24న కేబినెట్ భేటీ | Telangana cabinet meeting to be held on October 24 | Sakshi
Sakshi News home page

24న కేబినెట్ భేటీ

Oct 22 2014 3:10 AM | Updated on Sep 2 2017 3:13 PM

తెలంగాణ మంత్రిమండలి సమావేశం రెండున్నర నెలల విరామం అనంతరం, దీపావళి మరుసటి రోజు జరుగనుంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశం రెండున్నర నెలల విరామం అనంతరం, దీపావళి మరుసటి రోజు జరుగనుంది. ఈ నెల 24న సాయంత్రం ఆరు గంటలకు సచివాలయంలోని ‘సీ’ బ్లాక్‌లో కేబినెట్ సమావేశం కానుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి కేబి నెట్ భేటీలో ఎన్నికల హామీలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మంత్రివర్గం సమావేశం కాలేదు.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు జరుగనున్న ఈ సమావేశంలో గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించడంతోపాటు, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నారు.  విద్యుత్ సమస్య, పెన్షన్లు, ఆహార భద్రతాకార్డుల దరఖాస్తుల పరిశీలన వంటి అంశాలపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు, ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. విద్యు త్, రుణమాఫీ అంశాలు చర్చకు రానున్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాల స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఇప్పటికే ఉన్నతాధికారులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement