breaking news
Human geography
-
సమయమే సంపద
కాలం ఎంతో విలువైనది. ఎవరికోసం ఆగనిది. బిరబిరమంటూ సాగిపోయే ఉధృతమైన నదీ ప్రవాహానికి మానవ మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చు. కానీ, నిరవధికంగా సాగిపోయే కాలప్రవాహానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరన్నది వాస్తవమే కదా..!! కాలం మనకు ఉచితంగా లభిస్తుంది. కానీ కాలం విలువను వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం. సకల ప్రాణుల్ని, సమస్త జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నది లో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి’’ అన్న చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధి గా పాటించడం లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు. ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే, అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది. ‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటాడు గుర్రం జాషువ. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏ రంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే. కాలం అనేది మనం ఆపితే ఆగదు. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే. ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. అందువల్లనే, ఆది శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు చిన్నవయస్సులోనే శరీరాన్ని చాలించినప్పటికీ, తాము జీవించి ఉన్న స్వల్పమైన సమయంలోనే అద్వితీయమైన, అప్రతిహతమైన విజయాలను సాధించగలిగారు. ‘‘యువతీ యువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్యసాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్ధకాన్ని వదలండి.’’ అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం ఎంతో విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని కాదు. జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. కాలం విలువ తెలుసుకుని, ప్రగతిని సాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. ‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్‌స్టాయ్. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!! ‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరు బాట కావడం కష్టమేమీ కాదు. కాలాన్ని సద్వినియోగపరచిన ప్రతి వ్యక్తీ చేయగలిగేది మహేంద్రజాలమే. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏ మాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు. –వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి -
జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ మెయిన్స్ లో జాగ్రఫీ పేపర్-1లో భౌతిక, మానవ భూగోళ శాస్త్రాలకు సంబంధించిన భావనలు, సిద్ధాంతాలను పొందుపరిచారు. -భూస్వరూప శాస్త్రానికి సంబంధించి భూ అయస్కాంతత్వం (జియోమాగ్నటిజం) ప్రాథమిక భావనలు, భూ అభినితి (జియోసింక్లైన్), భూ సమస్థితి, డబ్ల్యు.జె. మోర్గాన్ ప్రతిపాదించిన ఫలకవిరూపక సిద్ధాంతం ఆధారంగా భూకంపాలు, సునామీలు ఏర్పడే విధానం- విశ్లేషణ, జియోహైడ్రాలజీ మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిపై పరిపూర్ణ పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. - ఎం.సింధు, సైనిక్‌పురి శీతోష్ణస్థితి శాస్త్రానికి సంబంధించి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ దాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఊర్ధ్వ ఉష్ణోగ్రతా విస్తరణ, ఉష్ణ సమతుల్యం, రుతుపవనాలు, జెట్‌స్ట్రీమ్, వాయురాశులు, వాతాగ్రాలు, సమ శీతోష్ణ మండల, ఉష్ణమండల చక్రవాతాలు, వాటి మధ్య తేడాలు, వర్షపాత రకాలు, జల సంబంధిత చక్రం, అనువర్తిత శీతోష్ణస్థితి శాస్త్రం మొదలైన అంశాలను విశ్లేషణాత్మక దృష్టితో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. జైవిక భూగోళ శాస్త్రానికి సంబంధించి మృత్తిక వర్గీకరణ, విస్తృతి, మృత్తిక క్రమక్షయం, నిమ్నీకరణకు కారణాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అటవీ నిర్మూలన వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీకి సంబంధించి ఆవరణశాస్త్ర ప్రాథమిక భావనలు, పర్యావరణంపై మానవ ప్రభావం, ఆవరణ వ్యవస్థల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, వాటి సంరక్షణ, జీవ వైవిధ్యత సంరక్షణలో సుస్థిరాభివృద్ధి పాత్ర మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. మానవీయ భూగోళ శాస్త్త్రంలోని దృక్పథాలకు సంబంధించి పర్యావరణ వాదం, పరిణామాత్మక విప్లవం, ద్వంద్వ భావన, రాడికల్, ప్రవర్తనా వాద దృక్పథాలు, ప్రపంచ సాంస్కృతిక మండలాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించి, వనరులు వాటి విస్తరణ, ఇంధన సమస్య, ప్రపంచ వ్యవసాయ మండలాలు - రకాలు, ఆహార భద్రత, దుర్భిక్షం -కారణాలు - ప్రభావాలు - నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. ప్రాంతీయ భూగోళ శాస్త్త్రంలో ప్రాంతీయ భావన, రకాలు, ప్రాంతీయ అసమానతలకు కారణాలు, వాటి అభివృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడంలో పర్యావరణ సంబంధిత అంశాల పాత్ర మొదలైన అంశాలను చదవాలి. మానవ భూగోళ శాస్త్త్రంలోని నమూనాలు, సిద్ధాంతాలు, జనాభా పరివర్తన నమూనాలు, ఓస్టోవ్‌స నమూనాలోని వృద్ధి దశలు, హృదయభూమి, అంచుల భూమి సిద్ధాంతాలు మొదలైన అంశాలను చదవాల్సి ఉంటుంది. జాబ్స్ అలర్ట్స: ట్రైనీ కంటెంట్ డెవలపర్ ట్రైనీ కంటెంట్ డెవలపర్ల నియామకానికి సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం దరఖాస్తులు కోరుతోంది. ట్రైనీ కంటెంట్ డెవలపర్ అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. వయసు: ఆగస్టు 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ’What are the problems faced by Telangana and Andhra Pradesh after State bifurcation? Suggest your solutions to the problems' అంశంపై 750 పదాలకు తక్కువ కాకుండా వ్యాసాన్ని స్వయంగా ఆంగ్లంలో రాసి పంపాలి(టైప్ చేసి పంపకూడదు). వ్యాసం ఆధారంగా అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆరు నెలల శిక్షణ కాలంలో నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫెండ్ అందజేస్తారు. దరఖాస్తు విధానం: ‘జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్’ పేరుతో హైదరాబాద్‌లో చెల్లేలా తీసిన రూ.200 డిమాండ్ డ్రాఫ్ట్‌ను వ్యాసం, రెజ్యుమెతో జతచేసి కింది చిరునామాకు పంపాలి. చిరునామా: సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, 8-2-696,697/75/1, సితార గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నెం 12, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500008 చివరి తేది: ఆగస్టు 17, రాత పరీక్ష తేది: ఆగస్టు 31 ఇంటర్వ్యూ: సెప్టెంబరు 15 క్లాసులు ప్రారంభం: అక్టోబరు 1 నుంచి మనదేశంలో పరిశోధనా సంస్థలు మీకు తెలుసా? - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) - బెంగళూరు - ఫిజికల్ రీసెర్చ లేబొరేటరీ(అహ్మదాబాద్): ఖగోళ భౌతిక శాస్త్రం, సౌరకుటుంబ భౌతిక శాస్త్రం, ప్లాస్మా భౌతిక శాస్త్రం, పురావస్తు శాస్త్రాల అధ్యయనం. - సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట, నెల్లూరు జిల్లా: రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించే కేంద్రం. - విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం: ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం. - తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తిరువనంతపురం: రాకెట్లను ప్రయోగించే ప్రదేశం. - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్: దీనిని గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని పిలిచేవారు. ముఖ్య గ్రంథాలు, రచయితల పేర్లు ఇవే.. రచయిత గ్రంథం.. జాయపసేనాని నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి క మూలఘటిక కేతన ఆంధ్రభాషా భూషణం, విజ్ఞానేశ్వరీయం క నాగార్జున సిద్ధుడు రసరత్నాకరం క రషీద్ ఎద్దిన్ మొట్టమొదటి చరిత్ర పుస్తకాన్ని ప్రచురించాడు క విష్ణుశర్మ పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించాడు క విశాఖదత్తుడు ముద్రా రాక్షసం క గడియారం వెంకటశేషశాస్త్రి శివభారతం నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలం? ఆర్థిక ప్రణాళిక: ూ 1966-69 మధ్య కాలాన్ని భారత ప్రణాళికా వ్యవస్థలో ప్రణాళికా విరామంగా వ్యవహరిస్తారు. ఈ కాలంలో కేవలం వార్షిక ప్రణాళికలు మాత్రమే అమలయ్యేవి. - నాలుగో పంచవర్ష ప్రణాళిక ఏప్రిల్ 1, 1969 నుంచి మార్చి 31, 1974 వరకు అమల్లో ఉంది. - సుస్థిరతతో కూడిన వృద్ధిని నాలుగో పంచవర్ష ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది. - ఐదో పంచవర్ష ప్రణాళిక కాలం ఏప్రిల్ 1, 1974 నుంచి మార్చి 31, 1979 వరకు అని నిర్ణయించారు. - జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ఐదో పంచవర్ష ప్రణాళిక ఒక సంవత్సరం ముందే అంటే మార్చి 31, 1978న ముగిసింది.