సీఎం పదవి బీసీలకే ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య | R. Krishnaiah Meet Digvijay Singh | Sakshi
Sakshi News home page

సీఎం పదవి బీసీలకే ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య

Mar 14 2014 2:33 PM | Updated on Aug 14 2018 3:55 PM

సీఎం పదవి బీసీలకే ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య - Sakshi

సీఎం పదవి బీసీలకే ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య

తెలంగాణలో సీఎం పదవి బీసీలకే ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు.

హైదరాబాద్: తెలంగాణలో సీఎం పదవి బీసీలకే ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను ఆయన కలిశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 50 శాతం టిక్కెట్లు బీసీలకే ఇవ్వాలని ఈ సందర్భంగా దిగ్విజయ్ను కోరారు.

చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య డిమాండ్‌లను హైకమాండ్ పరిశీలిస్తుందని దిగ్విజయ్‌ సింగ్ హామీయిచ్చారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ పరిశీలిస్తుందని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement