ఆటో, బైక్‌ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు | two injured in Tata ace and bike collisioned incident | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్‌ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు

Jul 28 2017 5:48 PM | Updated on Sep 5 2017 5:05 PM

టాటా ఏస్ ఆటోను, బైక్ ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

అచ్చంపేట: టాటా ఏస్ ఆటోను, బైక్ ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం జరగింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement