‘సినిమా టికెట్ల ధరలు తగ్గించండి’  | GST Commissioner Orders To Reduce Cinema Ticket Fares | Sakshi
Sakshi News home page

Feb 3 2019 3:44 AM | Updated on Feb 3 2019 3:44 AM

GST Commissioner Orders To Reduce Cinema Ticket Fares - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తగ్గించిన జీఎస్టీ ప్రకారం వెంటనే సినిమా టికెట్ల ధరలు తగ్గించాలని జీఎస్టీ కమిషనరేట్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో జనవరి 1 నుంచి రూ.100కు మించి ఉన్న సినిమా టికెట్ల ధరలను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామని, తగ్గించిన ధరల ప్రకారం టికెట్లు అమ్ముతున్నారా? లేదా? అనేదానిపై సినిమాహాళ్లపై శనివారం జీఎస్టీ అధికారుల బృందం దర్యాప్తు చేసిందన్నారు. ప్రసాద్‌ఐమాక్స్‌ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిందని, దీనిపై కేసు నమోదు చేసి ‘యాంటీ ప్రొఫెటీరింగ్‌ సంస్థ’కు అప్పగించామని చెప్పారు. అన్ని సినిమాహాళ్ల యాజమానులు తగ్గించిన జీఎస్టీ ప్రకారం టికెట్లు అమ్మాలని, తగ్గించని వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌ హెచ్చరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement