breaking news
Bittu Tabahi
-
బిట్టుగాడి శ్రమంతా బూడిదలో పోసిన ప‘నీరు’!
ఎనిమిది నెలల పాటు చెమటోడ్చాడు.. టన్నుల కొద్దీ చెత్తను ఒక్కడే తొలగించాడు.. నదికి కొత్త రూపు తెచ్చాడు! కానీ, అతడి కష్టం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. కొద్ది వారాలకే నది మళ్లీ చెత్తకుప్పగా మారింది. తన శ్రమంతా వృథా కావడంతో గుండె పగిలినా.. 20 ఏళ్ల బిట్టూ తబాహీ వెనక్కి తగ్గలేదు. ఈత కూడా రాని ఆ యువకుడు మరోసారి నదిలోకి దిగి చెత్తను ఏరివేయడం మొదలుపెట్టాడు.మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నది వద్ద ఈ హృదయవిదారక దృశ్యం కనిపించింది. సురేంద్ర సింగ్ చౌధరీ అలియాస్ బిట్టూ తబాహీ.. ఎనిమిది నెలల పాటు ఒంటరిగా శ్రమించి నదిలోని టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించాడు. కానీ, ప్రజలు మళ్లీ చెత్త వేయడంతో కొద్ది వారాల్లోనే నది పాత స్థితికి చేరింది. ఈ పరిస్థితిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నాడు. అయినా, నిరుత్సాహంతో ఆగిపోలేదు. ఈత రాకపోయినా నదిలోకి దిగి మరోసారి చెత్తను తొలగించడం ప్రారంభించాడు. తక్కువ సమయంలో ఎక్కువ వ్యర్థాలను తొలగించేందుకు మార్గాలు సూచించాలని తన ఫాలోవర్లను కోరాడు.అలా ఫేమస్ అయ్యి..బిట్టూ తబాహీ.. స్థానికంగా ఓ ఆలయం సమీపంలోని చెరువు చెత్తతో నిండిపోవడం చూసి శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అజ్నార్ నదిపై దృష్టి పెట్టాడు. 2026 జనవరి 26న మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో తొలుత కొందరు స్నేహితులు తోడైనా.. ఎక్కువ భాగం పనిని ఒక్కడే చేశాడు. తన సొంత డబ్బును ఖర్చు చేస్తూ, ప్రత్యేక పరికరాలు లేకుండానే ప్లాస్టిక్ సంచులు, సీసాలు, బురద, ఇతర వ్యర్థాలను తొలగించాడు. ఈ క్రమంలో చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి ఇబ్బందులనూ ఎదుర్కొన్నాడు.బిట్టూ శ్రమకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా అతడి కృషిని అభినందించారు. ఆ తర్వాత బెంగళూరులోని తురహళ్లి అడవిని 100 మందితో కలిసి శుభ్రం చేశాడు. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలోనూ శుభ్రతా కార్యక్రమాలు చేపట్టి గురుగ్రామ్‌లో యుమనా నది నుంచి ఏకంగా 2,435 కిలోల వ్యర్థాలను తొలగించాడు.ఒక్కడి బాధ్యతేనా?నదిని శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో.. మళ్లీ చెత్త వేయకుండా చూడటం కూడా అంతే అవసరం. బిట్టూ ప్రయత్నాలకు సోషల్ మీడియాలో పలువురు మద్దతు తెలిపారు. నెదర్లాండ్స్‌కు చెందిన పర్యావరణ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ వ్యవస్థాపకుడు బోయన్ స్లాట్ నుంచి ఉద్యోగ అవకాశం కూడా వచ్చింది. అయినప్పటికీ, ఇక్కడే ఉండి తన స్వచ్ఛ్ భారత్‌ను కొనసాగిస్తున్నాడు.Bittu who single handedly cleaned the river for eight months was shocked to see it polluted again within a month by the locals. https://t.co/XdcHw2qhQ0— 🚨Indian Gems (@IndianGems_) October 13, 2026ఇదీ చదవండి: శివయ్యా.. ఏంటయ్యా ఈ ఘోరం! -
బిట్టూ… నువ్వు సూపర్ రా!
నదులు, చెరువుల్లో చెత్త పారబోయడం ఒక ఎత్తయితే.. పేరుకుపోయిన ఆ చెత్తకంపుతో ముక్కు మూసుకుని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాం మనం. కానీ సురేంద్ర అలాంటోడు కాదు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడడం అతనికి చేత కాదు. చిన్నప్పటి నుంచే నీళ్లలోకి దిగి.. తన చేతులతోనే చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అలా సోషల్ మీడియాలో ‘బిట్టూ తబాహీ’గా గుర్తింపు పొందిన అతడు.. ఇప్పుడు యమునా నదిని శుభ్రం చేసే మిషన్ చేపట్టాడు. సెప్టెంబర్ 20న ప్రపంచ శుభ్రత దినోత్సవం సందర్భంగా.. యమునా నదిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని బిట్టూ తబాహీ చేపట్టారు. అతడి వెంట వచ్చిన వాలంటీర్లు సుమారు నాలుగున్నర గంటలపాటు యమునా ఒడ్డును శుభ్రం చేశారు. ఈ సమయంలో ఏకంగా 585 కిలోల చెత్తను తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు పూలు, దండలు, పూజా సామగ్రి, ఇతర చెత్తను ఒడ్డునుంచి సేకరించారు. స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అతడికి సహకరించారు. బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌదరి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాకు చెందిన అతడు స్కూల్ పిల్లాడిగా ఉన్నప్పుడే నదులు, బహిరంగ ప్రదేశాల శుభ్రతపై దృష్టి పెట్టాడు. అతడి సోషల్ మీడియా ఖాతాల్లో చెత్తతో నిండిన ప్రాంతాల్లోకి వెళ్లి స్వయంగా శుభ్రం చేస్తున్న వీడియోలు కనిపిస్తాయి. పెద్ద యంత్రాలు, భారీ సిబ్బంది లేకుండానే సాధారణ పరికరాలతో చెత్తను తొలగించడం అతడి ప్రత్యేకతగా మారింది. అజ్నార్ నదితోనే అసలు గుర్తింపు..బిట్టూకు భారీగా గుర్తింపు తెచ్చింది మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నది. ప్లాస్టిక్, చెత్త, ఆల్గీతో నది దాదాపు డంపింగ్ యార్డులా మారిన పరిస్థితిని చూసి.. జనవరి 26న అక్కడ శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తొలుత కొందరు స్నేహితులు అతడితో కలిసి పనిచేసినా.. ఆ తర్వాత వారు తప్పుకోవడంతో బిట్టూ ఒంటరిగానే నదిలోకి దిగి చెత్త తొలగించడం కొనసాగించాడు. వారాలపాటు ఈ పని చేస్తూ ప్లాస్టిక్, సీసాలు, ఇతర వ్యర్థాలను బయటకు తీశాడు. అతడు చేస్తున్న పనిని వీడియోలుగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. నదిని శుభ్రం చేయడానికి బిట్టూ తన సొంత డబ్బుతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశాడు. కొందరు మాత్రం పిల్లాడు సోషల్ మీడియా ప్రచారం కోసమే చేస్తున్నాడంటూ విమర్శించారు. కానీ బిట్టూ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఆయన ప్రశంసతో వెలుగులోకిఅజ్నార్ నదిని శుభ్రం చేస్తున్న బిట్టూ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. బియోరాకు చెందిన ఈ యువకుడిని తన ‘మండే మోటివేషన్’గా పేర్కొంటూ ఆయన బిట్టూ చేసిన పనిని ప్రశంసించారు. దీంతో బిట్టూ కథ దేశవ్యాప్తంగా మరింతగా వైరల్ అయింది. జెన్‌జీకి ఇలాంటి కుర్రాళ్ల స్ఫూర్తి కచ్చితంగా ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. విదేశీ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్!బిట్టూ చేసిన పని అంతర్జాతీయ స్థాయిలోనూ దృష్టిని ఆకర్షించింది. నెదర్లాండ్స్‌కు చెందిన పర్యావరణ సంస్థ ది ఓషన్ క్లీనప్ వ్యవస్థాపకుడు, సీఈవో బోయన్ స్లాట్.. సోషల్ మీడియాలో బిట్టూ పనిపై స్పందిస్తూ అతడిని తమ సంస్థలో పనిచేయాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత బిట్టూ తన శుభ్రత కార్యక్రమాన్ని ఒక్క నదికే పరిమితం చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఏ రాష్ట్రానికి వెళ్లాలి, ఎక్కడి నదిని శుభ్రం చేయాలి అంటూ సోషల్ మీడియాలో ప్రజలను సూచనలు కూడా కోరాడు.ఇప్పుడు యమునా! తర్వాత ఎక్కడంటే..అజ్నార్ నది తర్వాత బిట్టూ దృష్టి మధ్యలో చిన్నాచితకా కాలువలు, చెరువులపై పడింది. ఆ తర్వాత దేశ రాజధానికి చేరి .. యమునా నదిని శుభ్రం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతని పిలుపునకు వందల మంది వలంటీర్లు ముందుకు వచ్చారు. మూడు రోజులపాటు యమునా పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తొలి రోజే.. అదీ నాలుగు గంటల్లోనే వందల కిలోల చెత్తను తొలగించడంతో ఈ కార్యక్రమం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తదుపరి తన శుభ్రత కార్యక్రమాన్ని గురుగ్రామ్‌లోని ఖేడ్కీ దౌలాకు తీసుకెళ్లనున్నట్లు బిట్టూ వెల్లడించాడు. ఒక చిన్న పట్టణానికి చెందిన యువకుడు.. ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురుచూడకుండా తన చేతులతోనే నదిలోని చెత్తను తొలగించడం మొదలుపెట్టాడు. ఆ పని వీడియోలుగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అదే వైరల్ ప్రయాణం అతడిని యమునా ఒడ్డుకు, అక్కడి నుంచి దేశవ్యాప్తంగా శుభ్రత కార్యక్రమాల వైపు తీసుకెళ్తోంది. -
నెక్ట్స్ మిషన్ ప్రకటించిన బిట్టూ భాయ్
ఒక నది బాగుపడాలంటే అధికారులు రావాలి.. భారీ నిధులు కేటాయించాలి.. పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేయాలి. కానీ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఇవేవీ లేకుండానే ఓ నదిని శుభ్రం చేసి చూపించాడు. నెలల తరబడి ఒంటరిగా శ్రమిస్తూ ప్లాస్టిక్, చెత్తాచెదారం తొలగించి అజ్నార్ నదికి కొత్త రూపు తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో అతడి పని వైరల్ కావడంతో ఆపై ఏకంగా అంతర్జాతీయ పర్యావరణ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి కార్యాచరణ సైతం ప్రకటించేశాడు..మధ్యప్రదేశ్‌కు చెందిన బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌధరి. అజ్నార్ నది కాలుష్యంతో నిండిపోవడాన్ని చూసిన అతడు.. సమస్య గురించి మాట్లాడటంతో ఆగిపోలేదు. స్వయంగా రంగంలోకి దిగి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించడం మొదలుపెట్టాడు. అవసరమైన ప్రాథమిక సామగ్రిని తన సొంత డబ్బుతో సమకూర్చుకుంటూ.. ఎవరూ తోడుగా లేకపోయినా పదేపదే నది వద్దకు వెళ్లి శుభ్రం చేస్తూ వచ్చాడు.మార్పును వీడియోలుగా..నది శుభ్రం చేసే ముందు పరిస్థితి ఎలా ఉంది.. తాను శ్రమించిన తర్వాత ఎలా మారింది అన్న విషయాలను బిట్టూ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకున్నాడు. తొలుత స్థానికంగా కనిపించిన ఈ ప్రయత్నం క్రమంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చెత్తతో నిండిన నది ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేస్తున్న అతడి వీడియోలు వైరల్ కావడంతో బిట్టూ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.డచ్ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్..బిట్టూ చేసిన పని చివరకు ‘ది ఓషన్ క్లీన్అప్’ దృష్టిని కూడా ఆకర్షించింది. డచ్ పర్యావరణవేత్త బోయన్ స్లాట్ స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదుల్లోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తోంది. బిట్టూ కృషిని గుర్తించిన సంస్థ అతడికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అతడికి మరింతగా అభినందనలు వెల్లువెత్తాయి.‘తర్వాత ఏ రాష్ట్రానికి రావాలి?’..ఉద్యోగ ఆఫర్ వచ్చిన తర్వాత బిట్టూ సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అతడు.. ఇక తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్లి శుభ్రత కార్యక్రమం చేపట్టాలని అడిగాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నదులు, పరిసరాలను శుభ్రం చేయాలనే తన ఆలోచనను వెల్లడించాడు.దీంతో నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. బిహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల పేర్లను సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.కొసమెరుపు.. బిట్టూ శుభ్రం చేసిన అజ్నార్ నది మళ్లీ కాలుష్యం బారిన పడడం ప్రారంభమైంది. కొందరు చెత్తాచెదారం అందులో వేయడం.. వాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో కొందరు యువకులు అక్కడ గస్తీ కాస్తూ బిట్టూ కష్టం వృథా కానివ్వకుండా కాపాడుకుంటున్నారు. -
Bittu Tabahi : ‘బిట్టు’కు బంపరాఫర్
భోపాల్: డబ్బు లేకపోవచ్చు, పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు.. కానీ గుండెల్లో కసి, చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు. ఎదిగేందుకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు! డిజిటల్ రీల్స్, ఫాలోవర్ల కోసం పాకులాడే ఈరోజుల్లో.. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, కనీసం ఈత రాకపోయినా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో ప్లాస్టిక్ చెత్తను తొలగించాడు ఆ యువకుడు. అతని అంకితభావాన్ని గుర్తించిన నెదర్లాండ్స్‌కు చెందిన ప్రఖ్యాత ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ సీఈఓ బోయాన్ స్లాట్ స్వయంగా మాతో కలిసి పనిచేయండి అంటూ ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఇంతకీ ఎవరీ నయా సోషల్ మీడియా సెన్సేషన్?సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ ‘బిట్టు తబాహి’(ఉర్దూలో ‘తబాహి’ అంటే విధ్వంసం). మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాలో నివసించే 21 ఏళ్ల యువ పర్యావరణ వాలంటీర్. పర్యావరణ ప్రేమికుడైన బిట్టు, ఒక రోజు తన ఇంటి సమీపంలో ప్రవహిస్తున్న అజ్నార్ నది పూర్తిగా కాలుష్యంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడాన్ని గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒంటిచేత్తో నదిని శుభ్రం చేసేందుకు పూనుకున్నాడు.సాయం కోసం ఎదురు చూడలేదు. డబ్బులు ఉన్నాయా? లేదా? అని ఆలోచించలేదు. ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డేని పురస్కరించుకొని నదిలో చెత్తను తొలగించే యజ్ఞాన్ని ప్రారంభించాడు. మొదట్లో బిట్టుకు అతని స్నేహితులు, స్థానికులు సాయం చేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ అతనొక్కడే సైన్యంలా మారాడు. కేవలం ప్రాథమిక పనిముట్లతో, సరైన భద్రతా పరికరాలు లేకుండా, ఈత కూడా రాకపోయినా, అతను చేతితో నది నుండి టన్నుల కొద్దీ చెత్తను బయటకు తీశాడు.👉ఇదీ చదవండి: సీఏని వదిలేయ్.. దోసెలేసుకో!ఈ క్రమంలో బిట్టు తబాహి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. రకరకాల ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు ఇబ్బంది పెట్టాయి. కొన్ని సార్లు పాముల బెడద ఎక్కువైంది. అయినా, వెనక్కి తగ్గకుండా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాడు. దీంతో బిట్టు లోకల్ హీరో అయ్యాడు. అతని పనితీరు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దృష్టిని ఆకర్షించడంతో, ఆయన బిట్టును తన ఇంటికి ఆహ్వానించారు. సీఎం అతని చొరవను ప్రశంసించడమే కాకుండా, ప్రభుత్వ మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.అతని ప్రయత్నాలకు ప్రశంసలు మాత్రమే కాకుండా, డచ్ స్వచ్ఛంద సంస్థ జాబ్ ఆఫర్ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాలుషితమైన నదిని నెలల తరబడి స్వతంత్రంగా శుభ్రం చేసిన యువకుడిగా అతన్ని ప్రశంసిస్తూ, నది ప్రక్షాళనకు ముందు, తర్వాత తీసిన చిత్రాలను డచ్ కంపెనీ ఫౌండర్, సీఈఓ ట్వీట్ చేశారు. అతని అంకితభావాన్ని చూసి ముగ్ధుడైన స్లాట్ వచ్చి మా దగ్గర పని చేయండి అంటూ బహిరంగంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A 20 year old Indian man, Surendra Singh Choudhry, known as “Bittu Tabahi,” has been cleaning the heavily polluted Ajnar River himself for months pic.twitter.com/U7N4BkItkf— non aesthetic things (@PicturesFoIder) September 4, 2026Come work for us @Surendr75950620— Boyan Slat (@BoyanSlat) September 4, 2026


