‘సిన్సినాటి’ చాంప్స్‌ దిమిత్రోవ్, ముగురుజా | US Open Grand Slam warm-up tournament | Sakshi
Sakshi News home page

‘సిన్సినాటి’ చాంప్స్‌ దిమిత్రోవ్, ముగురుజా

Aug 22 2017 12:32 AM | Updated on Aug 24 2018 8:52 PM

‘సిన్సినాటి’ చాంప్స్‌ దిమిత్రోవ్, ముగురుజా - Sakshi

‘సిన్సినాటి’ చాంప్స్‌ దిమిత్రోవ్, ముగురుజా

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సన్నాహక టోర్నీల్లో భాగమైన సిన్సినాటి మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌...

ఒహాయో: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సన్నాహక టోర్నీల్లో భాగమైన సిన్సినాటి మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా), మహిళల సింగిల్స్‌లో ముగురుజా (స్పెయిన్‌) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో దిమిత్రోవ్‌ 6–3, 7–5తో నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా)పై... నాలుగో సీడ్‌ ముగురుజా 6–1, 6–0తో రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)పై విజయం సాధించారు.

చాంపియన్స్‌గా నిలిచిన దిమిత్రోవ్‌కు 9,54,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 12 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు... ముగురుజాకు 5,22,450 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 35 లక్షలు)తోపాటు 900 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement