అత్యాచార యత్నం కేసులో టీచర్ అరెస్ట్ | Teacher arrested in rape case | Sakshi
Sakshi News home page

అత్యాచార యత్నం కేసులో టీచర్ అరెస్ట్

Apr 14 2016 3:18 AM | Updated on Sep 15 2018 5:45 PM

అత్యాచార యత్నం కేసులో టీచర్ అరెస్ట్ - Sakshi

అత్యాచార యత్నం కేసులో టీచర్ అరెస్ట్

పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచార ప్రయత్నం చేసిన టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వేలూరు: పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచార ప్రయత్నం చేసిన టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు జిల్లా నాట్రంబల్లి తాలుకా నాయన్‌చెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అదే గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. సోమవారం పదో తరగతి పరీక్షలు ముగియడంతో పరీక్షలకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి రాలేదు. అయితే బాలిక తల్లి దండ్రులు గాలించడంతో ఆతూర్ కుప్పం ప్రాంతంలోని అదే పాఠశాల టీచర్ సుధాకర్ ఇంటి సమీపంలో విద్యార్థిని ఉన్నట్లు గుర్తించారు. అనంతరం విద్యార్థిని వద్ద విచారించగా టీచర్ సుధాకర్ కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేసినట్లు తల్లిదండ్రులకు తెలిపింది.

టీచర్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ సుధాకర్‌ను పట్టుకొని గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం డీఎస్పీ సుందరం విద్యార్థిని వద్ద జరిపిన విచారణలో టీచర్ విద్యార్థిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. వెంటనే విద్యాశాఖ సీఈవో భూపతికి సమాచారం అందజేశారు. విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు టీచర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు చర్చలు జరిపి గ్రామస్తుల చేత ధర్నా విరమింపజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement