breaking news
justice delayed
-
‘న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 3 కోట్లకు పైగానే’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు పెరిగిపోతున్న అపరిష్కృత (పెండింగ్) కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, కోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండటం విచారకరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల (ఆంధ్రయూనివర్సిటీ) 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున కీలకమైన కేసుల్లో తీర్పు కూడా ఆలస్యమవుతోందన్నారు. తద్వారా సామాన్యులకు న్యాయప్రక్రియ చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అన్న మాటను ప్రస్తావిస్తూ.. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోందని చెప్పారు. ఈ విషయంపై న్యాయవాదులతోపాటు ఈ రంగంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. (ఆ రెండు యాప్‌లు ప్లే స్టోర్ నుంచి మాయం! ) దీంతోపాటు క్లిష్టమైన చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వినియోగంలో లేని 1600కు పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని గుర్తుచేశారు. చట్టాల రూపకల్పన కూడా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, స్పష్టంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఇటీవల ప్రయివేటు (వ్యక్తిగత) ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. దీని వల్ల న్యాయస్థానాల విలువైన సమయాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుందన్నారు. సమాజంలోని పేద, అణగారినవర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలని లా విద్యార్థులకు, యువ న్యాయవాదులకు ఉపరాష్ట్రపతి సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో న్యాయవాదుల పాత్ర కీలకమనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ టి.రజని, జస్టిస్ బట్టు దేవానంద్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి సహా పలువురు న్యాయకోవిదులు, న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు పాల్గొన్నారు. (‘ముంబై మానవత్వం కోల్పోయింది’) -
జస్టిన్ డిలేడ్ జస్టిస్ డినైడ్
-
ఆ మహిళకు హైకోర్టు క్షమాపణ
చెన్నై: న్యాయం కోసం 24 ఏళ్లు వేచిచూసిన మహిళను మద్రాస్ హైకోర్ట్ ఎలాంటి బేషజాలకు పోకుండా క్షమాపణలు వేడుకుంది. 1993లో మరణించిన తన కుమారుడి పరిహారం కోసం అప్పటినుంచి ఆమె అలుపెరుగని న్యాయపోరాటం సాగిస్తున్నది. 1993 మేలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆమె కుమారుడు లోకేశ్వరం లారీ నడుపుతుండగా ఎదురుగా వస్తున్నరాష్ర్ట రవాణా సంస్థ బస్‌ను ఢీ కొనడంతో మరణించాడు. దీనిపై ఆమె మోటార్ వాహన చట్టం కింద పరిహారం కోరకుండా వర్క్‌మెన్స్ పరిహార చట్టం కింద క్లెయిమ్ చేయడంతో సదరు క్లెయిమ్‌ను అధికారులు నిరాకరించారు. ఈ చట్టం కేవలం పారిశ్రామిక ప్రమాదాలకే వర్తిస్తుంది. దీంతో బాధితురాలు మోటార్ యాక్సిటెండ్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను రూ 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆశ్రయించారు. అయితే ఆమె తొలుత వర్క్‌మెన్స్ పరిహార చట్టం కింద దరఖాస్తు చేసినందున, తిరిగి మోటార్ యాక్ట్ కింద పరిహారం చెల్లించలేమని లారీకి బీమా వర్తింపచేసిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ చేతులెత్తేసింది. కంపెనీ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్ రూ 3.47 లక్షల పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అప్పీల్‌ను తోసిపుచ్చిన కోర్టు బాధిత మహిళకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది.