తెలంగాణలో పలుచోట్ల వడగళ్లవాన.. | Heavy rain in several districts of telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పలుచోట్ల వడగళ్లవాన..

May 1 2016 6:42 PM | Updated on Sep 3 2017 11:12 PM

తెలంగాణ రాష్ట్రంలోని పలుజిల్లాలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

వరంగల్‌: తెలంగాణ రాష్ట్రంలోని పలుజిల్లాలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరంగల్‌ జిల్లాలోని మద్దురు మండలం బైరాన్‌పల్లిలో వడగళ్ల వాన కురిసింది. నల్గొండ జిల్లాలో రామన్నపేట, చిట్యాల మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మర్రిగూడ మండలం నర్సింహాపురంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతిచెందాడు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌ నగరంలో వాతావరణం చల్లబడినట్టుగా కనిపిస్తోంది. నగరంలో పలుచోట్ల ఓ మోస్తారు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement