Cancer Free
-
Opal Suchata: 72 ఏళ్ళ కల ఇది..! ఆ కాంక్షతోనే గెలిచా..
ఓపల్ సుచాతా.. మోడల్, థాయ్‌లాండ్.. తొలి మిస్ వరల్డ్... ఇప్పుడు 72వ మిస్ వరల్డ్! థాయ్‌లాండ్‌కి చెందిన ఆమె కేన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు బ్రెస్ట్ ట్యూమర్ సర్జరీ అయింది. అది తన జీవనోద్దేశాన్ని, లక్ష్యాన్నే మార్చింది అంటున్న ఓపెల్ సుచాతా గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..‘‘నేను పుట్టి పెరిగింది థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో. మా ఊరూ హైదరాబాద్‌లాగే పర్ల్ సిటీ! హైస్కూల్ కోసం బ్యాంకాక్‌కి మూవ్ అయ్యాను. సైకాలజీ, ఆంత్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. ప్రస్తుతం నేను అంబాసిడర్ కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నాను.. మా కుటుంబ విషయానికి వస్తే అమ్మ, పెద్దమ్మలు, అత్తలు .. అందరూ స్ట్రాంగ్ పర్సన్సే. ఒకరకంగా చెప్పాలంటే నేను స్ట్రాంగ్ విమెన్ మధ్యలో పెరిగాను. ఆ వాతావరణమే నాకు స్ఫూర్తి. ఆ స్ట్రెంతే నా పదహారవ ఏట బ్రెస్ట్‌లో డిటెక్ట్ అయిన ట్యూమర్‌తో ఫైట్ చేసేలా చేసింది. అది క్యాన్సర్ ట్యూమర్ కాదు. అయినా చాలా భయపడ్డాను. ఆ భయాన్నుంచి ఓ ఉద్దేశం కోసం ప్రయాణించేలా చేసింది నా చుట్టూ ఉన్న మహిళల స్ట్రెంతే! సర్జరీ తర్వాత ఈ హర్డిల్‌ని గనుక దాటగలిగితే నా జీవితాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలకు అంకితం చేయాలనుకున్నాను. లక్కీగా దాటాను. దాంతో అనుకున్నట్టుగానే ‘ఓపల్ ఫర్ హర్’ప్రాజెక్ట్‌తో బ్రెస్ట్‌క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశాను. మహిళా సాధికారతకూ పాటుపడుతున్నాను. ఈ బ్యూటీ పాజెంట్‌లో నేను పాల్గొనడానికి ప్రేరణ కూడా అదే. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే రౌండ్‌తో ఈ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్ మన కథను ప్రపంచానికి వినిపించే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే ఈ పాజెంట్‌లో పాల్గొన్నాను. నా కథను షేర్ చేసుకుని, నాప్రాజెక్ట్ ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించి బ్రెస్ట్ క్యాన్సర్ మీద మహిళలకే కాదు జెండర్స్‌కి అతీతంగా అందరికీ అవగాహన కల్పించాలనుకున్నాను.తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ పంచుకుంటానుమిస్ వరల్డ్ హోదాలో నేను ప్రపంచమంతా పర్యటించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచమంతటా నా ప్రాజెక్టుల గురించి చెప్పుకోగలను. అయితే నాకు నా తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ,ప్రాజెక్టులూ కూడా చాలా నచ్చాయి. నాకు వీలున్నంతవరకు నేను అందరి ఆలోచనలూ,ప్రాజెక్టులనూ కూడా అన్ని వేదికలమీదా పంచుకుంటాను.క్రౌన్‌తో మా దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉందినా బ్యూటీ పాజెంట్ జర్నీ నా పద్దెనిమిదవ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత రెండేళ్లకు మళ్లీ నేషనల్ బ్యూటీ పాజెంట్‌లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్ వరల్డ్‌కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్ ఎ పర్పస్‌తో విన్ అయ్యి.. మిస్ వరల్డ్ క్రౌన్ తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల. ఆ కల నా ద్వారా సాకారం అయినందుకు, నేను మిస్ వరల్డ్ క్రౌన్‌తో మా దేశానికి వెళ్లగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాజెంట్ నా లెర్నింగ్ అన్ లెర్నింగ్ప్రాసెస్కు ఓ వేదికైంది. భిన్నదేశాలు, విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన నా తోటి కంటెస్టెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్సే్చంజ్ ఆఫ్ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్ షేరింగ్‌తో కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనా తీరూ మారింది. నా పర్సెప్షన్ బ్రాడ్ అయింది.అన్నీ అద్భుతంతెలంగాణ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలు చాలా వైబ్రెంట్‌గా ఉన్నారు. వాళ్ల కట్టుబొట్టు తీరు, ఇక్కడి ఫుడ్, కల్చర్, ఆతిథ్యం అన్నీ అద్భుతం. నేను జ్యూయలరీ ఫ్యాన్ ని. అందుకే నాకు హైదరాబాద్ బాగా నచ్చింది. ముత్యాలే కాదు సంప్రదాయ, ఫ్యాషన్ జ్యుయలరీకి ఫ్యూజన్ లా ఉందీప్రాంతం. నేను చూసిన ఈ అద్భుతాన్ని మా వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ నన్ను ఇన్ స్పైర్ చేసిన కథలు చాలా ఉన్నాయి. వాటినీ మావాళ్లకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాటల కన్నా చేతలతోనే అవతలి వాళ్లకు ప్రేరణగా నిలవాలనుకుంటాను. మన పక్కనున్న వాళ్లకు ఓ భరోసాగా నిలవాలనుకుంటాను. నన్ను నేను అలా మలచుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది ఈ మిస్ వరల్డ్.– సరస్వతి రమఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!
- ప్రముఖ రెస్టారెంట్ల బ్రెడ్ ఉత్పత్తుల్లో కేన్సర్ కారకాలు - సీఎస్ఈ పరిశీలనలో వెల్లడి న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ప్రముఖ సంస్థలు అందిస్తున్న బ్రెడ్ సంబంధ ఆహార పదార్థాల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పరీక్షల్లో తేలింది. బ్రిటానియా, కేఎఫ్‌సీ, పిజ్జాహట్, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్వే, స్లైస్ ఆఫ్ ఇటలీ వంటి అనేక ఫుడ్ చైన్ రెస్టారెంట్లు అందిస్తున్న ఆహార పదార్థాల్లో పొటాషియం బ్రొమేట్, పొటాషియం అయొడేట్లు ఉన్నట్లు సీఎస్ఈ సోమవారం విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిసింది. ఢిల్లీలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, బ్రాండ్ల ఆహార ఉత్పత్తులను సీఎస్ఈ పరిశీలించింది. ప్యాక్ చేసిన బ్రెడ్లు, బ్రెడ్డుతో తయారైన పావ్‌లు, బన్లు, బర్గర్లు, పిజ్జాలు వంటి 38 నమూనాలను సీఎస్ఈ పరీక్షించింది. వీటిలో 84 శాతం పదార్థాల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రసాయనాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. కానీ భారత్‌లో నిషేధం లేదు. బ్రిటానియా, కేఎఫ్‌సీ, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వేలు ఈ హానికర పదార్థాలను తాము వాడడం లేదన్నాయి. నమూనాలను తమ పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబోరేటరీ (పీఎంఎల్)లో పరీక్షించిన అనంతరం, బయటి ప్రయోగశాలల్లో కూడా పరిశీలించాకే ఈ నివేదిక విడుదల చేశామని సీఎస్ఈ ఉప డెరైక్టర్ జనరల్ చంద్రభూషణ్ తెలిపారు. 38 నమూనాలను పరీక్షించగా 32 ఉత్పత్తుల్లో 1.15 నుంచి 22.54 పీపీఎం వరకు పొటాషియం బ్రొమేట్,పొటాషియం అయొడేట్లు ఉన్నట్లు తేలిందన్నారు. కాగా, సీఎస్ఈ నివేదికలోని అంశాలపై విచారణ జరిపినివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు.