-
మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. అయితే ఒమిక్రాన్ ఎందుకు ఇంత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనే కారణం తాజాగా బయటపడింది. మనిషి శరీరంపై 21 గంటలపాటు ఒమిక్రాన్ వేరియంట్ నిలిచి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్లాస్టిక్‌పై ఈ వేరియంట్ 8 రోజులపాటు సజీవంగా ఉంటుంది తేలింది. జపాన్‌కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. వుహాన్‌లో ఉద్భవించిన సార్క్ సీఓవీ2 ఒరిజినల్ వేరియంట్‌తోపాటు ఇతర వేరియంట్లపై పరిశోధనలు చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్‌తో పోలిస్తే మనిషి చర్మంపై, ప్లాస్టిక్‌పై రెండు రెట్లు అధికంగా జీవించి ఉన్నట్లు గుర్తించారు. ఒమిక్రాన్ ఇతర అన్నీ వేరియంట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నందున డెలటఆ వేరియంట్ కంటే కూడా అధికంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు. చదవండి: ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం ప్లాస్టిక్ సర్ఫేస్‌లపై ఒరిజనల్ వేరియంట్ 56 గంటలు, ఆల్ఫా వేరియంట్ 191.3 గంటలు, బీటా వేరియంట్ 156.6 గంటలు, గామా వేరియంట్ 59.3 గంటలు, డెల్టా వేరియంట్ 114 గంటలు సజీవంగా ఉంటుందని తేల్చి చెప్పారు. వీటన్నింటికి మించి ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్‌పై 193.5 గంటలపాటు సజీవంగా ఉండనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి: కరోనా ఉధృతి: గడిచిన 24 గంటల్లో 2,85,914 కేసులు అదే విధంగా చర్మం మీద ఒరిజినల్ వేరియంట్ 8.6 గంటలు, ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, డెల్టా 16.8 గంటలు, ఒమిక్రాన్ 21.1 గంటలు ఉంటుందని తెలిపారు. కాగా ఆల్ఫా, బీటా వేరియంట్ల మధ్య మనుగడ సామర్థ్యంలో గణనీయమైన తేడా లేదు. ఇవి ఇంతకముందు అధ్యయనాల ఫలితాలకు అనుగుణంగా ఉందని పరిశోధకులు తెలిపారు. -
మనుషుల్లోనూ పులి చారలు!
మెడి క్షనరీ పులుల్లోనే ఒంటినిండా చారలుంటాయని అనుకుంటున్నారా? చాలామంది మనుషుల చర్మం కింద కూడా పులిచారల్లాంటివే ఉంటాయి. ఈ లైన్స్ అన్నీ జీబ్రాల్లాగే ప్రతి మనిషిలోనూ వేర్వేరుగా ఉంటాయట. జర్మన్ డర్మటాలజిస్ట్ అల్ఫ్రెడ్ బ్లాష్కో అనే చర్మవ్యాధి నిపుణుడి పేరిట ఈ చారలను ‘బ్లాష్కోస్ లైన్స్’ (Blaschko's lines) అని అంటారు. కొందరిలో చర్మ వ్యాధి సోకినప్పుడు ఈ చారలు కనిపించేవి. ఇప్పుడు వీటి రహస్యం తెలిసింది. పిండదశలోని ఒకే ఒక కణం నుంచి అనేక కణాలుగా విభజితమయ్యేప్పుడు వాటిలోని కొన్ని కండరాలుగా, మరి కొన్ని ఎముకలుగా ఇంకొన్ని చర్మంగా రూపొందే సమయంలో ఇంగ్లిష్ అక్షరాల్లోని ‘వి’, ‘ఎస్’ లాంటి రకరకాల పాట్రన్స్లో ఇలా పులి చారల్లా ఏర్పడతాయని గుర్తించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement