విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంటలు | fire accident in power sub-station | Sakshi
Sakshi News home page

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంటలు

Mar 31 2015 5:29 PM | Updated on Sep 18 2018 8:38 PM

ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ధ్వంసం అయిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో మంగళవారం చోటు చేసుకుంది.

రాయపర్తి : ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ధ్వంసం అయిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో మంగళవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కొండూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం అకస్మాత్తుగా భారీ స్థాయిలో మంటలు ఎగసిపడటంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సాంకేతిక కారణాల వల్ల సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 35 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement