-
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే .. ఆ ముగ్గరు స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్?
టీ20 వరల్డ్‌కప్-2024లకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్1న అమెరికా, కెనడా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే1లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపికను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ మీటింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోనున్నాడు. అయితే సెలక్టర్లు కంటే ముందు చాలా మంది మాజీ ఆటగాళ్లు టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే భారత జట్టును అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు చేరాడు.టీ20 ప్రపంచకప్‌కు తన 15 మంది ప్రాబబుల్స్‌ని రాయుడు ఎంచుకున్నాడు. రాయుడు ఎంచుకున్న జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. హార్దిక్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది.అదేవిధంగా ఐపీఎల్లో అదరగొడుతున్న పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌లకు రాయడు తన ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. అయితే అనుహ్యంగా రాయుడు వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లను కాకుండా దినేష్ కార్తీక్‌కు చోటు ఇవ్వడం గమనార్హం.దినేష్ కార్తీక్ ఈ ఏడాది సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఫినిషర్‌గా వచ్చి డీకే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే రాయుడు కార్తీక్‌కు అవకాశమిచ్చాడు. అంబటి ఎంచుకున్న జట్టులో టాప్-4లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి,సూర్యకుమార్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబే, రవీంద్ర జడేజాలకు రాయుడు అవకాశమిచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను రాయుడు ఎంపిక చేశాడు. #IncredibleStarcast expert @RayuduAmbati has picked 15 ambitious players for his #TeamIndia squad ahead of #T20WorldCup2024 & there's only one all-rounder, @imjadeja! 👀Participate in the biggest opinion poll ever on our social media handles (23rd April-1st May) and see if you… pic.twitter.com/1PB3TwATc8— Star Sports (@StarSportsIndia) April 24, 2024 -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్‌ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్‌కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్‌ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్‌లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్‌ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్‌లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేష్ కార్తీక్..? అతడికి అంత సీన్ లేదు!
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్, భారత వెటరన్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. లేటు వయస్సులో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లతో కార్తీక్ దుమ్మలేపుతున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గత సీజన్లో నిరాశపరిచిన కార్తీక్ ..ప్రస్తుత సీజన్లో మాత్రం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో డీకే అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓ దశలో మ్యాచ్‌ను ఫినిష్ చేసేలా కన్పించిన కార్తీక్.. ఆఖరికి నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కార్తీక్‌కు టీ20 వరల్డ్‌కప్ 2024 భారత జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడించాలని రాయడు అన్నాడు. "కార్తీక్ తన కెరీర్లో ఎక్కువగా ఎంఎస్ ధోనితో పోటీపడ్డాడు. ధోని కెప్టెన్‌గా, రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉండడంతో కార్తీకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే డీకే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తన కెరీర్లో చివరిసారిగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నానను. అతడికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే అవకాశముంది. అంతేకాకుండా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి, తన కెరీర్‌ను ఘనంగా ముగించిడానికి కార్తీక్‌కు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి డికేనే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నానని" రాయడు స్టార్‌స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. పఠాన్ నవ్వుతూ ఐపీఎల్ వేరు, వరల్డ్‌కప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా వరల్డ్‌కప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని, కచ్చితంగా తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. -
IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు!
"This is why they have not won the IPL for so many years": రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని వ్యాఖ్యానించాడు. కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుపెస్లిస్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 28 రన్స్‌తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 స్టార్లు ఒక్కసారైనా రాణించారా? ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్‌గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. బిగ్ ప్లేయర్లంతా టాపార్డర్‌లో ఉంటారు. కేక్ తినగా మిగిలిన క్రీమ్‌ను వదిలేసినట్లు డౌన్ ఆర్డర్లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే ఆడటం చూస్తున్నాం. పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్ రూంలోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో! అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్ తర్వాత ఐపీఎల్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#Dhoni: బ్యాడ్‌న్యూస్.. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఇక అంతే!
IPL 2024 CSK vs DC: విశాఖపట్నంలో అద్భుత బ్యాటింగ్‌తో అసలైన టీ20 మజాను అందించాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో తనదైన శైలిలో షాట్లు బాదుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాడు. నలభై రెండేళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ఐపీఎల్-2024లో బ్యాటింగ్ వచ్చిన తొలిసారే తన పవరేంటో చూపించాడు. ముఖ్యంగా ఒంటిచేత్తో ధోని బాదిన షాట్ అతడి ఇన్నింగ్స్‌కే కాదు మ్యాచ్‌లోనూ హైలెట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు.అయితే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇంత చేసినా ధోని సీఎస్కేను గెలిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచింది. కానీ.. తదుపరి మ్యాచ్ నుంచి ధోని బ్యాటింగ్ మెరుపులు చూసే అవకాశం తప్పక వస్తుందనే నమ్మకం కుదిరిందని సంతోషిస్తున్నారు. అయితే, మాజీ క్రికెటర్, సీఎస్‌కు ఆడిన అంబటి రాయుడు మాత్రం ఇప్పుడే అంతగా సంబరపడిపోవద్దని అంటున్నారు. ఇకపై బ్యాటింగ్ ఆర్డర్లో ధోని ముందు వచ్చే ఛాన్స్ ఉందా ప్రశ్నకు బదులిస్తూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత అతడు కచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాడు.ఎందుకంటే.. లోయర్ ఆర్డర్లో వచ్చి సీఎస్కేను గెలిపించగల సత్తా ఉన్న ధోని ఆత్మవిశ్వాసం ఈ ఇన్నింగ్స్‌తో మరింత పెరిగిందని చెప్పవచ్చు. నిజానికి.. ధోని ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్‌కు వస్తే చూడాలనుకునే మనలాంటి వాళ్ల ఆశలకు ఇక గండిపడినట్లే’’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో కామెంటేటర్‌గా ఉన్న రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో.. ఇలా తన అభిప్రాయం పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024 సందర్భంగా కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన వికెట్ కీపర్ బ్యాటర్ ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. ధోని .. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement