ఓటు బ్యాంకు రాజకీయాలకు గుణపాఠం | Sakshi
Sakshi News home page

ఓటు బ్యాంకు రాజకీయాలకు గుణపాఠం

Published Sat, May 4 2024 1:00 AM

ఓటు బ్యాంకు రాజకీయాలకు గుణపాఠం

గద్వాల అర్బన్‌: బీఆర్‌ఎస్‌, బిజేపీ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకున్నాయని.. వారికి రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని అఖిల భారత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్‌ రాజు అన్నారు. ఎంపీ ఆభ్యర్ధి మల్లురవికి మద్దతుగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌, బిజేపీల పాలనలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయలేదని, కేంద్రంలో మరోసారి బిజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా రిజర్వేషన్లు కూడా పూర్తిగా తొలగించి, అట్టగడుగు వర్గాలకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు అందకుండా చేస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్‌ను ఏవిధంగా ఆదరించారో.. కేంద్రంలోనూ ఆదరించాలని కోరారు. అంతకు ముందు జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సన్మానించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, శ్రీనివాసులు, మహ్మద్‌ చాంద్‌, కృష్ణగౌడ్‌, కౌన్సిలర్‌ నరహరి గౌడ్‌, నాగేందర్‌ యాదవ్‌, తిమోతి, జమ్మిచేడు ఆనంద్‌, అమరవాయి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement