breaking news
garjanai
-
ఆరు నెలల్లో అరడజను సినిమాలు..!
వయసు పెరుగుతున్న కొద్ది జోరు పెంచుతోంది చెన్నై చంద్రం త్రిష. ఇక కెరీర్ ముగిసిపోయినట్టే అనుకుంటున్న టైంలో బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ధనుష్ సరసన హీరోయిన్ గా నటించిన కోడి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న త్రిష, ఈ ఏడాది మిగిలిన ఆరునెలల సమయంలో తను నటించిన ఆరు సినిమాలను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సినిమాలతో పాటు తాజా మరో సినిమాను స్టార్ట్ చేసింది. ఇప్పటికే మోహిని, గర్జనై, శతురంగ వేట్టై సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తమిళ సినిమా 1818తో పాటు మలయాళ సినిమా హేయ్ జూడ్ ల షూటింగ్లలో పాల్గొంటుంది త్రిష. వీటితో పాటు తాజా 96 అనే సినిమాకు కూడా డేట్స్ ఇచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 12 నుంచి సెట్స్ మీదకు వెళ్తోంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాది చివరకల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
డూప్ వద్దు బాస్!
అది చాలా రిస్కీ ఫైట్. త్రిషలాంటి సుకుమారితో అలాంటి ఫైట్ చేయించాలంటే ఏ దర్శకుడికైనా మనసు వస్తుందా? అందుకే ఆ ఫైట్‌ని డూప్‌తో కానిచ్చేద్దామని దర్శకుడు సుందర్ బాలు అనుకున్నారు. కానీ, త్రిష ఒప్పుకుంటారా? ‘డూప్ వద్దు బాస్. నేనే చేస్తా’ అంటూ రిస్కీ ఫైట్‌ని ధైర్యంగా చేసేశారు. ‘గర్జనై’ సినిమా కోసం త్రిష ఈ ఫైట్ చేశారు. హిందీ హిట్ మూవీ ‘ఎన్‌హెచ్ 10’కి ఇది తమిళ రీమేక్. ఇందులో మధు అనే వెస్ట్రన్ డ్యాన్సర్ పాత్రను త్రిష చేస్తున్నారు. కొడైకెనాల్లో జరిగే ఓ కార్యక్రమానికి మధు హాజరు కావాలనుకుంటుంది. మార్గమధ్యంలో ఎవరో ఆమెను బంధిస్తారు. అందులోంచి మధు ఎలా బయటపడుతుంది? అనేది కథ. సినిమా మొత్తం త్రిష పాత్ర చుట్టూ తిరుగుతుంది. ‘‘త్రిషది పవర్ఫుల్ రోల్. మధు పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తున్నారు. డూప్ లేకుండా ఆమె ఫైట్స్ చేస్తున్న తీరు చూస్తుంటే, త్రిష ఎందుకింత సక్సెస్ అయ్యారో అర్థమవుతోంది’’ అని దర్శకుడు అన్నారు. -
నేను చివరగా చెప్పిన అబద్ధం అదే!
ఒకటి కాదు.. రెండు కాదు.. త్రిష చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. మోహిని, సదురంగ వేటై్ట, గర్జనై, 96, 1818, హే జడ్జ్, స్వామి–2.. ఆ సినిమాలు ఇవే. వీటిలో మోహిని, గర్జనై.. లేడీ ఓరియంటెడ్ మూవీస్. ‘1818’లో తనే లీడ్ రోల్ చేస్తున్నారు. ఆరేడేళ్లుగా ఏడాదికి నాలుగైదు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన త్రిష ఇప్పుడు 7 సినిమాలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరదా ప్రశ్నలకు త్రిష చెప్పిన జవాబులు తెలుసుకుందాం. 1 ఏంటండీ బాబూ.. ఒకేసారి ఏడు సినిమాలా? ఈ ఏడాది నా టార్గెట్ 9 సినిమాలు. ఇప్పటికి 7 కమిట్ అయ్యా. ఇంకో రెండు సినిమాల గురించి త్వరలో అనౌన్స్ చేస్తా. 2 ఇన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వగలుగుతారా? ఒకసారి డైరీ చెక్ చేశా. ఇచ్చే స్కోప్ ఉంది. పైగా ఒప్పుకున్న సినిమాలన్నీ ‘ది బెస్ట్’ అనొచ్చు. ఒకేసారి ఇన్ని సినిమాలంటే కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది. అయినా ఓకే. 3 పర్సనల్ విషయాలకొద్దాం.. మీ సొంతూరు చెన్నైలో మీకిష్టమైన ప్లేస్? ఇంకేముంటుంది? మా ఇల్లు. 4 మిమ్మల్ని ద్వేషించేవారికి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా...? సందేశాలెందుకు? వారిని అలాగే కొనసాగనిద్దాం. 5 అపజయాల నుంచి మీరు ఎలా తేరుకుంటారు? గాఢంగా నిద్రపోతా. ఐస్‌క్రీమ్ లాగించేస్తా. 6 మీకు ప్రేరణ ఎవరు? నా అంతరాత్మే నాకు ఇన్స్పిరేషన్. 7 మీరు బాగా నిరుత్సాహపడ్డప్పుడు వెంటనే తీసుకునే స్టెప్ ఏది? బాగా ఫీలవుతాను. తర్వాత ఏడుస్తా. కాసేపటికి బాధ దానంతట అదే మాయమవుతుంది. 8 మీరు చివరిగా చెప్పిన అబద్ధం? షూటింగ్లో ఉన్నాను. తర్వాత కలుస్తాను. 9 మిమ్మల్ని భయపెట్టే విషయం ఏదైనా ఉందా? ఎవరైనా దిండుతో ఊపిరి ఆడకుండా చేస్తారని భయంగా ఉంటుంది. 10 టీనేజ్ గాళ్స్‌కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ధైర్యంగా ఉండండి. మీ కలలను సాధించుకునే దిశగా అడుగులు వెయ్యండి. 11 పెళ్లి తర్వాత మీరు సినిమాల్లో కొనసాగుతారా... లేక ఇంటికే పరిమితమవుతారా? ఈ రోజుల్లో మహిళలు ఇటు ఇల్లు, అటు ఉద్యోగం రెంటినీ చక్కగా చూసుకోగలుగుతున్నారు. 12 మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా.. అబద్ధం చెప్పకూడదు సుమా.. సరే అబద్ధం చెప్పను. అయితే ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్ గురించి ఏం చెప్పలేను. 13 మీకు కోపం తెప్పించే విషయం? ఎదుటి వ్యక్తులకు కొంతమంది నీతులు చెబుతారు. కానీ, చెప్పేవాళ్లు పాటించరు. అలాంటివాళ్లంటే కోపం. 14 మీ గురించి వచ్చే పుకార్లకు ఎలా స్పందిస్తారు? ఇంట్లో పెద్దగా నవ్వుకుని వదిలేస్తాను. పట్టించుకోను. 15 మీ కుంటుంబం గురించి ఒక్క మాటలో? నా బలం..నా ఎంటర్టైన్మెంట్. 16 దేవుడు మీ ముందు ప్రత్యక్షమయితే ఏం అడుగుతారు? ఏమీ అడగను. నాకేం ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు.