ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్ | Six-year-old raped by neighbour in Howrah | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్

Aug 17 2013 12:22 PM | Updated on Jul 28 2018 8:44 PM

నగరంలోని నిశ్చిందా ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అరుణ్ అగర్వాల్ (38)ను శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు హౌరాలో వెల్లడించారు.

నగరంలోని నిశ్చిందా ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అరుణ్ అగర్వాల్ (38)ను శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు హౌరాలో వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకర్ల సమావేశంలో వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన అరుణ్ తన ఇంటికి ఎదురుగా నివాసిస్తున్న ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ విషయం ఎవరికైన వెల్లడిస్తే చిన్నారిని చంపుతానని బెదిరించాడు. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులను హతమారుస్తానని ఆ చిన్నారిని హెచ్చరించాడు. దీంతో ఆ చిన్నారి తీవ్ర భయాందోళనకు గురైంది.


ఈ క్రమంలో ఆ చిన్నారి తీవ్ర అనారోగ్యానికి లోనైంది. దీంతో ఆ పాప తల్లితండ్రులు హుటాహుటిన హౌరాలోని ఆసుపత్రికి తరలించారు. పాపపై అత్యాచారం జరిగిందని వైద్యులు ఆ పాప తల్లితండ్రులకు వెల్లడించారు. దాంతో అసలు జరిగిన విషయాన్ని ఆ చిన్నారి తల్లితండ్రులకు తెలియజేసింది. దాంతో ఆగ్రహాం చెందని ఆ చిన్నారి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అత్యాచార నిందితుడు అరుణ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు  వివరించారు. తమ విచారణలో చేసిన తప్పును అరుణ్ ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement