జూరాలకు పొటెత్తుతున్న వరద | floods flow to jurala project | Sakshi
Sakshi News home page

జూరాలకు పొటెత్తుతున్న వరద

Sep 17 2016 11:37 AM | Updated on Aug 1 2018 3:59 PM

మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

గద్వాల: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 57,500 క్యూసెక్కులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండు గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి 65,650 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ కుడి కాలువకు 150 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement