హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ సోమవారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్(70 నాటౌట్;54 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ గా వచ్చిన వార్నర్ కడవరకూ క్రీజ్ లో ఉండి ఒంటరి పోరాటం చేశాడు. ఆ తరువాత నమాన్ ఓజా(34;20 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక మిగతా వారు విఫలం కావడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
గత రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలై తీవ్ర ఒత్తిడిలో ఉన్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించింది. శిఖర్ ధావన్, వార్నర్ లు నిలకడగా ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ను అందుకున్న కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ హైదరాబాద్ కు షాకిచ్చాడు. ఓ చక్కటి బౌన్సర్ తో శిఖర్(15) ను బోల్తా కొట్టించాడు. లెగ్ స్టంప్ వైపు వచ్చిన ఆ బౌన్సర్ ను శిఖర్ హుక్ చేయబోయి సాహాకు దొరికేశాడు. దాంతో 25 పరుగుల వద్ద హైదరాబాద్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఆపై హెన్రిక్స్(9), యువరాజ్ సింగ్(0)లు వరుసగా అవుట్ కావడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో నమాన్ ఓజాతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 60 పరుగుల జోడించిన తరువాత ఓజా నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. ఇక ఆపై వార్నర్ కు సహకారం లభించకపోవడంతో హైదరాబాద్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్ బౌలర్లలో మోహిత్ శర్మ,అక్షర్ పటేల్ లు తలో రెండు వికెట్లు సాధించగా, సందీప్ శర్మ,కరియప్పలకు చెరో వికెట్ దక్కింది.
వార్నర్ ఒంటరి పోరు
Published Mon, Apr 17 2017 9:50 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు.. రింకూ ఆసక్తికర వ్యాఖ్యలు
రజనీకాంత్ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్‌తో.. (ఫోటోలు)
కవితపై ఈడీ ఛార్జ్‌షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
గ్రాండ్‌గా జరిగిన 'డర్టీ ఫెలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్
తప్పక చదవండి
- కవితపై ఈడీ ఛార్జ్‌షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
Advertisement