breaking news
hurricane rains
-
Hurricane Ida: అమెరికా వరదల్లో.. మనోళ్లు ఇద్దరు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇడా తుపాను ప్రభావంతో సంభవించిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నట్లు తెలిసింది. వీరిని మాలతి కంచె(46) అనే సాఫ్ట్వేర్ డిజైనర్, ధనుష్ రెడ్డి(31)గా అధికారులు గుర్తించారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రేరిటాన్‌కు చెందిన మాలతి కంచె(46) తన కుమారుడిని రట్జెర్స్ యూనివర్సిటీ కాలేజీలో దించి, కుమార్తె(15)తో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. బ్రిడ్జివాటర్ ప్రాంతంలో రూట్ –22 రోడ్డుపైకి అకస్మాత్తుగా చేరుకున్న నడుముల్లోతు వరద నీటిలో వారు చిక్కుకు పోయారు. కారులో నుంచి బయటపడిన తల్లి, కూతురు ఒక చెట్టును పట్టుకున్నారు. ఆ చెట్టు కూడా కూలిపోగా మాలతి వరద ఉధృతికి కొట్టుకు పోయారు. ఈదడం తెలిసిన ఆమె కూతురు సురక్షితంగా బయటపడింది. మాలతి గల్లంతైనట్లు సమాచారం అందుకున్న అధికారులు అన్వేషణ ప్రారంభిం చారు. ఆమె మృత దేహాన్ని అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని బౌండ్‌బ్రూక్ వద్ద శుక్రవారం కనుగొన్నారు. మాలతి స్వస్థలం హైదరాబాద్ కాగా, ఆమె భర్త ప్రసాద్ కంచె తెనాలికి చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. మరో ఘటన న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన చోటు చేసుకుంది. ధనుష్ రెడ్డి అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద తీవ్రతకు కొట్టుకు పోయారు. ధనుష్ రెడ్డి మృతదేహాన్ని మరుసటి రోజు అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని పిస్కాట్‌ఎవే అనే ప్రాంతంలో కనుగొన్నారు. -
‘ఓక్కి’ బీభత్సం
తిరువనంతపురం/సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో ‘ఓక్కి’ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వర్ష సంబంధిత కారణాలతో ఇరు రాష్ట్రాల్లోనూ నలుగురేసి చొప్పున మొత్తం 8 మంది మరణించారు. తిరువనంతపురం జిల్లాలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన 57 మంది మత్స్యకారులు ఇంకా తిరిగిరాలేదు. వారిని వెతికేందుకు నౌకాదళం నాలుగు ఓడలు, రెండు విమానాలతో రంగంలోకి దిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక కార్యక్రమాలను చేపడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ మరో 24 గంటలపాటు మరింత ఉధృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్ ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. లక్షద్వీప్‌ల్లోనూ శనివారం నుంచి వర్షాలు కురుస్తాయని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి చెప్పారు. కేరళలో మరో 48 గంటలు, తమిళనాడులో మరో 24 గంటలపాటు తీరం వెంబడి 65 నుంచి 75 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపిం ది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాపై ఓక్కి ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు జిల్లాల్లో 3,000 విద్యుత్తు స్తంభాలు, వందలకొద్దీ చెట్లు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వృక్షాలు కూలడంతో కన్యాకుమారి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. అటు తూత్తుకుడి, తిరునెల్వేలి, విరుదునగర్, తంజావూరు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకులం, ఆలప్పూజ, పఠానంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. సముద్ర తీరానికి 100 మీటర్ల దూరంలో నివసించేవారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశించారు. కేరళ ప్రభుత్వం తీరప్రాంత రక్షణ, వైమానిక, నౌకాదళాల సాయం కూడా తీసుకుంటోంది. కేరళలో కరెంట్ షాక్ తగిలి ఓ వృద్ధ జంట సహా మొత్తం నలుగురు మరణించారు. తిరునెల్వేలి–కన్యాకుమారి–తిరువనంతపురం మార్గంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో శుక్ర, శనివారాల్లో పర్యటించాల్సి ఉండగా తుపాను కారణంగా పర్యటనను వాయిదా వేసుకున్నారు. తిరువనంతపురం, ఆ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు శ్రీలంకలోనూ వర్షాలకు ఏడుగురు మరణించారు. ఓక్కి... ఓ బెంగాలీ పదం కోట్లాది ప్రజానీకానికి సమాచారం అందించే వ్యవస్థలకు, జనానికి సులువుగా అర్థమవడానికి వీలుగా తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం వచ్చింది. ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సాంఘిక సంఘం(ఇస్కాప్) కలసి 2000 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలోని తుపాన్లకు పేర్లు పెట్టడం ప్రారంభించాయి. సాధారణంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో సెప్టెంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్య తుపాన్లు వస్తుంటాయి. తుపాను పేరును ఖరారుచేసే అవకాశం ఈసారి బంగ్లాదేశ్‌కు రావడంతో కన్ను అనే అర్థమిచ్చే బెంగాలీ మాట ఓక్కి పేరును ఆ దేశం ప్రకటించింది. ఈ ఏడాది మే నెలలో వచ్చిన ‘మోరా’ తుపాను ఈశాన్య భారతాన్ని అతలాకుతలం చేసింది. థాయ్ భాషలో మోరా అంటే సాగర నక్షత్రం అని అర్థం. తదుపరి తుపానుకు పేరు పెట్టే అవకాశం భారత్‌కు ఇవ్వగా ఇప్పటికే ఆ పేరును ఖరారు చేశారు. ఓక్కి తర్వాత ఈ ప్రాంతంలో వచ్చే తుపానుకు ‘సాగర్’ పేరును భారత్ నిర్ణయించింది. మరోవైపు ఓక్కి తీవ్రత తెలుపుతూ భారత వాతావరణ శాఖ ‘ఆరంజ్’ హెచ్చరిక జారీచేసింది. తమిళనాడులోని కన్యాకుమారికి దక్షిణాన 55 కిలోమీటర్లు, కేరళ రాజధాని తిరువనంతపురానికి నైరుతి దిశగా 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను లక్షద్వీప్వైపు పయనిస్తోందని ప్రైవేటు వాతావరణ పరిశోధనసంస్థ స్కైమెట్ తెలిపింది. బలమైన ఈదురుగాలుల ఫలితంగా దక్షిణ కేరళ, లక్షద్వీప్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వరించని వరుణుడు
వర్షాల్లేక అదును మీరిన ఖరీఫ్ వరి ఎదగని నారు చూసి రైతుల గగ్గోలు వర్షాధార భూములకు బోర్లే శరణ్యం 7 గంటల విద్యుత్‌కు అన్నదాతల మొర చోడవరం: ఖరీఫ్ వరికి అదును మీరడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. మొదట్లో వర్షాల్లేక ఆలస్యంగా వరి నారుమడులు వేయడంతో ఇప్పుడు నారు ఎదగడం లేదు. వాస్తవానికి 21 రోజుల్లో నారు ఎదిగి నాట్లకు సిద్ధం కావాలి. కాని తుపాను వర్షాలు కూడా సరిగ్గా కురవకపోవడంతో నారు కనీస ఎదుగుదల లేక ఉంది. దీనికి తోడు తెగులు బారిన పడి పలుచోట్ల నారుమళ్లలో ఆకు ఎర్రగా మారిపోయింది. వర్షాలు ఇలాగే ఉంటే బోర్లను ఆశ్రయించక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయానికి దమ్ములు పట్టి, నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. కానీ నారే ఎదగకపోవడంతో కనీసం నాట్లయినా పడలేదు. జలాశయాల కింద సైతం నారు పడకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో మునుపెన్నడూ లేనివిధంగా రైతుల డిమాండ్ మేరకు నాట్లు వేసేందుకు పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల నుంచి నీరు విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పెద్దేరు జలాశయం నుంచి 30 క్యూసెక్యుల నీరు విడుదల చేయక, కోనాం జలాశయం నుంచి సోమవారం 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. త్వరలో రైవాడ నీటిని కూడా విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జలాశయాల ఆయకట్టు రైతులకు ఈ పరిణామం కొంత ఉపశమనం కలిగించినా వర్షాధారం, నదులు, కొండగెడ్డలపై ఆధారపడ్డ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో రైతులు నాట్లు ఎలా వేయాలని ఆలోచిస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజులు చూసి బోర్ల సాయంతోనైనా నాట్లు వేయక తప్పదని రైతులు చెబుతున్నారు. మరోపక్క నారుమడికి తెగుళ్లు రావడం, నారు ఎదగకపోవడంతో ఎరువులు, పురువుగు మందులు వేసేందుకు సైతం నీరు అవసరం కావడంతో రైతులు సాగునీటి కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి నిర్ణీత 7 గంటల విద్యుత్‌ను నిరాటంకంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.