T20 WC: నేపాల్‌తో మ్యాచ్.. ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ మొదలైంది. పాకిస్తాన్- నెదర్లాండ్స్ మ్యాచ్‌తో శనివారం ఈ పొట్టి క్రికెట్ సంగ్రామానికి తెరలేచింది. తొలిరోజు ఈ మ్యాచ్‌తో పాటు.. వెస్టిండీస్- స్కాట్లాండ్.. టీమిండియా- యూఎస్ఏ మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది.ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లుఇక గ్రూప్-సిలో ఉన్న ఇంగ్లండ్ తొలత నేపాల్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం మ్యాచ్ జరుగనుండగా.. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ శనివారమే తమ తుదిజట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు ఆదిల్ రషీద్, లియామ్ డాసన్‌లకు చోటు దక్కింది.హార్డ్ హిట్టర్ వచ్చేశాడు!అంతేకాదు.. పూర్తి ఫిట్నెస్తో హార్డ్ హిట్టర్ ఫిల్ సాల్ట్ కూడా తుదిజట్టులోకి వచ్చేశాడు. సాల్ట్‌కు తోడు మాజీ కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు కెప్టెన్ బ్రూక్ బ్యాటింగ్ లైనప్‌ను మరింత పటిష్టం చేశారు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో సామ్ కర్రాన్, విల్ జాక్స్, జేకబ్ బెతెల్ ఉన్నారు. పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్, ల్యూక్ వుడ్ పేర్లు ఖరారయ్యాయి. కాగా ఇంగ్లండ్- నేపాల్ మధ్య ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.టీ20 ప్రపంచకప్-2026: నేపాల్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్ తుదిజట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.బెంచ్: రెహాన్ అహ్మద్, జోష్ టంగ్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్.వరల్డ్‌కప్ టోర్నీకి నేపాల్ జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.చదవండి: T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..