ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ ముఖానికి ఒక కార్యకర్త సిరా పులమడం స్వల్పఉద్రిక్తతకు దారి తీసింది.
ఆప్ సీనియర్ నేతపై 'ఇంక్' పడింది!
Mar 8 2014 6:32 PM | Updated on Aug 20 2018 3:46 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ ముఖానికి ఒక కార్యకర్త సిరా పులమడం స్వల్పఉద్రిక్తతకు దారి తీసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జంతర్ మంతర్ వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతోపాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఒకవ్యక్తి ఆయన ముఖానికి సిరా రాశాడు. యాదవ్ మీడియా ప్రతినిధులతో మాట్తాడుతుండగా ఆప్ టోపీ తలపై పెట్టుకున్న వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు. అకస్మాత్తుగా ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేస్తూ తన చేతులతో యాదవ్ ముఖానికి సిరా పులిమాడు. వెంటనే అప్రమత్తమైన ఆమ్ ఆద్మీపార్టీ కార్యక ర్తలు అతణ్ని పట్టుకున్నారు.
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని పార్లమెంట్‌వీధి స్టేషన్‌కు తీసుకెళ్లారు. తన పేరు సాగర్ భండారీ అని, తాను షాలిమార్‌బాగ్‌వాసినని వెల్లడించాడు. తానూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తనేనని తెలిపాడు.కాగా అతను ఎవరో తెలియదని యోగేంద్ర యాదవ్ తెలిపారు. తాను మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆ యువకుడు సిరాతో దాడి చేశాడన్నారు.ఇప్పుడు వెనుక నుంచే దాడి చేయడానికి యత్నించారు. తరువాత ముందునుంచే దాడి చేసే అవకాశం ఉందని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
Advertisement
Advertisement