breaking news
foamar
-
యమునలో విషపు నురుగులు
న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్య స్థాయి మరింతగా పెరిగింది. కాళింది కుంజ్ ప్రాంతానికి చెందిన ఒక వీడియోలో యమునా నది ఉపరితలంపై విషపూరిత నురుగుతో కూడిన మందపాటి పొర కనిపిస్తోంది. ఈ నదిలో గత కొన్ని రోజులుగా నురుగు కనిపిస్తోంది.వారాంతాల్లో యమునా ఘాట్లను శుభ్రం చేసే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఇక్కడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో నురుగు ఎక్కువగా ఉందని, ఇది చర్మంతో పాటు కళ్లకు కూడా ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ఢిల్లీలో వాయుకాలుష్యం, యమునలో విషపు నురుగలకు ఆప్ కారణమంటూ బీజేపీ విమర్శిస్తోంది.ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునలో స్నానం చేసిన కొన్ని గంటలకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన వైద్యులను సంప్రదించారు. వారు ఆయనకు చికిత్స అందించాక, విశ్రాంతి అవసరమని సూచించారు. యమునా ప్రక్షాళన విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మోసం చేసిందని వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. 2025 ఫిబ్రవరిలో బీజేపీ అధికారంలోకి వస్తే యమునా క్లీనింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. #WATCH | Delhi | Thick toxic foam seen floating on the Yamuna River in Kalindi Kunj, as pollution level in the river continues to remain high. pic.twitter.com/VZhXwvPNd4— ANI (@ANI) October 26, 2024ఇది కూడా చదవండి: దేశంలోని ప్రముఖ మహాలక్ష్మి ఆలయాలు -
మోకాలు లోతు నురగ నీటిలో ఛఠ్ పూజలు
ఢిల్లీ: యమునా నదిలో కలుషిత నీటిలోనే భక్తులు నేడు ఛఠ్ పూజలు నిర్వహించారు. కాళింది కుంజ్ వద్ద మోకాలు లోతు నురగ నీటిలో మహిళలు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యమునా నది కలుషిత నీటిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Delhi: Devotees stand in knee-deep toxic foam in Yamuna for Chhath Puja Read @ANI Story | https://t.co/M97YK6qIOn#Yamuna #ChhathPooja #Delhi #ToxicFoam pic.twitter.com/dPrvex1Esh — ANI Digital (@ani_digital) November 20, 2023 నాలుగు రోజుల పాటు సాగిన ఛఠ్ పూజా వేడుకల ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు సోమవారం ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. యమునా నదిలో నురగలు వస్తున్నప్పటికీ తప్పనిస్థితిలో భక్తులు పూజా కార్యక్రమాలు చేశారు. అయితే.. యమునా నది నీటిలో అధిక పాస్పేట్ స్థాయిల కారణంగా నురగ నీరు ప్రవహిస్తోంది. యూపీ, హర్యానా సహా చుట్టుపక్కల రాష్ట్రాల పరిశ్రమల నుంచి కలుషిత నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా నది నీటిలో పాస్పేట్ స్థాయిలు అధికంగా ఉన్నాయి. ఛఠ్ పూజా కార్యక్రమాలు ప్రతి ఏడాది దేశ రాజధాని ఢిల్లీతో పాటు బిహార్, యూపీ, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నాలుగు రోజులపాటు జరుగుతున్న ఛఠ్ పండుగ శుక్రవారం ప్రారంభమైంది. స్వచ్ఛత, సద్భావన, విశ్వాసాలకు నిలయంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
అన్నదాతకు యాప్ అండ
’ప్లాంటిక్స్’తో రైతులకు మేలు తెగుళ్లు, నివారణ సూచనలు వెంటనే తెలుగులోనూ సమాచారం సహకారం అందిస్తున్న ఇక్రిశాట్ ఏలూరు (మెట్రో): మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ ఉంటుంది. రైతు వెచ్చించే ఖర్చులో పురుగు మందులదే సింహభాగం. పంటలో తెగులు కనిపిస్తే చాలు ఏ మందులు పిచికారీ చేయాలో అర్థంకాక అన్నదాతలు ఆందోళన చెందుతుంటారు. దీంతో పంటలు పరిశీలించకుండానే వ్యాపారులు చెప్పిందే వేదంగా రైతులు పురుగుమందులు వాడేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చి పంటను పరిశీలించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటి దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు తీర్చేందుకు ప్రత్యేకంగా తెగుళ్ల నివారణలు సూచించేందుకు మొబైల్ యాప్‌ను ఇటీవల రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాంటిక్స్ (పిఎల్ఎఎన్టిఐఎఎక్స్) అనే ఈ యాప్ ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది. మారుతున్న ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఓ ప్రయివేటు మొబైల్ కంపెనీ సర్వే ప్రకారం ప్రస్తుతం 80 శాతం మంది రైతుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇలాంటి వారికి ఈ నూతన యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే లక్ష మందికి పైగా ఈ యాప్‌ను ఉపయోగించుకుని తెగుళ్ల సమాచారాన్ని గుర్తించగలుగుతున్నారని వ్యవసాయాధికారులు అంచనా. ఈ యాప్ జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది అక్కడ ఫలితాలు సాధించడంతో మన దేశంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఇక్రిశాట్ అధికారులు జర్మనీతో ఒప్పందం చేసుకున్నారు. మొదటిగా హిందీ భాషలో అందుబాటులోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ చొరవతో ఈ సంవత్సరం జూన్ నుండి తెలుగు భాషలో లభ్యమయ్యేలా రూపొందించారు. ప్రస్తుతం ఈ యాప్ డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, పోర్చుగీసు, హిందీ, తెలుగు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. నిమిషాల్లో సమచారం: ఆండ్రాయిడ్ వెర్షన్లో ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. తర్వాత పంటల వారీగా ఆప్షన్లు కనిపిస్తాయి. ఏ పంటపై తెగుళ్ల సమాచారం కావాలో ఆ పంట ఐకాన్‌పై క్లిక్ చేస్తే కెమెరా తెరుచుకుంటుంది. చెట్టుకు తెగులు ఉన్న చోట ఫొటో తీసి ఆప్‌లోడ్ చేస్తే కొద్ది సేపటికే ఆ తెగులుకు సంబంధించిన వివరాలు, లక్షణాలు, పిచికారీ చేయాల్సిన మందుల వివరాలతో శాస్త్రవేత్తలుగానీ, అనుభవజ్ఞులైన రైతులు నుంచి కానీ సమాచారం వస్తుంది. సూచించిన మందులు తెచ్చుకుని పిచికారీ చేస్తే సరిపోతుంది. ఎంత మోతాదులో వాడాలో కూడా వివరాల్లో ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వరి, అరటి, కంది, గోధుమ, చిక్కుడు, టమాట, దానిమ్మ, పత్తి, బంగాళాదుంప, బొప్పాయి, మామిడి, పెసలు, మినుములు, మిర్చి, మొక్కజొన్న, వంకాయ, సెనగ, సోయాబీన్ వంటి 18 రకాల పంటలకు సంబంధించి ఐకాన్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇతర పంటలు అనే ఐకాన్ కూడా ఏర్పాటు చేయడంతో ఇతర పంటల వివరాల కోసం ఆ ఐకాన్‌ను ఎంచుకుంటే మిగిలిన పంటలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. జీపీఎస్ సహకారంతో వాతావరణ సూచనలు : వాతావరణ పరిస్థితులు, గాలిలో తేమ, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ యాప్‌లో ఆప్షన్లు ఉన్నాయి. మొబైల్ జీపీఎస్ ఆప్షన్ ఆన్‌చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారం తెలుస్తుంది.