సాయంత్రం ఫామ్హౌస్కు కేసీఆర్ | KCR going to his farmhouse today evening | Sakshi
Sakshi News home page

సాయంత్రం ఫామ్హౌస్కు కేసీఆర్

Aug 4 2014 11:35 AM | Updated on Jun 4 2019 5:04 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 5వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 5వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆడంబరం వద్దు...నిరాడంబరంగానే పర్యటన ఉంటుందన్న కేసీఆర్ ఆదేశం మేరకు పైలాన్ పనులను నిలిపివేశామని ఎమ్మెల్యే కమలాకర్ తెలిపారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ జిల్లాకు వస్తున్నారు.

 

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 7న నిజామాబాద్, 8న ఆదిలాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. మరోవైపు కేసీఆర్ సోమవారం సాయంత్రం ఫామ్హౌస్కు వెళ్లనున్నారు. ఆయన రాత్రి అక్కడే బస చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement