'మా స్ఫూర్తి కోహ్లిలో ఉంది'

'మా స్ఫూర్తి కోహ్లిలో ఉంది'


సిడ్నీ: ప్రపంచ క్రికెట్ లో పరుగుల మెషీన్ గా దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని చూస్తే తనకు ఆస్ట్రేలియా క్రికెటర్లే గుర్తుకువస్తారని అంటున్నాడు ఆ దేశ క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. ప్రధానంగా పోరాట స్ఫూర్తిలో ఆసీస్ క్రికెటర్లను విరాట్ మైమరిపిస్తూ ఉంటాడని ప్రశంసించాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కోహ్లిని ఫీల్డ్ లో ఎప్పుడూ చూసినా అక్కడ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉన్నట్లు కనబడుతుందని క్లార్క్ కొనియాడాడు. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో కోహ్లికి ఎక్కువ శాతంలో అభిమానులు లేరంటూ వస్తున్న వార్తలను క్లార్క్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదని, ఆ వార్తలతో తాను ఎంతమాత్రం ఏకీభవించనన్నాడు.


 


'ఆస్ట్రేలియాలో కోహ్లికి ఎక్కువ శాతం అభిమానులు లేరనే వార్తలతో నేను ఆమోదించను. ఆస్ట్రేలియాలో విరాట్ కు చాలా ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారనే అనుకుంటున్నా. నిజాయితీగా చెప్పాలంటే.. కఠినమైన క్రికెట్ గేమ్ లో విరాట్ ఫీల్డ్లో చురుగ్గా కదిలే తీరు ఆసీస్ ఆటగాళ్లనే జ్ఞప్తికి తెస్తుంది. ఆసీస్ క్రికెటర్ల లక్షణాలు విరాట్ లో మెండుగా ఉన్నాయి. నాకు విరాట్ తో మంచి సంబంధాలున్నాయి. అతనంటే నాకు చాలా గౌరవం. విరాట్ కు ఆసీస్ లో అత్యధిక ఫ్యాన్స్ లేరంటూ చెప్పడం కరెక్ట్ కాదు. విరాట్ పై వ్యతిరేక కథనం రాసే క్రమంలో మా మీడియా అలా చెప్పి ఉండొచ్చు. అయితే అది నిజం కాదు'అని ప్రస్తుతం పుణెలో ఉన్న క్లార్క్ పేర్కొన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top