టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Fri, Aug 18 2017 5:27 PM

today news roundup

సాక్షి, హైదరాబాద్‌: పులివెందులను అభివృద్ధి చేసిన తరహాలోనే నంద్యాలను కూడా అలానే చేస్తానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. నంద్యాల  ఉప ఎన్నిక ప్రచారం లో పాల్గొన్న ఆయన అభివృద్ధి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల  నమ్మిన న్యాయానికే ఓటేయాలన్నారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ ఓటమి తథ్యమని పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలిసిపోయింది కాబట్టే ఆ పార్టీకి తన మద్దతు ప్రకటించలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తెలంగాణ విషయానికి వస్తే బీజేపీలో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. మరిన్ని వార్తలు మరోసారి మీకోసం..

<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>

ఎలాంటి భయాలు వద్దు: వైఎస్‌ జగన్‌
పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలనుకున్నానో, నంద్యాలను కూడా అలానే చేస్తా. నంద్యాల అభివృద్ధి గురించి ఎవరూ భయపడకండి. మీరు న్యాయానికి ఓటేయండి..

పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలిసిపోయింది: రోజా
నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ ఓటమి తథ్యమని పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలిసిపోయింది కాబట్టే ఆ పార్టీకి తన మద్దతు ప్రకటించలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు.

సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష
అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లుకు ఉరి శిక్ష విధిస్తూ సెషన్స్‌ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది.

బీజేపీలో చేరడానికి చాలా మంది రెడీ
బీజేపీలో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వెల్లడించారు.

'పాలమూరుకు తొలి శత్రువు ఆయనే'
మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి మండిపడ్డారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>

చైనాకు చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధం!
కీలక రంగాల్లో చైనా కంపెనీల ప్రవేశానికి చెక్‌ పెట్టేందుకు విద్యుత్‌, టెలికం నిబంధనలను భారత్‌ కఠినతరం చేయనుంది.

23న సీబీఐ ఎదుటకు కార్తీ చిదంబరం
అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసుకు సంబంధించి ఈనెల 23న సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ కేం‍ద్ర మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఓడిపోయినా తిరిగి మంత్రిని అవుతా!
తాను ఓడిపోయినా ఫర్వాలేదని, కేంద్ర రక్షణ మంత్రి పదవి తిరిగి ఎదురు చూస్తోందంటూ పారికర్‌.

బరువు 15 కేజీలు దాటితే బాదుడే బాదుడు!
తక్కువ ధరలకే విమానయాన సేవలు అందిస్తోన్న స్పైస్‌జెట్‌ సంస్థ ఇక.. చెకిన్‌ బ్యాగేజీపై భారీ రుసుము వసూలుచేయనున్నట్లు తెలిసింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>

స్పెయిన్‌లో ఉగ్ర దాడి
స్పెయిన్‌పై ఉగ్రదాడి జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బార్సిలోనాలోని లాస్‌ రాంబ్లాస్‌లో పర్యాటకులపైకి గురువారం సాయంత్రం వేగంగా వచ్చిన ఓ వ్యాన్‌ దూసుకెళ్లింది.

డోక్లామ్‌ ఇష్యూ.. మా మద్ధతు భారత్‌కే...
సిక్కిం సరిహద్దులో డోక్లామ్‌ వద్ద ఇరు దేశాల సైన్యం మోహరించి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ ఆసియా దేశం భారత్‌ కు మద్ధతుగా వ్యాఖ్యలు చేసింది.

బార్సిలోనాపై టెర్రరిస్టుల దాడులెందుకు?
స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనందునే బార్సిలోనాను ఇస్లామిక్‌ తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడి జరిపారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>

విశాల్‌ సిక్కాపై మూర్తి కౌంటర్‌ ఎటాక్‌
విశాల్‌ సిక్కా రాజీనామాతో, ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌కు, వ్యవస్థాపకులకు మధ్య వివాదం మరింత ముదిరింది.

84 విమానాలు రద్దు చేసిన ఇండిగో
బడ్జెట్‌ క్యారియర్‌ ఇండిగో 84 విమానాలను శుక్రవారం రద్దు చేసింది.

సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్‌
విశాల్‌ సిక్కా తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇన్ఫోసిస్‌ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి.

<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>

ప్రభాస్ మొదలెట్టేశాడు..!
బాహుబలి 2 రిలీజ్ తరువాత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు

'ఆనందో బ్రహ్మా' మూవీ రివ్యూ
రెగ్యులర్ హర్రర్ కామెడీలకు భిన్నంగా దెయ్యాలే మనుషులని చూసి భయపడే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ

బాలయ్య దండయాత్ర..!
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్.

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>

మెకల్లమ్ రికార్డును బ్రేక్ చేశాడు!
ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్ ఆడమ్ లైత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

భారత్ కు వచ్చే ఆసీస్ జట్టు ఇదే..
వచ్చే నెల్లో భారత్ తో ఆరంభం కానున్న వన్డే, ట్వంటీ 20 సిరీస్ కు సంబంధించి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును శుక్రవారం ప్రకటించారు.

'మా స్ఫూర్తి కోహ్లిలో ఉంది'
ప్రపంచ క్రికెట్ లో పరుగుల మెషీన్ గా దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని చూస్తే తనకు ఆస్ట్రేలియా క్రికెటర్లే గుర్తుకువస్తారని అంటున్నాడు ఆ దేశ క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.

'వరల్డ్ కప్ విన్నింగ్ షాట్ నాదే కావాలి'
వచ్చే రెండేళ్లలో తన అంతర్జాతీయ క్రికెట్ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై భారత స్పెషలిస్టు బ్యాట్స్‑మన్ సురేశ్ రైనా పెదవి విప్పాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement