ ఓటు’ కథ చాలా ఇష్టం. ఇద్దరు కొడుకులు పంచాయతీ ఎలక్షన్లలో నిలబడితే, వారి తల్లి ఆ ఇద్దరికీ సమానంగా ప్రేమ పంచాలి కనుక ఆ ఇద్దరి గుర్తుల మీద ఓటు వేస్తుంది. ఆ ఓటు చెల్లకపోతేనేం, తల్లి ప్రేమను వెలకట్టింది’’ అంది.‘‘ఔను, మంచికథ’’ అన్నాడు భాస్కరం. ఆమె అల్మరాలో వెదికి, మరికొన్ని పుస్తకాలు పట్టుకెళ్లింది. భాస్కరం ఆ ఇంటికొచ్చి నెలరోజులయింది. ఇంటి అద్దె ఇవ్వడానికి వెళ్లాడు. నానమ్మ, మనవరాలు ఇద్దరూ సాదరంగా ఆహ్వానించారు. మనవరాలు కాఫీకప్పుతో వచ్చింది.‘‘చాలా సంతోషం నాయనా, మీ వల్ల ఉదయ్‌గారి సాహిత్యం చదివేశాము. మీ దగ్గరున్నవి అన్నీ అయిపోయాయి చదవటం’’ అంది పెద్దావిడ.‘‘అన్నీ చదివేశారా?! అంత తొందరగా’’ అన్నాడు భాస్కరం ఆశ్చర్యంగా.‘‘ఇంకాలేవా...మీ దగ్గర?’’ అంది మనవరాలు.‘‘లేవు...ఆయన మళ్లీ కొత్తగా రాయాలి, వాటిని పత్రికలు వేయాలి’’ అన్నాడు నవ్వుతూ.‘‘ఈమధ్య ఆయన ఏమీ రాయడం లేదు, దాదాపు రెండేళ్లయింది. కొత్తగా ఏమీ రాయలేదు’’ అంది రోజా.‘‘ఔను...నాకు తెలుసు’’ అంది సరోజమ్మ.‘‘ఏమో వారినే అడగాలి, ఎందుకు రాయడం లేదో!’’‘‘మాకు తెలీదుగా, అయినా ఉదయ్గారిని ఎవరూ చూసిన వాళ్లు లేరు మాకు తెలిసి’’ అంది పెద్దావిడ భాస్కరం మాటలకు. ‘‘ఔను... కనీసం ఆయన ఫొటో కూడా చూడలేదు’’ అంది మనవరాలు.‘‘నిజమే, ఆయన ఫొటోలు పత్రికలో రావు’’ అన్నాడు భాస్కరం.‘‘మీరు ఉండేది హైదరాబాద్‌లోనే కదా, ఇంతకుముందు మీరు చూశారా? ఆయనను’’ అంది మనవరాలు.‘‘అవును ఆయన ప్రగాఢ అభిమాని, చాలా కష్టపడితే ఒకసారి దొరికారు...’’ అన్నాడు.‘‘మైగాడ్’’ అంది మనవరాలు.భాస్కరం ఇద్దరి వంకా చూశాడు. ఆ ఇద్దరి కళ్లు ప్రకాశవంతంగా మారాయి.అతడి వంక ఆరాధనాపూర్వకంగా చూసి ‘‘ఆయన ఎలా ఉంటారు?’’ అన్నారు ఇద్దరూ ఒకేసారి.ఒక్కక్షణం ఆలోచించి, ‘‘పొడుగ్గా, దానికి తగ్గ లావు, నెత్తి మీద జుట్టు పలచబడింది’’ అన్నాడు.‘‘అయితే మీలాగే ఉంటారు’’ అంది సరోజమ్మ. ‘‘అవునా...ఏమో’’ అన్నాడు భాస్కరం చిన్నగా నవ్వి.‘‘మీకు పరిచయం ఉంది కదా, ఆయనను కథలు మళ్లీ రాయమని చెప్పండి. ఈ ఊళ్లో ఒక నానమ్మ, మనవరాలు చకోరపక్షుల్లా ఆయన కథల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని చెప్పండి’’ అంది మనవరాలు సీరియస్‌గా. ‘‘మనం ఏం చెయ్యగలం, ఆయన మీద ఒత్తిడి తేలేము కదా, సృజన అనేది అసంకల్పితంగా రావాలి. రాయలేకుండా ఉండలేనప్పుడు రాస్తారు ఉదయ్లాంటి రచయితలు కొందరు. ఆయన ఇంటర్వ్యూలునువ్వు చదవలేదా తల్లీ!’’ అన్నాడు భాస్కరం.‘‘ఆయనే కాదు, ఈమధ్య చాలామంది సీనియర్ రచయితలు అస్త్రసన్యాసం చేశారు. ఇలా రాయని కవులు, రచయితల గురించి సి.నారాయణరెడ్డిగారు ఒక కవిత రాశారు వినిపించనా?’’ అంది ఆ అమ్మాయి.‘‘సరే వినిపించండి’’ అన్నాడు భాస్కరం చిన్నగా నవ్వి. నానమ్మ మురిపెంగా మనవరాలి వంక చూసి, ‘‘చెప్పు’’ అంది. రోజా సెల్ఫోన్లోంచి ఆ కవిత చదవడం మొదలుపెట్టింది.‘ఇంకా ఎందుకు రాస్తున్నావ్?/ రాసింది చాలదా!/ ఈ ప్రశ్నలు విని/దూకే జలపాతం గలగలా నవ్వేసింది/ అకుంఠిత ధారారూపంలోనే కదా/ఆ కవీ, నేనూ జీవిస్తున్నది/ ఆగిపోతే మాకు అస్తిత్వమెక్కడిది/అందాక ఎందుకు?/ ఆడే శ్వాస ఎప్పుడైనా/ విశ్రాంతి కోరుకుంటుందా?/నిద్రలోనైనా కునుకు తీయని అవిశ్రాంత గతి దానిది/ శ్వాసకు విరమణ అంటే మరేమీకాదు మరణమే!/ నిరంతర సృజనశీలి అయిన కవీ అంతే/ నేను అంతే!’‘‘బావుంది కవిత, మీ కోసమైనా ఆయన తిరిగి రాస్తారేమో!’’ అన్నాడు భాస్కరం. ‘‘ఔను రాయాలి, రాయమని గట్టిగా చెప్పండి’’ అంది రోజా. ఆ మాటలకు నవ్వుతూ వారి ఇంట్లోంచి బయటకు నడిచాడు భాస్కరం మూడు నెలల తరువాత ఒక సాయంత్రం పూట కాలేజీ నుంచి రాగానే ఉత్సాహంగా పైకి పరుగెత్తింది రోజా. ‘‘ఉదయ్‌గారి కథ వచ్చిందండోయ్’’ అంటూ ఆ పత్రిక చూపించి కథ పేరు ‘దాతృత్వం’ అంది.‘‘నువ్వు చదివిన తరువాత ఇవ్వమ్మా’’ అన్నాడు భాస్కరం.‘‘చూశారా...ఈ ప్రసిద్ధ వారపత్రిక జన్మదిన సంచికలో వేశారు. మిగతా రచయితల ఫొటోలున్నాయిగానీ ఉదయ్‌గారి ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది’’ అంది. ఆ సమయంలో భాస్కరం వంటగదిలో కాఫీ కలుపుతున్నాడు. రెండు కప్పుల్లో కాఫీ కలిపి, తను ఒక కప్పు తీసుకుని, ఇంకోటి ఆ అమ్మాయికిచ్చాడు. భాస్కరం ఒక్కసారి ఆ అమ్మాయి చుడీదార్, పైజామావంక చూసి–‘‘తల్లీ...ఈ డ్రస్ కోసం నువ్వు షాప్ గురించి, ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళావ్, అంతే...నీకు కావలసింది ఆ షాపు చిరునామా, అంతేగానీ, ఆ డ్రస్ తయారుచేసే మాన్యుఫాక్చరింగ్ కంపెనీకాదు, అలాగే ఉదయ్‌గారు రాసిన పత్రిక గురించి తెలుసుకుంటే చాలు, ఆయన వివరాలు అనవసరం కదా! అయినా మనం చేసే పనుల్లో మంచి కనబడాలి మనం కాదు, అలాగే రచయిత రచనలేపాఠకులకుకనబడాలి రచయిత కాదు’’ అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆలోచనలో పడింది.‘మరి రచయితలు, కవులు లైమ్‌లైట్‌లో ఎందుకు ఉండాలనుకుంటారు?! సన్మానాలు, శాలువాలు, ఇవన్నీ దేనికీ?!’’ అంది ఆ అమ్మాయి.‘‘ప్రతిభకు నమ్మకం కలిస్తే ఆ కళాకారుడు విజయం సాధిస్తాడు.తనగొప్పదనాన్ని అందరూ కీర్తించాలని ఆశపడనవసరం లేదు’’ అన్నాడు.‘‘పాపం.. అందరికీసన్మానాలు, పేపర్లలో ఫొటోలు.. ఉదయ్‌గారు అలా అజ్ఞాతంగా ఉండిపోవడం బాధగా ఉంది’’ అంది రోజా.‘‘ఎందుకు బాధ, మీ నాన్నమ్మ, నువ్వు మీలాంటి వారి కోసం రెండు సంవత్సరాల తర్వాత కథ రాశారు. అదే అసలైన పురస్కారం ఆయనకు’’ అన్నాడు.‘‘ఏమో! కన్విన్స్ కాలేకపోతున్నాను’’ ఆమె అలా అంటూ అక్కడి నించి కదిలింది. ఆరోజు శనివారం. బ్యాంకుకు సెలవు. భాస్కరం వంట చేసుకుంటున్నాడు.వాళ్లింట్లో చేసిన తినుబండారం పట్టుకొని పైకి వచ్చింది రోజా. ఆయనకు దాన్ని ఇస్తూ, ‘‘ఈరోజు నానమ్మ, నేను ఉపవాసం, అయినామీ కోసం వంట చేయించాము’’ అంది.‘‘నేను ఉపవాసమే, అయినా నేనూ వండుకుంటున్నాను’’ అన్నాడు చిన్నగా నవ్వి.‘‘అర్థమయింది. ఉదయ్‌గారి అభిమానులు అంతా అంతే కదా, ఆయన రాసిన ‘అర్ధనారీశ్వరం’ కథలో నాయకుడు ఉపవాసం రోజున తను తినేది, యాచకులకు దానం చేస్తాడు. మేమూ అదే పని, మీరూ అంతే కదా!’’ అంది.‘‘ఔను...’’ అన్నాడు భాస్కరం.ఆ మాటలకు క్షణం సేపు ఆగి, ‘‘ఈరోజు ఇంట్లో పెద్ద గొడవ, నాన్న ఏడ్చేశారు’’ అంది రోజా.‘‘దేనికి?’’ అన్నాడు భాస్కరం ఆశ్చర్యంగా ఆమె వంక చూసి.‘‘ఇంతకాలం వంట ఇంటికీ, పిల్లల పెంపకానికీ పరిమితమైపోయాను. నేను ఈ సమాజానికి చేసింది ఏమిటీ...’’ అంటూ మొదలుపెట్టింది నాన్నమ్మ’’ అంది ఆ అమ్మాయి.‘‘మై గాడ్ నిజమా...మీ నాన్నమ్మ ఇలా కూడా ఆలోచిస్తుందా?’’ అన్నాడు ఆశ్చర్యంగా.‘‘అవును...అందుకోసం ఆవిడ ఒక పని చేయడానికి పూనుకుంది, తన మరణానంతరం’’‘అంటే?!’’ ఒక్కసారి విస్మయంగా చూశాడు ఆమె వంక.తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం ఇచ్చేస్తుందట కారణం, ఉదయ్‌గారి కథ దాతృత్వం చదివింది’’ అంది ఆ అమ్మాయి.మాటలకు షాక్ తిన్నట్టుగా చూశాడు భాస్కరం ఆమె వంక. ‘‘ఔను. చనిపోయిన తరువాత ఎందుకూ పనికిరాని దేహాన్ని వైద్యకళాశాల విద్యార్థుల కోసం ఉపయోగించుకోవచ్చు కదా...అలా ఎంతమందో చూసి జ్ఞానవంతులవుతారు. అలా తన జీవితానికో అర్థం ఏర్పడుతుంది’’ అంటూ నానమ్మ గట్టిగా వాదించింది నాన్నతో.‘‘ఇంతకీ ఆయన ఒప్పుకున్నారా?’’‘ఏంచేస్తారు? ఆమె అంత పట్టుదలగా ఉంటే’’ అంది మనవరాలు రోజా.ఆ మాటలకు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు భాస్కరం. మెల్లగా నడుచుకుంటూ బాల్కనీ పిట్టగోడ దగ్గరకు వచ్చాడు. అతని కళ్లనించి మెల్లగా వస్తున్న కన్నీళ్లు. ‘‘రచయితల వలన, వారి రచనల ప్రభావం వలన పాఠకులు మారతారు, అయితే ఒక పాఠకురాలు, రచయితను మార్చింది’’అతను మెల్లగా తనలో తాను అనుకున్న మాటలు ఆమెకు వినపడ్డాయి. ఆమె ఏమీ అర్థం కాలేదు.‘‘ఏమయింది సార్?’’ అంది అతడిని పరిశీలనçగా చూసి.‘‘ఉదయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ దేహానికి పేరు ఒక గుర్తు మాత్రమే. నా పేరు అనే యోచన విడనాడాలి. నేను అనేది నీ దేహం నుండి విడనాడాలి. అదే పునరుత్థానం. అందుకే నా రచనలనే పాఠకులకు చూపుతాను నన్ను కాదు. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయిన తరువాతే, నా ఛాయాచిత్రం కనిపిస్తుంది అన్నాడాయన’’ భాస్కరం ఆకాశం వంక చూస్తూ చెప్పాడు.‘‘ఔను...నేను చదివాను ఆ ఇంటర్వ్యూ’’ అంది రోజా.‘‘ఇప్పుడు ఆయన దేహమూ కనబడదేమో!’’ అన్నాడు భాస్కరం మెల్లగా.‘‘అంటే?’’ ఆమె తెల్లబోతూ అతడివంక చూసింది.‘‘ఆయన రాసిన ‘దాతృత్వం’ కథలో నాయకుడు తన దేహాన్ని దానం చేసినట్టు తనూ చేస్తాడేమో!’’ అన్నాడు భాస్కరం‘‘మీకెలా తెలుసు?!’’ అంది ఆ అమ్మాయి అతడి వంకే రెప్ప వాల్చకుండా చూసి.‘‘ఆయన రచనల వలన ఒక పాఠకురాలు మారితే ఆయన మారడా?!’’ అంటూ గబగబా ఇంట్లోకి నడిచాడు భాస్కరం.ఆలోచిస్తూనే క్రిందకు నడిచింది రోజా. ఆమెలో ఎన్నో ప్రశ్నార్థకాలు. సాయంత్రం గడిచింది. రాత్రయింది. ఆకాశంలో మిణుకుమంటున్న నక్షత్రాలు అక్కడక్కడా! రోజాకు నిద్రపట్టడం లేదు. బయటవరండాలోతిరుగుతోంది. ఏవో ఆలోచనలు.ఉదయ్‌గారు రాసిన కథ పడిన వీక్లీ ఆమె చేతిలో, వెంటనే ఆయన నంబర్ చూసి ఫోన్ చేసింది. అవతల రింగు అవుతున్న శబ్దం, ఆమె సమీపంలోనే వినిపిస్తోంది. ఆ రింగ్‌టోన్ మేడ మీద నుంచి వినిపిస్తోంది. ఆమె వేగంగా పైకి వెళ్లింది గబగబా మెట్లు ఎక్కుతూ. భాస్కరం పడుకున్న బెడ్రూమ్ కిటికీ తెరిచే ఉంది. గుడ్డిగా వెలుగుతున్న బెడ్రూమ్ వెలుగులో కనిపించాడాయన నిద్రపోతూ–పక్కన ఆయన ఫోన్ మోగుతూనే ఉంది. ఆయన ఎత్తడం లేదు. గాఢనిద్రలో ఉన్నట్లు ఆమెకు అర్థమయింది. సందేహ నివృత్తి కోసం ఫోన్ కట్ చేసి, మళ్లీ చేసింది.ఫోన్ మోగుతూనే ఉంది. ఆమెలో ఆశ్చర్యం, ఆనందం... ఒక అద్భుతం చూసిన అనుభూతి.ఇంతలో ‘‘రోజా’’ అనే నానమ్మ కేక వినిపించింది.‘రచయితను మార్చిన పాఠకురాలా వస్తున్నాను’ అంటూ ఆమె మెట్లు దిగడం ప్రారంభించింది.ఆ సమయంలో ఆమెకు తను ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చాయి– ‘రచయిత కన్నీరు కార్చకుండా పాఠకుడి కళ్లల్లో నీరు తెప్పించలేడు. రచయిత ఆశ్చర్యానికి లోను కాకుండా పాఠకుడిని ఆశ్చర్యం కలిగించలేడు.’ - డా. ఎమ్.సుగుణరావు -
ఆస్కార్ దర్శకుడు మెచ్చిన టూలెట్
సినిమా: రెండు సార్లు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న హిరానీ దర్శకుడినే అబ్బురపరచిన తమిళ చిత్రం టూలెట్. అంతే కాదు 100 అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన చిత్రం టూలెట్. ఇప్పటికే జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడనుంది. ఇప్పుడు గనుక దర్శకుడు బాలుమహేంద్ర జీవించి ఉంటే చాలా సంతోషపడి ఉండేవారని టూలెట్ చిత్ర దర్శకుడు సెళియన్ అన్నారు. ఛాయాగ్రహకుడైన ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం టూలెట్. ఇంతగా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలను పొందుతున్న టూలెట్ చిత్రం దర్శకుడు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గత కొన్నేళ్ల క్రితం వికడన్ పత్రికలో అంతర్జాతీయ స్థాయి ఆసక్తిని రేకెత్తించిన చిత్రాల గురించి ఆర్టికల్ రాశానన్నారు. దీంతో తనకు అలాంటి చిత్రం చేయాలనిపించిందన్నారు. అలా మనం చూస్తున్న అద్దె ఇళ్ల నివాసుల ఇతి వృత్తాన్ని, వారి కష్టాలను సహజత్వంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం టూలెట్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని రెండు ఆస్కార్ అవార్డులను గెలుసుకున్న ఇరానీ దర్శకుడు ఆస్ఘార్ పర్హాది చూసి చిత్రం చూసిన భావనే లేదని, ఒక వ్యక్తి జీవితాన్ని పక్కనుంచి చూసినట్లు ఉందని ప్రశంసించారన్నారు. హిరానీ చిత్రాలను ఆహా, ఓహో అని పొగడ్తల్లో ముంచెత్తడం చూసిన దర్శకుడు బాలు మహేంద్ర అలా ఇరానీయులు మన చిత్రాలను ప్రశంసించే రోజులు ఎప్పుడు వస్తాయోనని అనేవారన్నారు. ఆయన ఇప్పుడు జీవించి ఉంటే చాలా సంతోషించేవారని అన్నారు. కాగా టూలెట్ చిత్రం ప్రస్తుతం గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మూడు కేటగిరీలో అవార్డుల కోసం పోటీ పడుతోందని చెప్పారు. గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న తొలి ఇండియన్ చిత్రం ఇదే అవుతుందన్నారు. అవార్డు వివరాలను ఈ నెల 28వ తేదీన వెల్లడిస్తారని చెప్పారు. కాగా వందకు పైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన టూలెట్ చిత్రాన్ని డిసెంబరులో లేదా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సెళియన్ తెలిపారు. -
టు లెట్
ఒక అడుగుకు అద్దె రూ. 80! హొసూరు- బాగలూరు రోడ్డులో మొదటి అంతస్తులో ఒక చదరపుటడుగుకు నెలకు రూ.80 నుంచి రూ.90 వరకు అద్దె నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, తాలూకాఫీసు రోడ్డు, గాంధీరోడ్డు, నేతాజీ రోడ్డు ప్రధాన ంగా వ్యాపార కూడళ్లు తదితర ప్రాంతాలలో కూడా టులెట్ బోర్డులు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. హొసూరు పట్టణంలో ఏఆర్ఆర్ఎస్, చెన్నైసిల్క్స్ వంటి పెద్దపెద్ద వస్త్ర వ్యాపార షోరూంలు ఏర్పాటు కావడంతో చిన్న, మధ్య తరగతి వస్త్ర దుకాణాల వ్యాపారం దెబ్బతింది. హొసూరు పట్టణంలో జోయ్లుక్కాస్, నాదేళ్ల, ఏవీఆర్, మలబార్, జువల్వన్, శ్రీకుమరన్, ఏవిఆర్ స్వర్ణమహాల్, తనిష్కా, జీఆర్టీ వంటి బంగారు నగల షోరూంలు వెలియడంతో చిన్నచిన్న దుకాణాలలో బంగారం వ్యాపారం తగ్గిపోయింది. కంపెనీల మూతతో ఇక్కట్లు పారిశ్రామిక ప్రాంతంలో అనేక చిన్న, పెద్ద కంపెనీలు మూతపడడంతో ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. వైద్యరంగంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు గుణం, అశోక, చంద్రశేఖర్ వంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడంతో చిన్నచిన్న క్లినిక్‌లు, మధ్య తరగతి ఆస్పత్రులలో రోగుల సంఖ్య తగ్గిపోయింది. హొసూరు మున్సిపాలిటీలో సరైన రోడ్లు, ప్రాథమిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో పట్టణంలో వ్యాపారం సన్నగిల్లింది. దీంతో అద్దె భవనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భవననిర్మాణానికి వెచ్చించిన డబ్బుకు బ్యాంకు రుణం చెల్లించలేకపోతున్నామని భవనాల యజమానులు లబోదిబోమంటున్నారు. ఆరు నెల లుగా హొసూరులో వాణిజ్యం పడిపోయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
సాక్షి ఎపెక్ట్: స్కూలుని ఖాళీ చేసిన ఆర్మీ