breaking news
anita sharma
-
Anita Sharma: కదలండి కదిలించండి
ఆమె పోలియో బాధితురాలు. ఐ.ఐ.ఎం. ఇండోర్‌లో పీహెచ్డీ చేసిన విద్యాధికురాలు. కాని ఆమె తన జీవితాన్ని దివ్యాంగుల కోసం అంకితం చేసింది. పట్టుదలగా డ్రైవింగ్ నేర్చుకోవడమేగాక దివ్యాంగులకు డ్రైవింగ్ నేర్పించే స్కూల్ నడుపుతోంది. ఏయే పరికరాలు అమర్చడం ద్వారా దివ్యాంగులు సులభంగా డ్రైవ్ చేయవచ్చో తెలుపుతోంది. ‘డ్రైవ్ ఆన్ మై ఓన్’ సంస్థ నడుపుతున్న డాక్టర్ అనితా శర్మ గురించి. అనితాశర్మకు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనిపించింది. జైపూర్ ఆమెది. జైపూర్‌లో పదిహేను, ఇరవై కాల్స్ చేసింది. ఎవరూ నేర్పించము అన్నారు. ఢిల్లీలో నేర్పుతారేమోనని అక్కడా ఒక పది, ఇరవై కాల్స్ చేసింది. అక్కడా ఎవరూ నేర్పము అన్నారు. కారణం? అనిత కుడికాలుకు పోలియో ఉంది. పోలియోతో బాధ పడుతున్నవారికి, లేదా ఇతర దివ్యాంగులకు కారు డ్రైవింగ్ నేర్పించే తర్ఫీదు డ్రైవింగ్ స్కూల్స్‌కు లేదు. అలా చేయడానికి అవసరమైన మోడిఫైడ్ కార్లు వారి దగ్గర ఉండవు. దివ్యాంగులు చక్రాల కుర్చీకి పరిమితం కావలసిందేనా? వారు తమకు తాముగా బయటకు తిరగకూడదా అనుకుంది అనితా శర్మ. తల్లి సహాయంతో... అనితా శర్మ ఇండోర్ ఐ.ఐ.ఎంలో పీహెచ్డీ చేసింది. అమృతసర్ ఐ.ఐ.ఎంలో ్ర΄÷ఫెసర్ ఉద్యోగం సం΄ాదించింది. అయితే ఆమెకు కారు నడ΄ాలన్న కోరిక మాత్రం తీరలేదు. ‘మొదట నేను అదనపు చక్రాలు బిగించిన టూ వీలర్ నడి΄ాను. నా ఆనందానికి అవధుల్లేవు. కారు నడిపితే ఎంత బాగుండో అనిపించింది. హ్యాండ్ కంట్రోల్ ఉండేలా కారును మోడిఫై చేయించి మా అమ్మ సహాయంతో నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా నా కారులో ప్రయాణించగలను. నేను కారు నడపడం చూసి చాలామంది దివ్యాంగులు మాకు నేర్పించవచ్చు కదా అనడిగేవారు. వారి కోసం పని చేయాలనిపించింది. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేసి‘డ్రైవ్ ఆన్ మై ఓన్’ సంస్థ స్థాపించాను. దివ్యాంగులకు కారు డ్రైవింగ్ నేర్పించి, సొంత కారు కొనుక్కోవడంలో అవసరమైన సాయం చేయడమే మా సంస్థ ఉద్దేశం’ అంటుందామె. కస్టమైజ్డ్ కార్లు అనితాశర్మ సంస్థ దివ్యాంగుల కోసం డ్రైవింగ్ క్లాసులు నిర్వహిస్తుంది. వెబినార్లు, సెమినార్లు నిర్వహిస్తుంది. దివ్యాంగుల కమ్యూనిటీలో ఒకరికొకరికి పరిచయాలు చేసి ్రపోత్సహించుకునేలా చేస్తుంది. శారీరక పరిమితులను అనుసరించి కారులో ఎటువంటి మోడిఫికేషన్ చేస్తే కారు నడపవచ్చో సూచిస్తుంది. ఆ మోడిఫికేషన్ పరికరాలు సమకూర్చడంలో సాయం చేస్తుంది. ఆ తర్వాత కార్ల రిజిస్ట్రేషన్, జిఎస్టి వంటివి దివ్యాంగుల పక్షంలో జరిగేలా చూస్తుంది. ‘ఇదంతా చేయడానికి మేము కొంత ఫీజు తీసుకుంటాం. దివ్యాంగులు ఛారిటీ మీద కాకుండా తమ కాళ్ల మీద తాము బతకాలన్నదే నా ఉద్దేశం’ అంటుంది అనితా శర్మ. కుటుంబ సభ్యులు ‘దివ్యాంగులు కారు నడపడానికి వారి కుటుంబసభ్యులను ఒప్పించడమే పెద్ద సమస్య. దివ్యాంగులు కారు నడపగలరు. వారిని డ్రైవింగ్ సీట్లో స్లయిడర్స్ ద్వారా సులువుగా చేర్చవచ్చు. కాళ్లతో పని లేకుండా చేతులతోనే మొత్తం కంట్రోల్ చేయొచ్చు. వారికి తిరగాలని ఉంటుంది. ధైర్యం చెప్పి సహకరించి తిరగనివ్వండి’ అని సూచిస్తోంది అనితా శర్మ. -
అప్పడాల కర్ర... బొప్పికట్టిన బుర్ర
పంజాబ్ ఎన్నికల్లో ఈ సారి ప్రత్యేక భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. అయితే వారు పోలీసులు కారు. ప్రభుత్వంతో వారికి సంబంధం లేదు. వారంతా బేలన్ బ్రిగేడ్ సభ్యులు. ఇప్పుడీ బేలన్ బ్రిగేడ్ మెంబర్లు పంజాబ్ ఎన్నికల్లో మద్యం, మాదకద్రవ్యాల ప్రభావాన్ని తగ్గించేందుకు కంకణం కట్టుకున్నారు. బేలన్ అంటే అప్పడాల కర్ర. అప్పడాల కర్రే ఆయుధంగా వీరు కదిలి ముందుకొస్తున్నారు. పోలీసులు లాఠీ వాడటానికి ఒకటికి రెండు సార్లు అలోచిస్తారేమో కానీ, ఈ బేలన్ బ్రిగేడ్ మాత్రం తమ అప్పడాలకర్రను ఇట్టే ఝళిపిస్తారు. మరో మాట మాట్లాడితే బాది పారేస్తారు. ఈ బేలన్ బ్రిగేడ్ ను లూఢియానాకి చెందిన 42 ఏళ్ల అనితా శర్మ ప్రారంభించారు. ఇప్పుడది పంజాబ్ అంతా విస్తరించింది. ఓటర్లను మభ్యపెట్టేందుకు అభ్యర్థులు, పార్టీలు మద్యాన్ని లేదా మాదక ద్రవ్యాలను ఇచ్చారని తెలిస్తే చాలు అప్పడాల కర్రలు బయలుదేరతాయి. ఆ తరువాత బొప్పికట్టిన బుర్రలు మిగులుతాయి. మామాలుగానే పంజాబ్ లో 70 శాతం జనాభా మత్తుపదార్థాలను వాడుతుంది. ఎన్నికల సమయంలో ఈ వాడకం మరింత పెరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థులు వోటర్లకు స్లిప్పులు ఇస్తున్నారు. వాటిని లిక్కర్ దుకాణాల్లో చూపిస్తే వారికి లిక్కర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎన్నికల తరువాత ఈ అప్పడాల కర్ర ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశంపై బేలన్ బ్రిగేడ్ ఆలోచిస్తోంది. అన్నట్లు ఈ బ్రిగేడ్ లో అంతా ఆదిపరాశక్తులే కాదు. అపర శంకరయ్యలూ ఉంటారు. వారి చేతుల్లో మాత్రం అప్పడాల కర్ర ఉండదు. వారు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచి, ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తారు.