స్మార్ట్‌ రేషన్‌కార్డులో హీరోయిన్‌ ఫోటో..!

స్మార్ట్‌ రేషన్‌కార్డులో హీరోయిన్‌ ఫోటో..!


అన్నానగర్‌: స్మార్ట్‌ రేషన్‌కార్డులో కుటుంబ యాజమాని ఫోటో స్థానంలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఫోటో వచ్చింది.  ఈ సంఘటన సేలంలో మంగళవారం కలకలం రేపింది. ఎన్నికల కమిషన్‌ సం‍స్థ అచ్చువేసి ఇచ్చే రేషన్‌కార్డులో పురుషుల పేరు స్థానంలో మహిళల పేరు, ఫోటోలు మార్పులు గతంలో అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. ఈ తప్పిదాలను తొలగించటానికి ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటూ వస్తుంది.ఇదిలా ఉండగా ప్రస్తుతం తమిళ ప్రభుత్వం స్థానికులకు వినియోగం చేస్తూ వచ్చే స్మార్ట్‌ రేషన్‌కార్డులో కుటుంబ యజమాని ఒకరి ఫోటో స్థానంలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఫోటో మారి వచ్చిన  ఘటన సేలంలో చోటుచేసుకుంది. వివరాలివి.. సేలం జిల్లా ఓమలూరు తాలుకా ఆర్‌సి చెట్టిపట్టి కమలాపురం ప్రాంతానికి చెందిన సరోజ. ఈమె పేరుతో కుటుంబ యజమాని అని ముద్రించి వచ్చిన కార్డులో సరోజ ఫోటోకి బదులుగా నటి కాజల్‌ ఫోటో వచ్చింది.మంగళవారం ఉదయం రేషన్‌కార్డును డీలర్‌ సరోజకి ఇచ్చేటప్పుడే దీనిని చెప్పి సరిచేసి ఇస్తామని ఇచ్చారు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు స్మార్ట్‌ కార్డు జారీ చేసిన సిబ్బందుల వద్ద వారు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ స్మార్ట్‌ రేషన్‌కార్డు ప్రస్తుతం వాట్సాప్‌లో రావటం ప్రారంభమైంది. ఇటువంటి సంఘటనలు మరలా రాకుండా ఉండేందుకు అధికారులు తగ్గిన చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు.

Back to Top